Pages
మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
📚 Student Fluency & Learning Hub
Select Subject
🏆 Student Score Ladderboard (Local Storage)
Scores are saved per student in this browser.
| Student | English Avg % | Telugu Avg % | Maths Avg % | Total Average % |
|---|
School Education Department - Mega DSC 2025 - Instructions for admitting salaries of newly appointed teachers with effect from 03-10-2025
Commisioner of school education WebEx meeting instructions
గౌరవ స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ గారు ఈరోజు నిర్వహించిన వెబెక్స్ మీటింగ్ ద్వారా జారీచేసిన ఆదేశాలు
1. నవంబర్ 15 తరువాత DIET విద్యార్థుల చేత అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలలో ఫౌండేషనల్ లీటరసీ అండ్ న్యూమరసీ పై (FLN) బేస్ లైన్ టెస్ట్ నిర్వహింపజేయాలి. మూడు నెలల తరువాత ఎండ్ లైన్ నిర్వహించడం జరుగుతుంది.
2. పాఠశాలలో నమోదైన విద్యార్థులందరికీ అసెస్మెంట్ బుక్లేట్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయో లేవో, FA 1, FA 2 జవాబులు వ్రాయించారో లేదో పరిశీలించాలి. పాఠశాలకు హాజరుకాని విద్యార్థులకు హాజరు నమోదుచేసినట్లు గుర్తించినట్లయితే సంబంధిత ఉపాధ్యాయలపై కఠిన చర్యలతో పాటు, అధికారులపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
3. 8th క్లాస్ లో నమోదైన విద్యార్థులందరికీ NMMS నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి.
4. కాన్స్టిట్యూషన్ డే పోటీలలో నియోజక వర్గ స్థాయి విజేతల ప్రొఫైల్స్ తయారుచేసి పంపించాలి.
5. 10th క్లాస్ విద్యార్థుల ఫీజు ఈనెల 10 వ తేదీ నుండి చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి.
6. మండల, జిల్లా అకడమిక్ ఫోరమ్ సభ్యులు పదవ తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్ పై, బోగస్ ఎన్రోల్మెంట్ పై ప్రత్యేక దృష్టి కేంద్రకరించాలి.
7. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలకు, స్కూల్ స్థాయిలో నిర్వహించే పరీక్షల ఫలితాలకు చాలా తేడా గుర్తించడం జరిగింది. దీనిపై విశ్లేషణ చేయాలి.
8. వరుసగా మూడు రోజులు పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఫోన్ చేయాలి. పాఠశాలలో రిజిస్టర్ పెట్టి దానిలో తల్లిదండ్రులు ఇచ్చిన వివరణలు తేదీ, సమయంతో సహా నమోదుచేయాలి. విజిట్ కు వెళ్లిన అధికారులు వాటిని పరిశీలించాలి.
9. మూడు రోజుల పాటు పాఠశాలకు హాజరు కాని విద్యార్థుల వివరాలు CRP లకు ఇవ్వాలి. CRP లు నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేవిధంగా కృషిచేయాలి.
10. 10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. దానిని పక్కాగా అమలుపరచాలి.
11. ఫీజు చెల్లించలేదనే కారణంతో ఏ విద్యార్థి పేరు, విద్యార్థి భౌతికంగా హాజరుకాని పాఠశాలలో ఉండడానికి వీలులేదు.
12. డ్రాప్ బాక్స్ విద్యార్థులందరినీ గుర్తించి, వయస్సుకు తగిన తరగతులలో నమోదుచేయాలి
13. FA 1, FA 2 మార్కుల నమోదు రేపటి లోపు పూర్తిచేయాలి.
14. SA 1 పరీక్షలు పూర్తి అయిన వెంటనే ఐదు రోజులలో మార్కులు నమోదు పూర్తిచేయాలి.
15. FA 1, FA 2 మార్కుల ఆధారంగా 10వ తరగతి, 9వ తరగతి విద్యార్థుల గ్రేడ్స్, విద్యార్థి వారీగా సేకరించి విశ్లేషించాలి.
16. వీర్ గాథ, వికసిత్ భారత్ BUILDATHON నందు అన్ని ఉన్నత పాఠశాలలు రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి.
17. ఉపాధ్యాయులకు , ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాశాఖాధికారులకు, ఉప విద్యాశాఖాధికారులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై టార్గెట్స్ ఫిక్స్ చేయాలి. వీటి ఆధారంగా గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది.
Half Pay Leaves Explanation as per AP Leave Rules
ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన అర్ధవేతన సెలవుల పూర్తి వివరాలు. సగం జీతంతో సెలవులు – ఎవరికీ, ఎప్పుడు, ఎలా లభిస్తాయో తెలుసుకోండి!
AP Leave Rules ప్రకారం Half Pay Leave పూర్తి వివరణ!ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు13,18,23 నందు పొందుపరచారు. సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.
సం॥ నకు ఒక్క రోజు తక్కువైనను ఈ సెలవు రాదు.(G.O.Ms.No.165 Dt:17-08-1967)
ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు. అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.
అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.
1.వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)
2. స్వంత వ్యవహారాలపై (Private Affairs)
సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును. ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు. వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవుఅందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.
{APLR 15(B) & 18(B}
కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకుపెంచడమైనది.
(G.O.Ms.No.186 Dt:23-07-1975)
సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}. ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి. వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.
వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)
(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)
అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.
క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు,మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును. (G.O.Ms.No.386 Dt:06-09-1996) (G.O.Ms.No.449 Dt:19-10-1976)
వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు. (G.O.Ms.No.29 Dt:09-03-2011)
ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు. (G.O.Ms.No.143 Dt:01-06-1968)
ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.
సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.(G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)
🔥 More Educational & GK Quizzes
LATEST POST
Ap Edcet entrance exam results released
AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx