మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

649 పాఠశాలల విలీనం నిలిపివేత. ఆగస్టు 31నాటికి ఉన్న విద్యార్థుల ఆధారంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ

 పాఠశాలల విలీనంపై ప్రభుత్వం ఓ మెట్టు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 649 పాఠశాలల విలీనాన్ని నిలిపివేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కొన్నిచోట్ల తరగతి గదులు లేకపో యినా.. పిల్లలు వాగులు, వంకలు, ప్రధాన రహదా రులూ దాటాల్సి వచ్చినా పట్టించుకోకుండా తరగతు లను విలీనం చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తరలించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళనలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మె ల్యేలు సైతం వినతిపత్రాలు సమర్పించారు. క్షేత్ర స్థాయి నుంచి వ్యతిరేకత రావడంతో చివరికి ఫిర్యా దుల పరిశీలనకు చర్యలు చేపట్టారు. జిల్లాలో సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సరిగా పరిశీలించలేదని మంత్రి బొత్స సత్యనారాయణకే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మరోసారి పరిశీలించాలని ఆయన ఆదేశించారు. కొన్ని చోట్ల పునఃపరిశీలన చేయగా.. మరికొన్నిచోట్ల యథా విధిగానే జాబితాలను ఆమోదించారు..


ఎమ్మెల్యే వినతులకే దిక్కులేదు.


పాఠశాలల విలీనంపై ఎమ్మెల్యేలు, జిల్లా కమిటీల ద్వారా మొత్తం 1,399 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో ఎమ్మెల్యేలు ఇచ్చినవి 820 కాగా.. జిల్లా కమి టీల నుంచి వచ్చినవి 579 ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చిన వాటిల్లో కనీసం సగం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం 820 బడులకు సంబంధించి విన తులు ఇవ్వగా.. 380చోట్ల మాత్రమే విలీన మినహాయింపునిచ్చారు. క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు, విద్యా ర్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకునే ఎమ్మెల్యేలు లేఖలు సమర్పించారు. వాటిల్లో సగం వాటికి మాత్రమే విలీనం నుంచి విముక్తి లభించింది. జిల్లా కమిటీలకు వచ్చిన 579లో 269ని పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 649 పాఠశాలల విలీనం నిలిపివేయాలని పాఠ శాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.


విద్యార్థులు తగ్గడంతో గడువు మార్పు


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిన నేప థ్యంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు గడువు కటాఫ్ ను మార్పు చేశారు. గతంలో జులై నెలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీ కరణ చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు విద్యార్థులు తగ్గారనే సమాచారం రావడంతో ఈ కటాఫ్ను మార్చే శారు. ఆగస్టు 31న బడుల్లో ఉన్న విద్యార్థులనే ప్రామా ణికంగా తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారమే ప్రతి పాఠశాలలో ఉపా ధ్యాయుల అవసరం, సబ్జెక్టులు, కేటగిరి వారీగా రూపొందించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరాలు వచ్చిన 649 పాఠశాల లను మినహాయించి, మిగతా వాటిని విలీనం చేస్తూ జాబితా రూపొందించాలని సూచించింది. ఈ జాబితా లపై సెప్టెంబరు ఒకటి నుంచి మూడో తేదీ వరకు కమిషనరేట్ వర్క్షాపు నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

ఉమ్మడి విశాఖ జిల్లా SGT and SCHOOL ASSISTANT సీనియార్టీ నెంబర్ ను మీ ట్రెజరీ id ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెంబర్ కి ముందు ఎంత ...