మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

After COVID Vaccine Recovery rate and Re Initiate corona

vaccination తర్వాత 0.04% మందికే కొవిడ్‌ కీలక డేటాను విడుదల చేసిన కేంద్రం

ఐసీఎంఆర్‌ విడుదల చేసిన డేటా ప్రకారం భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను ఇప్పటివరకు 1.1 కోట్ల మంది తీసుకున్నారు. ఇందులో 93 లక్షల మంది మొదటి డోసు వేసుకోగా 17 లక్షల మంది రెండు డోసులూ స్వీకరించారు. 

మొదటి డోసు తీసుకున్న వారిలో 4,208 మంది కొవిడ్‌ బారిన పడగా.. రెండో డోసు తీసుకున్న వారిలో కేవలం 695 మందికి మాత్రమే కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అంటే రెండు డోసులు తీసుకున్న వారిలో కొవిడ్‌ బారిన పడుతున్నవారు 0.04 శాతం మాత్రమే అని డేటా చెబుతోంది.

ఇక సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కూడా స్వల్ప సంఖ్యలోనే కొవిడ్‌ బారిన పడినట్లు డేటా విశ్లేషిస్తోంది. 11.6 కోట్ల మంది ఇప్పటి వరకు కొవిషీల్డ్‌ తీసుకోగా.. తొలి డోసు తీసుకున్న 10 కోట్ల మందిలో 17,145 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అలాగే రెండు డోసులూ తీసుకున్న కోటిన్నర మందిలో కేవలం 5,014 మంది మాత్రమే కొవిడ్‌ బారిన పడినట్లు ఈ డేటా వెల్లడిస్తోంది. దీని ప్రకారం కొవిషీల్డ్‌ రెండు డోసులూ తీసుకున్న మొత్తం జనాభాలో 0.03 శాతం మంది మాత్రమే కొవిడ్‌ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు సంబంధించిన డేటా ఆధారంగా ఈ శాతాలను నిర్ధారించినట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు

1 comment:

  1. I found this blog informative or very useful for me. I suggest everyone, once you should go through this.

    Immunity Booster Drinks

    ReplyDelete