మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఒక్కరోజే 6 వేల కరోనా కేసులు.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో నేడు కేంద్రం సమావేశం. 24 గంటల్లో 6,050 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

వైరస్ వల్ల తాజాగా 14 మరణాలు నమోదు

3.39 శాతానికి చేరిన రోజువారీ పాజిటివిటీ రేటు

భారత్ లో  కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని రోజులుగా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా గత 24 గంటల్లో  6,050 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం ప్రకటింది.

నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వైరస్ వల్ల  తాజాగా మరో 14 మరణాలు నమోదయ్యాయి.

దాంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి చేరుకుంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారం వారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

 కరోన కేసుల వ్యాప్తి నేపథ్యంలో  కేంద్ర అప్రమత్తం అయింది.

కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

కరోనా వ్యాప్తిపై కేంద్రం క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

ప్రధాని మోదీ దీనిపై అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు.

నేడు ఆరోగ్య మంత్రి మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు’ అని ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్‌ తెలిపారు..

No comments:

Post a Comment

LATEST POST

AP S.S.C PUBLIC EXAMS, MARCH - 2026 Results released

AP 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది. ఫలితాలను ఈ క్రింది లింక్ ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు....