మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Commisioner of school education WebEx meeting instructions

గౌరవ స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ గారు ఈరోజు నిర్వహించిన వెబెక్స్ మీటింగ్ ద్వారా జారీచేసిన ఆదేశాలు

1. నవంబర్ 15 తరువాత DIET విద్యార్థుల చేత అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలలో ఫౌండేషనల్ లీటరసీ అండ్ న్యూమరసీ పై (FLN) బేస్ లైన్ టెస్ట్ నిర్వహింపజేయాలి. మూడు నెలల తరువాత ఎండ్ లైన్ నిర్వహించడం జరుగుతుంది.

2. పాఠశాలలో నమోదైన విద్యార్థులందరికీ అసెస్మెంట్ బుక్లేట్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయో లేవో, FA 1, FA 2 జవాబులు వ్రాయించారో లేదో పరిశీలించాలి. పాఠశాలకు  హాజరుకాని విద్యార్థులకు హాజరు నమోదుచేసినట్లు గుర్తించినట్లయితే సంబంధిత ఉపాధ్యాయలపై కఠిన చర్యలతో పాటు, అధికారులపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

3. 8th క్లాస్ లో నమోదైన విద్యార్థులందరికీ NMMS నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి.

4. కాన్స్టిట్యూషన్ డే పోటీలలో నియోజక వర్గ స్థాయి విజేతల ప్రొఫైల్స్ తయారుచేసి పంపించాలి.

5. 10th క్లాస్ విద్యార్థుల ఫీజు ఈనెల 10 వ తేదీ నుండి చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి.

6. మండల, జిల్లా అకడమిక్ ఫోరమ్ సభ్యులు పదవ తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్ పై, బోగస్ ఎన్రోల్మెంట్ పై ప్రత్యేక దృష్టి కేంద్రకరించాలి. 

7. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలకు, స్కూల్ స్థాయిలో నిర్వహించే పరీక్షల ఫలితాలకు చాలా తేడా గుర్తించడం జరిగింది. దీనిపై విశ్లేషణ చేయాలి.

8. వరుసగా మూడు రోజులు పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఫోన్ చేయాలి. పాఠశాలలో రిజిస్టర్ పెట్టి దానిలో తల్లిదండ్రులు ఇచ్చిన వివరణలు తేదీ, సమయంతో సహా నమోదుచేయాలి. విజిట్ కు వెళ్లిన అధికారులు వాటిని పరిశీలించాలి.

9. మూడు రోజుల పాటు పాఠశాలకు హాజరు కాని విద్యార్థుల వివరాలు CRP లకు ఇవ్వాలి. CRP లు నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేవిధంగా కృషిచేయాలి.

10. 10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. దానిని పక్కాగా అమలుపరచాలి.

11. ఫీజు చెల్లించలేదనే కారణంతో ఏ విద్యార్థి పేరు, విద్యార్థి భౌతికంగా హాజరుకాని పాఠశాలలో ఉండడానికి వీలులేదు.

12. డ్రాప్ బాక్స్ విద్యార్థులందరినీ గుర్తించి, వయస్సుకు తగిన తరగతులలో నమోదుచేయాలి 

13. FA 1, FA 2 మార్కుల నమోదు రేపటి లోపు పూర్తిచేయాలి.

14. SA 1 పరీక్షలు పూర్తి అయిన వెంటనే ఐదు రోజులలో మార్కులు నమోదు పూర్తిచేయాలి.

15. FA 1, FA 2 మార్కుల ఆధారంగా 10వ తరగతి, 9వ తరగతి విద్యార్థుల గ్రేడ్స్, విద్యార్థి వారీగా సేకరించి విశ్లేషించాలి.

16. వీర్ గాథ, వికసిత్ భారత్ BUILDATHON నందు అన్ని ఉన్నత పాఠశాలలు రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి.

17. ఉపాధ్యాయులకు , ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాశాఖాధికారులకు, ఉప విద్యాశాఖాధికారులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై టార్గెట్స్ ఫిక్స్ చేయాలి. వీటి ఆధారంగా గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది.

No comments:

Post a Comment