2025-26లో జరగబోయే FA 3 పరీక్షలలో TaRL మిడ్ లైన్ పరీక్షను పొందుపరచడం జరిగింది
ఇందులో భాగంగా అసెస్మెంట్ బుక్లెట్ లోని FA 3 విభాగంలో Tool 2 పేజ్ లో రైటింగ్ పార్ట్ ఇవ్వడం జరిగింది. ఈ Tool 2 విభాగం మొత్తం TaRL Assessment కే కేటాయించడం జరిగింది దీనికి సంబంధించిన మార్కులు OMR షీట్ లో నమోదు చేయాలి
OMR షీట్ లోని Part E విభాగంలో Tool 2 నందు 0 నుంచి 5 (0,1,2,3,4,5) వరకు అంకెలు ఇవ్వడం జరిగింది. అందులో మనం 1-5 వరకు మాత్రమే TaRL టెస్టింగ్ సంబంధించిన స్థాయిలను నమోదు చేయాలి. ‘0’ లెవల్ ను మనం పరిగణించకూడదు.
TaRL తెలుగు స్థాయిలు
1 - ప్రారంభ స్థాయి
2 - అక్షర స్థాయి
3 - పదాల స్థాయి
4 - పేరా స్థాయి
5 - కథా స్థాయి
TaRL గణితం స్థాయిలు
1 - ప్రారంభ స్థాయి
2 - కూడిక స్థాయి
3 - తీసివేత స్థాయి
4 - గుణకారం స్థాయి
5 - భాగాహారం స్థాయి
పై స్థాయిల ఆధారంగా పిల్లవాడి యొక్క అత్యున్నత స్థాయిని మాత్రమే నమోదు చేయాలి.
ఉదా: పిల్లవాడి యొక్క స్థాయి పదాల స్థాయి అయితే ఆ పిల్లవాడిని OMR షీట్ లోని Tool 2 నందు 3 నంబరు వద్ద మాత్రమే బబుల్ చేయవలెను.
ఉదా: పిల్లవాడి యొక్క స్థాయి తీసివేత స్థాయి అయితే ఆ పిల్లవాడిని OMR షీట్ లోని Tool 2 నందు 3 నంబరు వద్ద మాత్రమే బబుల్ చేయవలెను.
( ఆ పిల్లవాడి అత్యున్నత స్థాయి ఏదైతే ఉంటుందో ఆ నంబరు కు మాత్రమే బబుల్ చేయాలి ).
TaRL టెస్టింగ్ చేయు విధానం
టెస్టింగ్ టూల్స్ మీకు ఆల్రెడీ FA 2 పరీక్ష నిర్వహించినప్పుడు అందజేయడం జరిగింది ఆ శాంపుల్స్ నే వాడాలి
FA 3 Part E భాగం లోని టెస్టింగ్ ను మనం ASER టెస్టింగ్ Tool ద్వారా నిర్వహిస్తాము.
ఈ టెస్టింగ్ Tool లో 4 శాంపిల్స్ (1,2,3,4) ఉంటాయి.
ఈ శాంపిల్స్ ను
మిడ్ లైన్ పరీక్షకు 3, 4 శాంపిల్స్ ను వాడాలి
సూచన : ఒక విద్యార్థికి శాంపిల్ 3 ఇస్తే తరువాత విద్యార్థికి శాంపిల్ 4 వాడాలి తరువాత మూడో విద్యార్థికి మరల శాంపిల్ 3 ను వాడాలి నాలుగవ విద్యార్థికి శాంపిల్ 4 వాడాలి ఇలా ప్రతి విద్యార్థికి శాంపిల్స్ మారుస్తూ టెస్టింగ్ ను నిర్వహించాలి.
టెస్టింగ్ ప్రాసెస్
ముందుగా పిల్లవాడితో స్నేహపూర్వకంగా మాట్లాడాలి అలాగే పిల్లవాడికి పరీక్ష పెడుతున్నాం అనే భావన లేకుండా టెస్టింగ్ ను నిర్వహించాలి
No comments:
Post a Comment