మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Learn a Word a day level 1,2,3,4 words List

ఆగష్టు మాసానికి 1 నుండి 10 తరగతుల విద్యార్థులకు రోజుకో పదం నేర్చుకో తాజా షెడ్యూలు( స్థాయిల వారీగా పదాల జాబితా) విడుదల

1 నుండి 10 తరగతుల విద్యార్థులకు ఆంగ్ల భాష పదజాలం పై పట్టు సాధించడానికి అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమం "రోజుకో పదం నేర్చుకో".

Click Here To Download 

👉ఇందులో భాగంగా ఆగస్టు నెల కు 1 నుండి 31 వ తారీఖు వరకు 22 రోజుల పాటు వివిధ స్థాయిల ( లెవెల్ 1 నుండి 4 వరకు) విద్యార్థులకు నేర్పించాల్సిన పదాల జాబితా తో కూడిన షెడ్యూలు విడుదలైనది.

కార్యక్రమ అమలు తీరు:

👉ప్రతి రోజు షెడ్యూలు అనుసరించి ఒక ఆంగ్ల పదాన్ని పాఠ శాల అసెంబ్లీ లో పరిచయం చేయాలి.

👉మొదటి పీరియడ్ ఉపాధ్యాయుడు ఆ పదాన్ని, దాని అర్థాన్ని బోర్డ్ పై మూలలో వ్రాసి పిల్లలచేత పలికించాలి.

👉ఆంగ్ల ఉపాధ్యాయుడు తన పీరియడ్ నందు ఆ పదము యొక్క అర్థమును (రెండు భాషలలోను),పలుకు విధానమును,స్పెల్లింగ్,దాని భాషాభాగాలు( parts of speech), దాని యూసేజ్ ను వివరించాలి.విద్యార్థులచే డిక్షనరీలో ఆ పదాన్ని పెన్సిల్తో underline చేయించాలి.

👉విద్యార్థులు ఒక 100 పేజీల నోటు పుస్తకంలో పదం యొక్క వివరాలు రాసుకోవాలి. దీనిని "My Own Dictionary"  గా పిలుస్తారు.దీనిని ఉపాధ్యాయుడు తప్పకుండా తరచుగా చెక్ చేయాలి.

👉మిగిలిన పీరియడ్ల ఉపాధ్యాయులు కూడా పీరియడ్ ప్రారంభం లో 5 నిమిషాలు పదమును,అర్థమును పలికించాలి.

👉Learn a word a day programme నిర్వహణ ప్రతి ఉపాధ్యాయుని బాధ్యత.

👉ప్రతి ఉపాధ్యాయుడు తన పీరియడ్ లో వీలైనన్ని సార్లు , వీలైనన్ని సందర్భాలలో ఆ రోజుటి పదాన్ని ఉపయోగించాలి.

👉ప్రతి రోజూ, ఆ రోజు పదాన్ని పాఠ శాల వరండాలో, అసెంబ్లీలో బోర్డుపై ప్రదర్శించాలి.

👉ప్రతి 15 రోజులకు ఒక సారి అంతవరకు ఆ 15 రోజులలో నేర్చుకున్న పదాలపై Spell bee కాంపిటీషన్స్ నిర్వహించాలి.

👉తనిఖీ అధికారులు వచ్చినపుడు విద్యార్థుల నోటు పుస్తకాలు( పదాలు రాసుకున్నవి), డిక్షనరీ ఎంట్రీస్  తప్పక చూపాలి.

IPE March-2022 ReCounting and ReVerification Results

ఇంటర్ మీడియేట్ మార్చ్ 22 రీ కౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.

http://rcres.apbie.org.in/

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్న అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశం

అన్ని పాఠశాలల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్న అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని  జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినందున కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆగస్టు 1 నుంచి 15 వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను పాఠశాలల్లో నిర్వహించాలి .

 దేశభక్తి గీతాల పోటీలు , వ్యాసరచన , వకృత్వ , ర్యాలీలు , నాటక , డ్యాన్స్ , పెయింటింగ్ , క్విజ్ పోటీలను నిర్వహించాలి .

ఆగస్టు 11 నుంచి 15 వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టాలని సూచించారు . 

ఆగస్టు 13 న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలతో సెల్ఫీ ఫోటోలు దిగి వాటిని www.harghartiranga.com వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు .

నూతన అన్లైన్ పెన్షన్ విధానముపై ఆడిట్ డైరెక్టర్ హరి ప్రకాష్ గారు సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు

>మిత్రులారా! ఇప్పటివరకు  పెన్షన్ ప్రపోజల్స్ వెరిఫై అనేది ఎ.జి కార్యాలయం ద్వారా జరుగుతుంది.

>అయితే కర్నూలు మరియు కృష్ణా జిల్లాలకు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్స్,నాల్గవతరగతి ఉద్యోగులకు మాత్రము 40సంllలకు పైగా రాష్ట్ర ఆడిట్ కార్యాలయం నుండి పెన్షన్ వెరిఫై జరుగుతుంది.ఇది ఇప్పటి వరకు జరుగుతున్న పద్దతి.

> ఇదిలా ఉండగా పెన్షన్ ఆథెంటికేషన్ ఆన్లైన్ చేయాలని డైరెక్టర్ గారు ప్రతిపాదించారు.

> ఇప్పటి వరకు జరుగుతున్న విధానంలో పెన్షన్ ప్రపోజల్స్ పెట్టడం చాలా భారంగా ఉందని,కావున అన్లైన్ విధానం‌ ద్వారా సరళీకృతం చేయాలని పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు.

> కేవలం నాలుగు పేజీలతో పెన్షన్ ప్రపోజల్స్ పూర్తి చేసే విధంగా ఫార్మాట్ లు రూపొందించారు

> పెన్షన్ సాఫ్ట్‌వేర్ కు ఈ- ఎస్సార్ నుండి సమాచారం తీసుకొనే అవకాశం ఉందని తెలియజేశారు.

>  పెన్షన్ ప్రపోజల్స్ ఏ.జి కార్యాలయంనకు పంపాలంటే విజయవాడకు పంపాలని,కాని రాష్ట్ర ఆడిట్ కు అప్పగిస్తే అన్నీ జిల్లాలో ఆడిట్ కార్యాలయాలు ఉన్నందున పెన్షన్ ప్రపోజల్స్ పంపడానికి సులభతరమవుతుందని తెలియజేశాము.అయితే ఏ.జి డిపార్ట్మెంట్ వారితో పోల్చుకుంటే రాష్ట్ర ఆడిట్ (లోకల్ ఫండ్ ఆడిట్) డిపార్ట్మెంట్ లో అవినీతి ఎక్కువగా ఉన్నదని దానిని కంట్రోల్ చేయకుండా రాష్ట్ర ఆడిట్ డిపార్ట్మెంట్ టేకోవర్ చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని ఫెడరేషన్ పక్షాన తెలియజేశాము.

> విధానమేదైనా ఉద్యోగ విరమణ అయ్యేరోజుకి  రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగుల ఖాతాలలో జమ అయ్యేవిధంగా ఒక పాలసీని రూపకల్పన చేయాలని చెప్పాము

> రాష్ట్ర ఆడిట్ డిపార్ట్మెంట్ ద్వారా నే అన్నీ జిల్లాలకు అన్నీ క్యాడర్లకు పెన్షన్ వెరిపై చేసి ఖజానా కార్యాలయాలకు పంపాలని తెలియజేశాము.

> సాప్ట్ వేర్ ను కూడా సరళంగా రూపకల్పన చేయాలని,అటాచ్మెంట్స్ తగ్గించాలని సూచించాము

> ప్రస్తుతం రిటైర్మెంట్ లు లేవు కనుక రివైజ్డ్ పెన్షన్లు ఆన్ లైన్ చేసి కొంత అలవాటు చేయాలని సూచించడమైనది.

> పెన్షన్ ప్రపోజల్స్ పెట్టిన తరువాత జిల్లా ఆడిట్ నుండి వెరిఫై చేయబడి ట్రెజరీలకు పంపడానికి నిర్ణీత గడువును విధించి ఆగడువులోగా డిస్పాచ్ అయ్యేట్టు విధివిధానాలను రూపకల్పన చేయాలని సూచన చేయడమైనది.

రేపటిలోగా విద్యార్థుల వివరాల నమోదు తప్పనిసరి

► ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లోని 1,6వ తరగతి విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో ఈ నెల 31లోపు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.

► ఈ మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి చైల్డన్ఇన్ఫో వెబ్సైట్లో విద్యార్థుల నమోదును నిలిపివేయనుంది.

► ఇందుకు సంబంధించిన ఆదేశాలను విద్యాశాఖ కమిషనరు ఎస్ సురేష్ కుమార్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకూ ఇటీవల జారీ చేశారు.

► ఈ నెల 31 వ తేదీ డేటా ఆధారంగానే భవిష్యత్తులో ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

► ప్రభుత్వ పథకాల ( జెవికె, అమ్మఒడి, మధ్యాహ్న భోజనం ) లబ్ధి కూడా ఈ తేదీనే పరిగణనలోకి తీసుకుంటారు.

విద్యార్థులకు జాతీయ స్థాయిలో క్విజ్ పోటీలు

► స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో దిఇండియన్ నేవీ క్విజ్-2022 పేరుతో జాతీయస్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు.

► ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొన వచ్చని చెప్పారు.

► పాల్గొనే వారు దిఇండియన్ నేవీ క్విజ్ వెబ్సైట్లో పూర్తి వివరాలు పొందవచ్చన్నారు. 0891-2812957,0891-2812669 నంబర్ల లోనూ సంప్రదించవచ్చని చెప్పారు. 

► ఎక్కువమంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్ చొరవ చూపాలని ఆదేశించారు.

Teachers facial attendance App link

ఆగస్టు ఒకటి నుండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు అమలు చేయనున్న ఉపాధ్యాయుల Facial attendance App లింక్.

 https://play.google.com/store/apps/details?id=com.rnit.riimsap

User id:   U-DISE CODE

Password:  school@123

NOTE :-ఆగస్టు ఒకటి నుండి అందుబాటులోకి వస్తుంది

Pay slip download for the year 2018

2018 నుంచి మీ సాలరీ స్లిప్స్ ను క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క ట్రెజరీ ఐడీ ని, నెలను ఇచ్చి  డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://apemployees.in/payslip

1 to 5th Class Telugu lesson plans for SCERT model

1 నుండి 5వ తరగతి వరకు SCERT వారి మోడల్  తెలుగు లెసన్ ప్లాన్స్ ను ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది.

బదిలీలకు 5 అకడమిక్ ఇయర్స్ ::: గౌ౹౹ జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ శ్రీ మువ్వా రామలింగం గారి వివరణ .

Reapropriation కు 31/07/2022 కట్ ఆఫ్ డేట్

ప్రమోషన్లుకు సీనియారిటీ జాబితాలు రూపొందించేందుకు తగిన ఉత్తర్వులు త్వరలో విడుదల

పోస్టుల అప్గ్రేషన్ కు ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చినట్లే .

ప్రమోషన్లుకు సీనియారిటీ జాబితాలు రూపొందించేందుకు తగిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల చేస్తామన్నారు

బదిలీలకు 5 అకడమిక్ ఇయర్స్ అని తెలిపారు.

Reapropriation కు 31/07/2022 కట్ ఆఫ్ గా తీసుకొంటారు

రేపు సాయంత్రం లోగా అన్ని పాఠశాలలు Child info పూర్తి చేయాలి అని తెలిపారు

  గౌ౹౹ DGE శ్రీ డి దేవనంద రెడ్డి గారిని కలిసి SSC పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు పై పెట్టిన కేసులు ఉపసంహించుకోవాలని కోరగా సానుకూలంగా స్పదించారు

All Students Should Participate in Reading Campaing Teachers supervision

Aug 15 నుండి Sep 8  వరకు అన్నీ పాఠశాలలలో రీడ్ అలాంగ్ - రీడింగ్ మారథాన్ చేపట్టాలని ఆదేశాలు జారీ.

Click Here To Download proceedings 



Certain standing instructions regarding action to be taken against the employees who are absent from duties without any authorized leave – Govt., Memo communicated.

 

విధులకు  హాజరు కాని (without any authorized leave) ఉద్యోగుల మీద చర్యల కొరకు ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల  విద్యా శాఖ

AP Inter Supplementary Halltickets Download Link


ఏపీ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల ఆగస్ట్ 2022 హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ పాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 https://bie.ap.gov.in/GetSupplyMentaryHallTickets2022NewBIEAP.do

TET Hall tickets Download process

టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు Candidate login లో download అవుతున్నాయి. హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.

https://aptet.apcfss.in/CandidateLogin.do


👉మీ TET ID మరియు Date of birth enter చేసి candidate login open చేయాలి

👉Once candidate login open అయ్యాక...

👉మీకు left side ఒక buble ఉంటుంది..దాన్ని క్లిక్ చేయాలి

👉అది క్లిక్ చేస్తే అపుడు మీకు *candidate service* అని ఒక option left side top corner లో కనిపిస్తుంది


👉అది ok చేస్తే HALLTICKET DOWNLOAD OPTION కనిపిస్తుంది


👉 ఆ option క్లిక్ చేస్తే మీ hallticket open అవుతుంది.


👉open అయ్యేకా right side మీకు print అనే option orange colour లో కనిపిస్తుంది.


👉 అది click చేసి..

ఆ halltickteను save pdf గా సేవ్ మీ storage లో చేసుకోవచ్చు..

బడుల విలీనంపై ప్రభుత్వానికి నోటీసులు. డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ

జాతీయ విద్యా విధానం ముసుగులో రాష్ట్రంలో జరుగుతున్న పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రి యను నిలువరించాలని కోరుతూ సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, ఏపీ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్, విద్యా పరిశోధన, శిక్షణ రాష్ట్ర మండలి డైరెక్టరుకు నోటీ సులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే వ్యవ హారంపై దాఖలైన వ్యాజ్యంతో ప్రస్తుత పిల్న జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయా జులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం కోసం జారీచేసిన జీవోలు 117, 128, 84, 85 ను సవాలు చేస్తూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిల్ వేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది.

టీచర్ల బయోమెట్రిక్ హాజరు 1 నుంచి తప్పనిసరి.ఆన్లైన్ సమావేశంలో స్పష్టం చేసిన విద్యాశాఖ

రాష్ట్రంలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆగస్టు ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరును తప్ప నిసరి చేస్తున్నట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది . మంగళవారం వెబెక్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు .

 జిల్లాల్లో అనేక పాఠశాలల్లో ఒకటి , ఆరో తరగతుల్లో చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో నమోదు జీరోగా ఉందని , జిల్లాలోని అందరు ప్రధానోపాధ్యాయులకు కొత్తగా చేరిన బాలబాలికల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో బుధవారం లోగా నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు . అట్లు చేయని ప్రధానొపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . 

వచ్చే నెలలో జరిగే రేషనలైజేషన్ కౌన్సెలింగ్ ఈనెల 28 వ తేదీ రోలు ఆధారంగా జరపనున్నట్లు పేర్కొన్నారు .

జిల్లాలోని అన్ని తరగతుల పాఠశాలలు , అన్ని మేనేజ్మెంట్ల పాఠశా లలు ప్రతిరోజు ఉదయం 10:30 లోపు విద్యార్థుల హాజరు మొబైల్ యాప్లో నమోదు చేయాలన్నారు . 

ఆగస్టు ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరుతో పాటుగా సదరు కొత్త యాప్లో అన్ని రకాల లీవులు నమోదు చేయాల్సి ఉంటుంద ని సూచనలు చేశారు

 విద్యాశాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ , కాంట్రాక్ట్ , అవుటో ర్సింగ్ ఉపాధ్యాయులు , బోధనేతర సిబ్బంది టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో తమ డేటా నమోదు చేయాలని స్పష్టం చేశారు .

 ఉపాధ్యాయుల ప్రమోషన్లు , ట్రాన్స్ఫర్లు టీఐసీ డేటా ఆధారంగా జరుగుతాయని , కనుక అందరూ తమ డిజిగ్నేషన్స్ , జాయినింగ్ తదితర అన్ని రకాల వివరాలు సరిగా ఉన్నాయా అనేది చూసుకుని అప్ డేట్ చేసుకోవాలని సూచించారు

DSC 1998 candidates LOGIN for applying teacher posts

డి ఎస్ సి 1998 లో అర్హత కలిగిన అభ్యర్థులు వారి యొక్క అనుమతిని తెలియచేయడానికి cse లో లాగిన్ అయి వివరాలను సబ్మిట్ చేయటానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

http://sims.ap.gov.in/DSC/


Enter hall ticket number

Date of Birth (DD/MM/YYYY)

password

Enter Captcha

Webex meeting key points

ఈరోజు రెండు గంటల నుండి ఐదు గంటల వరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి కార్యాలయం నుండి WebEx meeting సమావేశం జరిగింది. సదరు సమావేశంలో        

1.వచ్చే నెలలో జరిగే రేషనలైజేషన్ కౌన్సిలింగ్ ఈనెల 28వ తేదీ రోలు ఆధారంగా జరపబడును. కావున అందరూ గమనించి బాలబాలికల వివరాలను వెంటనే చైల్డ్ ఇన్ఫో నందు నమోదు చేయవలెను. అట్లు చేయని ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును.

2. ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఉపాధ్యాయుల హాజరు మొబైల్ ద్వారా కొత్త యాప్ ద్వారా తీసుకొనబడును. సదరు యాప్ లో అన్ని రకాల లీవులు నమోదు చేయవలసి ఉంటుంది. కావున అన్ని రకాల లీవ్ రికార్డులు రెండు రోజుల లోపల అప్డేట్ చేయవలసి ఉంది.

3.విద్యా శాఖలో పనిచేయుచున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, మరియు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది including MIS coordinators ,Data entry operators, జూనియర్ అసిస్టెంట్స్ రికార్డ్ అసిస్టెంట్ మరియు అటెండర్లు అందరూ కూడా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం లో వారి యొక్క డేటా ఎంటర్ చేయవలెను. ఉపాధ్యాయుల ప్రమోషన్లు మరియు ట్రాన్స్ఫర్లు TIS డేటాను బేస్ చేసుకుని జరుగుతుంది కావున అందరూ వారి యొక్క డిజిగ్నేషన్స్ జాయినింగ్ మొదలగు అన్ని రకాల వివరాలు సరిగా ఉన్నవో లేదో చూసుకుని అప్ టు డేట్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

Midday Meal & School sanitation - Kitchen Gardens in Government Schools - Suchitra Educational Society - Vijayawada - Show cause Notice Issued - Termination orders issued

పాఠశాలలో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుకు నియమించిన సుచిత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ ని రద్దు చేస్తూ CSE వారి ఉత్తర్వులు విడుదల.



AP EAPCET 2022 RESULTS released Download Direct Link

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్,అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలును విడుదల చేయడం జరిగింది. లోడ్ చేసుకోండి.ఫలితాలను ను డౌన్లోడ్ చేసుకొనేందుకు డైరెక్ట్ లింక్స్ క్రింది వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది.

https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

Link 1


Link 2

ఐటీ రిటర్నుల గడువు పెంపునకు నో. గత మూడేళ్లలో ఇదే తొలిసారి

 ఆదాయపన్ను చెల్లించే వ్యక్తులు , సంస్థలు రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31 వ తేదీతో గడువు ముగియనుండగా పొడిగించేందుకు కేంద్రప్రభుత్వం సుముఖంగా లేదు . ఈ మేరకు స్పష్టమైన ప్రకటనలు కూడా చేసింది . గడువు పెంచకుండా ఉండటం గడచిన మూడేళ్లలో ఇదే తొలిసారి . జరీమానాలు పడకుండా ఉండాలంటే గడువులోగా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిట్నరులు దాఖలు చేయక తప్పదు . కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాలలో ఐటీ రిట్నరుల గడువును కేంద్రం పదేపదే పొడిగిస్తూ వచ్చింది . కానీ ప్రస్తుతం కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో గడువు పొడించాల్సిన అవసరం , ఆలోచన ఏదీ లేదని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇప్పటికే ప్రకటించారు .

DSC 1998 qualified teachers willing for working

డి.యస్.సి.1998 అర్హత గల అభ్యర్థులు తమ 

ఆసక్తి ని తెలుపుటకు తేదీ 26.07.2022 నుండి 01.08.2022 వెబ్ పోర్టల్ తమ వివరములను

నమోదుజేయగలరు

https://cse.ap.gov.in 


తదుపరి తెలీయజేయడమేమనగా జిల్లా విద్యాశాఖ కార్యాలయముల నందు ఎటువంటి ధరకాస్తులు స్వీకరించబడవు, కేవలము పైన తెలిపిన వెబ్ సైట్ నందు మాత్రమే అర్హత గల అభ్యర్థులు అందరు వారి యొక్క ఆప్షన్స్ ని తెలుపగలరు


కమీషనర్, పాఠశాల విద్యాశాఖ,

ఆంధ్రప్రదేశ్, అమరావతి

విద్యకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఉపాధ్యాయులకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 ప్రీ ప్రైమరీ విద్య అవసరం లేదంటోన్న కొందరు ఉపాధ్యాయులు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

👉పాఠశాలలపై ప్రభుత్వ విధానాన్ని వద్దనే అధికారం ఉపాధ్యాయులకు లేదని బొత్స వ్యాఖ్యానించారు.

👉 ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారా? అని నిలదీశారు. 

👉ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకే సంస్కరణలు చేపట్టామని.. రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణల యజ్ఞం ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుందన్నారు.

👉 సీబీఎస్ఈ, ఆంగ్ల మాధ్యమంలో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్‌లు.. ఇలా వేర్వేరు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులు చెబుతోన్న వివిధ అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

👉 ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమన్నారు.

👉 పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లితండ్రులూ అభ్యంతరం చెప్పటం లేదన్నారు. 

👉ఎవరో కుట్రలు చేసి ఈ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.


పుస్తకాల విషయంలో జాప్యం నిజమే.

పాఠ్య పుస్తకాల విషయంలో జాప్యం జరిగిన మాట వాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

👉 పాఠశాల విద్యాశాఖ ఓ కఠిన నిర్ణయం తీసుకున్న కారణంగానే ఆలస్యమైందన్నారు.

👉 ప్రభుత్వం ఇచ్చిన సిలబస్, కరికులమ్ ఇచ్చిన తర్వాత ఏ ప్రైవేటు పాఠశాలా దాన్ని మార్చేందుకు వీల్లేదన్నారు. 

👉గతంలో ప్రైవేటు పాఠశాలలు తమ సబ్జెక్టులు కూడా కలిపేసి ముద్రించే వారన్న మంత్రి.. పరీక్షలు ఎప్పుడూ ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ఆధారంగానే జరుగుతాయని గుర్తించాలన్నారు.

👉 వ్యాపారం కోసం గతంలో ప్రైవేటు సంస్థలు ముద్రించేసి వాటినే విక్రయించుకునే వారన్నారు. 

👉ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలను మాత్రమే పంపిణీ చేసేలా ఈసారి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

👉ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇస్తున్నాం, ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత ధరకే విక్రయిస్తున్నామన్నారు.

July 22 salaries for municipal teacher as usual for this month

ఈ జులై నెల జీతాలు చేయమని కమిషనర్ లకు ఉత్తర్వులు. మునిసిపల్ ప్రైమరీ,అప్పర్ ప్రైమరీ ఉఫాధ్యాయులకు DDO గా  MEO లను తీసుకొని  map చేయమని ఆదేశాలు. మునిసిపల్ హైస్కూల్ హెచ్ ఎం  ల కు డి డి ఓ పవర్స్ మరియు కోడ్ ల విడుదల చేయాలని ఆదేశాలు.

Click Here 

Lr.Rc.No.ESE 02-13/90/2021-EST3-CSE-Part(6), dt:24/07/2022 School Education - Nadu Nedu Academics – Mapping of Schools andreapportionment of teaching staff under various managements viz., Govt, ZPP/MPP – representations received from the Hon’ble MLAs – regarding.

పాఠశాలల మాపింగ్ పై జిల్లా విద్యాశాఖాధికారులకు  తాజా సూచనలతో ఉత్తర్వులు జారీ చేసిన కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ .

పాఠశాలలో విలీనంపై ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఇనతులను పరిశీలించి చర్యలు తీసుకోవడానికి వీలుగా జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ యొక్క రిపోర్టును 28- 7-2022 నాటికి ఆఫీసుకు సబ్మిట్ చేయవలసిందిగా కలెక్టర్లను కోరినటువంటి విద్యాశాఖ

Click Here To Download proceedings 


ఏపీ పాఠశాల మ్యాపింగ్, రేషనలైజేషన్ పై గౌరవ ఎమ్మెల్యేలు అందించిన రిప్రెజెంటేషన్స్ పై అన్ని జిల్లాల కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా పరిశీలించవలసినదిగా సూచనలతో తాజా ఉత్తర్వులను  పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, మండల్ పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపల్ మరియు ఇప్పటికే నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఇప్పటికే ఉన్న దంతవైద్య పాఠశాలల పునర్నిర్మాణం మరియు పునఃస్థాపన కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన 1వ సూచనపై రాష్ట్రంలోని అన్ని జిల్లా మేజిస్ట్రేట్ & కలెక్టర్ల దృష్టిని CSE ఆహ్వానిస్తోంది.  గిరిజన సంక్షేమ శాఖ పునర్‌వ్యవస్థీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది


 2వ మరియు 3వ ప్రస్తావనలో ఉదహరించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా నియమాలు, 2010కి కొన్ని సవరణలను జారీ చేసింది. తదనుగుణంగా, ప్రభుత్వం ఉప-ప్రదానం చేసిన అధికారాలను ఉపయోగించి గెజిట్, dt:27.12.2021 ప్రచురించింది.  బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009లోని సెక్షన్ 38లోని సెక్షన్ (1) (2009 నం.35 చట్టం) ఆంధ్రప్రదేశ్ బాలల ఉచిత విద్యా హక్కు నియమాలు, 2010లో కొన్ని సవరణలు చేసింది.


 రాష్ట్ర ప్రభుత్వం, మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపల్ మరియు గిరిజన సంక్షేమ శాఖల పాఠశాలల ద్వారా నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ప్రస్తుతం ఉన్న నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలను (i) శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ (PP1 & PP2) (ii) ఫౌండేషన్ స్కూల్ (PP1, PP2, క్లాస్)లోకి మార్చడం  1 & 2);  (iii) ఫౌండేషన్ స్కూల్ ప్లస్ (PP1, PP2, 1 నుండి 5 తరగతులు);  (iv) ప్రీ హై స్కూల్ (3 నుండి 7 లేదా 8 తరగతులు);(v) ఉన్నత పాఠశాల (3 నుండి 10 తరగతులు) మరియు (vi) హైస్కూల్ ప్లస్ (3 నుండి 12 తరగతులు), విద్యా మౌలిక సదుపాయాలను మార్చడం మరియు విద్యార్థుల గౌరవాన్ని పెంపొందించడం కోసం  మరియు తీసుకురావడానికి


 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం ద్వారా వారిని భావి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సమగ్ర విద్యా మరియు పరిపాలనా సంస్కరణలు.  చట్టం నెం.35/ 2009) G.O.Ms.No.20, స్కూల్ ఎడ్యుకేషన్ (PE-Progs.l) డిపార్ట్‌మెంట్, dt:03.03 ద్వారా జారీ చేయబడిన ఉచిత మరియు నిర్బంధ విద్యా నియమాలు, 2010 ఆంధ్ర ప్రదేశ్ బాలల హక్కుకు కొన్ని సవరణలు చేసింది.  తదనుగుణంగా 3వ సూచనలో ఉదహరించబడింది, దిగువ వివరించిన విధంగా మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి:


 > ఫౌండేషన్/ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలోని 3,4,5 తరగతులను 1 కి.మీ దూరంలోని తరగతి గదులు, హై స్కూల్‌లు/ ప్రీ-హైస్కూల్‌తో మౌలిక సదుపాయాలు ఉన్న పొరుగున ఉన్న ప్రీ-హైస్కూల్/హైస్కూల్‌కు మ్యాపింగ్ చేసే ప్రక్రియను చేపట్టడం.  ఏదైనా సహజ అడ్డంకులు ఉన్నప్పుడు ఆ తరగతులను మ్యాప్ చేయకూడదు.  ప్రీ-హై స్కూల్స్‌లోని 6,7,8 తరగతులు విద్యార్థి తరగతి గది నిష్పత్తి ఆధారంగా మరియు G.O.Ms.No.84, 85 dt:24.12.2021 మరియు గెజిటెడ్ dt:27.12.2021 ప్రకారం ప్రస్తుత ఉన్నత పాఠశాలలకు మ్యాప్ చేయబడతాయి [  కాబట్టి, ఈ విభాగాలకు కొత్త వసతి అవసరం లేదు].  ఏదైనా సహజ అడ్డంకులు ఉన్నప్పుడు ఆ తరగతులను మ్యాప్ చేయకూడదు.  

> 3,4,5 తరగతులకు ప్రథమ భాష

 మైనర్ లాంగ్వేజ్ (ఉర్దూ/తమిళం/కన్నడ/ఒరియా, మొదలైనవి) అందుబాటులో ఉన్న ప్రీ-హైస్కూల్ లేదా ఏదైనా మాధ్యమంలోని హైస్కూల్‌కు 1 డైస్ లోపల మ్యాప్ చేయబడుతుంది మరియు అదే మాధ్యమం యొక్క మొదటి భాషని కొనసాగించాలి.


 > కోసం, 1 KM పరిధిలోని ఏదైనా మాధ్యమం యొక్క మైనర్ మీడియం పాఠశాలలు పోల్ లేదా హైస్కూల్ యొక్క 3,4,5 తరగతులు మరియు అదే మైనర్ మీడియం యొక్క మొదటి భాష కొనసాగించబడాలి.


 > కోసం, మైనర్ మీడియం పాఠశాలల్లోని 3,4,5 తరగతులు అందుబాటులో ఉన్న ప్రీ-హై స్కూల్‌లు లేదా అదే మైనర్ మీడియం యొక్క ఉన్నత పాఠశాలలతో మ్యాప్ చేయబడాలి.  అందుబాటులో లేకుంటే వాటిని స్టాండ్ ఎలోన్‌గా కొనసాగించాల్సి ఉంటుంది.

 దీని ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఈ కసరత్తును పూర్తి చేశారు.

 ఉదహరించిన 5వ మరియు 6వ ప్రస్తావనలో, గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ప్రాథమిక పాఠశాలలు/ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి గౌరవ ఎమ్మెల్యేల నుండి ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలియజేసారు.  ప్రాథమిక పాఠశాల సమీప ఉన్నత పాఠశాలకు మ్యాప్ చేయబడింది.  గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులైన ఎమ్మెల్యేల నుండి స్వీకరించిన లేఖలను పంపి, అభ్యర్థనల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరించాలని మరియు వాస్తవ నివేదికలను పొందాలని అభ్యర్థించారు.  ప్రతిపాదనలు చేసి వారంలోగా ఫైల్‌ను సర్క్యులేట్‌ చేయాలని అన్నారు.  లో ప్రభుత్వ ఉద్దేశం అని స్పష్టం చేశారు


  స్కూల్ మ్యాపింగ్ వ్యాయామం అనేది సాల్స్‌తో సహా అత్యుత్తమ సౌకర్యాలను అందించడం ద్వారా విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడం మరియు ఒక వారంలో ఫైల్‌ను ప్రసారం చేయడం.  అది పాఠశాల మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టడంలో ప్రభుత్వ ఉద్దేశం సబ్జెక్ట్ టీచర్ల ఫారమ్ క్లాస్‌తో సహా అత్యుత్తమ సౌకర్యాలను అందించడం ద్వారా విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడం, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని స్పష్టం చేసింది.


 పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రంలోని జిల్లా మేజిస్ట్రేట్ & కలెక్టర్లు కింది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మరియు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం గౌరవ ఎమ్మెల్యేల నుండి స్వీకరించిన ప్రతిపాదనలను పరిశీలించి నివేదికను సమర్పించాలని CSE అభ్యర్థిస్తుంది.  28.07.2022న లేదా అంతకు ముందు ఈ కార్యాలయంలో వారి అభ్యర్థనల సాధ్యాసాధ్యాలు, ఈ విషయంలో అవసరమైన సూచనల జారీ కోసం ప్రభుత్వానికి వాటిని సమర్పించడం కోసం.

పాఠశాలల విలీనంపై జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు.పునరాలోచనలో ప్రభుత్వం

 ప్రభుత్వ పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుం డడంతో మరోసారి పరిశీలనకు జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారులు, రైల్వే క్రాసిం గ్లు, వాగులు, వంకలు దాటి వెళ్లాల్సి వస్తున్న వాటిని పరిశీలించాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇందు కోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. పాఠశాలల విలీనాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించ డంతోపాటు ఇటీవల 70మంది ఎమ్మెల్యేలు విలీనం నిలి పివేయాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖలు రాశారు. జిల్లా కలెక్టర్లకు ఎమ్మెల్యేలు వినతులు సమర్పిం చారు. ఈ నేపథ్యంలో విలీనంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో కలెక్టర్ల ద్వారా ప్రత్యేకంగా పరిశీలన చేపట్టారు. కడప జిల్లాలో మండల స్థాయిలో ఎంపీ డీవో, ఎమ్మార్వో, సర్వేయర్, ఎంఈవోలతో కమిటీని ఏర్పాటు చేశారు. నంద్యాలలోనూ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తర గతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తుండగా.. ప్రాథమికోన్నత బడుల నుంచి 6,7,8 తరగతులను ఉన్నత బడుల్లో కలిపేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,250 పాఠశాలలను విలీనం చేస్తుం డగా.. వీటిల్లో 270 పాఠశాలల్లో వాగులు, వంకలు, రహ దారులను దాటి వెళ్లాల్సి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కానీ క్షేత్రస్థాయిలో కిలోమీటరు కంటే దూరంలోని ప్రాథమిక బడుల నుంచి 3,4,5 తరగతులను విలీనం చేస్తున్నారు. వాగులు, వంకలు, రహదారులను పట్టించు కోవడం లేదు. పాఠశాలల తరలింపు, వాగులు, వంకలు, రహదారులు దాటి బడికి వెళ్లాల్సి రావడాన్ని తల్లిదం డ్రులు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

APTET Exams Centers Choosing Option Enabled in Candidates Login

APTET పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వారి యొక్క లాగిన్ లో పరీక్ష కేంద్రాలను సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

 Official Link

https://aptet.apcfss.in/CandidateLogin.do

Student attendance App updated 23-7-22 version 1.4

స్టూడెంట్ అటెండెన్స్ యాప్ మరల ఈరోజు అప్డేట్ అయింది. కొత్త యాప్ ను ఈ క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు

https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse.school.hm

Check Your AmmaVodi 2022 Payment Status by using Aadhar number

రెండవ విడత( అనగా మొదటి విడతలో వివిధ కారణాల వలన జమకాని అమ్మఒడి అమౌంట్  ఈరోజు నుండి  విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ అవుతున్నాయి. వాటి యొక్క స్టేటస్ ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చును.

క్రింది లింక్ లో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా అమ్మఒడి పేమెంట్ స్టేటస్ వివరాలు తెలుసుకోవచ్చు

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

Download IMMS App Latest version 1.4.3

 IMMS APP వెర్షన్ 1.4.3 కి (updated version 26.07.2022) అప్డేట్ చేయబడినది.

New Version 1.4.3 Features:

1. Students Health and hygienic survey feedback Screen

2. Ayah registration screen changes

3. CCH registration screen

4. One time mobile number capturing of HM, MEO and EWA

పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్ 1.4.3 డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.ap.imms&hl=en_IN&gl=US

Download and Install AP Students Attendance App Latest Updated ver 1.3

 స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అయినది. పాత వెర్షన్ పనిచేయదు. కొత్త వెర్షన్ ను ఈ క్రింది లింక్ నుండి అప్డేట్ చేసుకోవచ్చు

Latest Students Attendance App download below Play store link

https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse.school.hm

ముఖ్యమంత్రి విద్యాశాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ డిస్‌ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.


► గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని, నాడు నేడు రెండోదశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

సమావేశ అంశాలు.

► రెండోదశ నాడు – నేడు పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

► స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రతదృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

► సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలన్న సీఎం

► ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకునే ప్రక్రియలో భాగంగా విద్యా వ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డేటా  నిరంతరం అప్‌లోడ్‌ అయ్యేలా చూడాలన్న సీఎం

► దీనికి సంబంధించి ఎస్‌ఓపీలను రూపొందించాలన్న సీఎం

► జిల్లా స్దాయిలో కలెక్టర్లు కూడా సమీక్ష చేయాలని ఆదేశం

► టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలన్న సీఎం

తరగతి గదుల్లో డిజిటిల్‌ మౌలికసదుపాయాలపై సీఎం సమీక్ష.

► విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు లేదా ప్రొజెక్టర్లు పెట్టాలన్న సీఎం

► దీనికి సంబంధించి వివిధ మోడళ్లను సీఎంకు చూపించిన అధికారులు

► వాటి ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం

► స్మార్ట్‌ బోధన సదుపాయాల వల్ల ఇటు పిల్లలకూ, అటు ఉపాధ్యాయులకూ మేలు జరుగుతుందన్న సీఎం

► తరగతి గదుల్లో పెట్టే ప్రొజెక్టర్‌లు, ఇంటరాక్టివ్‌ టీవీలు నాణ్యతతో ఉండాలని సీఎం ఆదేశం

► పీపీ –1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్‌ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్‌లు పెట్టేలా ఆలోచన చేయాలన్న సీఎం

► అన్ని హైస్కూళ్లలోనూ, నాడు–నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో మొదటి దశ కింద ఏర్పాటు చేయాలన్న సీఎం

► వచ్చేవారం నాటికి దీనిపై కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం. 

► ఈ సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లపైనా సీఎం సమీక్ష

► ట్యాబ్‌లన్నీ నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం

► ఈ ట్యాబ్‌ల్లోకి కంటెంట్‌ లోడ్‌ చేయనున్న బైజూస్‌

విద్యాకానుకపైనా సీఎం సమీక్ష.

► వచ్చే ఏడాదికి విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్న సీఎం

► విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రతి స్థాయిలో కూడా పర్యవేక్షణ కూడా అంతే బలంగా ఉండాలన్న సీఎం

► విద్యాశాఖలో డీఈఓ, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని సీఎం ఆదేశం

► ఎస్‌సీఈఆర్టీ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్స్, డైట్‌ లెక్చరర్స్‌ పోస్టుల భర్తీపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

► హాస్టళ్లలో కూడా నాడు – నేడు పనులను రెండోదశ కింద చేపట్టాలన్న సీఎం.


► సమావేశానికి విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళీ, ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ కార్యదర్శి ఏ సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో 'అభ్యసన అభివృద్ధి. తొలుత పది జిల్లాల్లో ప్రయోగాత్మక కార్యాచరణ

కోవిడ్-19 తర్వాత విద్యార్థుల్లో వచ్చిన అభ్యసన అంతరాలను సత్వరమే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అభ్యసన అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. యునిసెఫ్, సీఐపీఎస్ (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లి క్ సిస్టమ్), సేవ్ ది చిల్డ్రన్తోపాటు గ్రామ, వార్డు స చివాలయ శాఖ భాగస్వామ్యంతో పాఠశాల విద్యా శాఖ దీనిని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పై విభా గాల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలకు చెందిన 6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన నైపు ణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్న మయ్య జిల్లాల్లో ముందుగా అమలు చేస్తారు.

ఆన్ లైన్ హాజరు నమోదులో ఆలస్యమైతే షోకాజ్ నోటీసులు

 పాఠశాలల్లో ఉదయం 10.30 గంటలలోపు విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేయకపోతే ఉపాధ్యాయులపై ప్రభుత్వం చర్యలు తీసు కుంటోంది. విద్యార్థి హాజరు యాప్లో సకాలంలో నమోదు చేయలేదంటూ కర్నూలు జిల్లాలో పలు పాఠశా లలకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు. ఉదయం 9.15కు ప్రార్థన పూర్తవుతుందని, ఆలస్యంగా వచ్చే విద్యార్థుల కోసమని మొదటి పీరియడ్ తర్వాత హాజరు తీసుకుంటామని ఉపాధ్యాయులు చెబు తున్నారు. మొదట రిజిస్టర్ లో హాజరు తీసుకొని, ఆ తర్వాత యాప్లో నమోదు చేయాలని, విద్యార్థులు సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇంటర్నెట్ సమస్యలు ఏర్ప డితే కొంచెం ఆలస్యమవుతుందని వెల్లడిస్తున్నారు. కొంత అదనపు సమయం ఇవ్వకుండా షోకాజ్ నోటీసులు ఇస్తూ ఒత్తిడి తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

బేస్లైన్ టెస్ట్ నందు మౌఖిక పరీక్ష నిర్వహణకు సూచనలు

తెలుగు

🌼ఒక్కొక్క విద్యార్థిని పిలిచి  మొదటగా ఇచ్చిన ప్రశ్నా పత్రం లోని రెండు పేరాలలో ఏదైనా ఒక చదవమని కోరాలి. 

🌼పేరాను మూడు కంటే తక్కువ తప్పులతో చదివితే ఆ విద్యార్థి పేరా స్థాయి లో ఉన్నట్లుగా గుర్తించాలి. 

🌼 అప్పుడు ఆ విద్యార్థిని కథ చదవమని కోరాలి. కథను మూడు కంటే తక్కువ తప్పులతో  చదివితే ఆ విద్యార్థి కథా స్థాయి లో ఉన్నట్లుగా గుర్తించాలి. 

🌼పేరాను మూడు కంటే ఎక్కువ తప్పులతో చదివిన విద్యార్థులను ప్రశ్నా పత్రం లోని ఏవైనా ఐదు పదాలను చదవమని కోరాలి. 

🌼ఐదు పదాలలో కనీసం నాలుగు పదాలు స్పష్టంగా చదవగలిగిన విద్యార్థిని పదాల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

🌼ఐదు పదాలలో నాలుగు పదాలు సరిగ్గా చదవక పొతే ఆ విద్యార్థిని ప్రశ్నా పత్రం నుంచి  ఏవైనా ఐదు అక్షరాలు చదవమని కోరాలి.  

🌼ఐదు అక్షరాలలో కనీసం నాలుగు అక్షరాలు సరిగ్గా గుర్తించినట్లైతే ఆ విద్యార్థి అక్షరాల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

🌼ఐదు అక్షరాలలో నాలుగు అక్షరాలు గుర్తించకపోతే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

Single form 15 students 

Click Here To Download format

 Click Here To Blank Proforma

గణితం 

🌼ప్రశ్నా పత్రంలో ఇచ్చిన ఆరు అంకెలలో నాలుగు కంటే తక్కువ అంకెలను విద్యార్థి గుర్తించినట్లయితే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

🌼ఇచ్చిన  ఆరు అంకెలలో నాలుగు కంటే ఎక్కువ అంకెలను గుర్తించిన విద్యార్థిని రెండు అంకెల సంఖ్యలను గుర్తించమని అడగాలి. 

🌼ఇచ్చిన రెండు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థి ఒక అంకె సంఖ్యల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

🌼ఇచ్చిన రెండు  అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థిని మూడు అంకెల సంఖ్యలను గుర్తించామని అడగాలి. 

🌼ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన  విద్యార్థి రెండు అంకెల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

🌼ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన  విద్యార్థిని చతుర్విధ ప్రక్రియలోని కూడిక తీసివేత గుణకారం భాగాహారంలకు సంబందించిన ప్రశ్నలు అడగాలి.  

🌼చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలకు సరైన సమాధానం చేయని విద్యార్థులను మూడంకెల స్థాయిలో ఉన్నట్లు గుర్తించాలి. 

🌼చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను సరిగ్గా చేయని విద్యార్థులను మూడంకెల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

🌼చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను  సరిగ్గా చేసిన  విద్యార్థులను గణిత ప్రక్రియల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 


ఇంగ్లీష్ 

🌼ఇచ్చిన ప్రశ్నా పత్రంలోని ఏవైనా ఐదు కాపిటల్  లెటర్స్ ను  చదవమని విద్యార్థిని కోరాలి. 

🌼ఐదు  కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

🌼ఐదు కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు స్మాల్ లెటర్స్ చదవమని కోరాలి. 

🌼ఐదు స్మాల్  లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి కాపిటల్ లెటర్స్ స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి.

🌼ఐదు స్మాల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు సులభ పదాలు చదవమని కోరాలి. 

🌼ఐదు  సులభ పదాలలో నాలుగు పోతే చదవకపొతే ఆ విద్యార్థి స్మాల్ లెటర్స్ స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

🌼ఐదు సులభ పదాలలో నాలుగు పదాలు చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని నాలుగు  సులభ వాక్యాలు చదవమని కోరాలి.  

🌼నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవని విద్యార్థిని పదాల స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

🌼నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవగలిగిన విద్యార్థి వాక్యాలు స్థాయి లో ఉన్నట్లు గుర్తించాలి. 

ముఖ్య  గమనిక 

👉ఇంగ్లీష్ టూల్ రెండు విభాగాలుగా ఉంటుంది. 1. చదవడం 2. అర్థంచేసుకోవడం 

🌼కనుక ఐదు  పదాలలో నాలుగు   పదాలు చదవగలిగిన విద్యార్థిని ఆ పదాలకు అర్ధాలను వారి వాడుక భాషలో చెప్పమని కోరాలి. 

🌼అదేవిధంగా నాలుగు వాక్యాలలో రెండు వాక్యాల యొక్క అర్ధాన్ని వారు మాట్లాడే వాడుక భాషలో చెప్పమని కోరాలి. 

🏵️రాత పరీక్ష కు సంబంధించి అతి ముఖ్య గమనిక

🌼మౌఖిక పరీక్షలలో నాలుగు, ఐదు  స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.

ముఖ్య గమనిక:


మౌఖిక పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయిని రిజిస్టర్ నందు నమోదు చేయాలి. ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి.


మౌఖిక పరీక్షలో నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.


రెండు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ లలో మాత్రమే రాత పరీక్ష ఉంటుంది.


గణితంలో మాత్రం మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విధ ప్రక్రియలు చేయగలిగిన విద్యార్థులు రాత పరీక్ష రాసినట్లు పరిగణించాలి.


. ఆరు నుండి పదవ తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ లలో రాత పరీక్ష నిర్వహించాలి.


రాత పరీక్షలో మొత్తం నాలుగు స్థాయిలు "అ అన్నీ తప్పు.


1. అసలు ఏమీ రాయని / చేయని వారు


2. ప్రయత్నించారు కానీ


3. రెండు మాత్రమే సరిగా రాశారు.


4. అన్నీ సరిగ్గా రాశారు.


ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని విద్యార్థులకు ఇప్పటినుండే తగిన తర్ఫీదు ఇవ్వాలి.


తేదీ 22.07.22 న విద్యార్థులందరూ హాజరగుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.


ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధి లోని అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ యాజమాన్యాల పాఠశాలల వారికి ఈ విషయాలు తెలియజేయడంతో పాటు, నిర్వహణ తీరును పర్యవేక్షించవలసిందిగా కోరడమైనది.


ఈనెల 22 నాడు అన్ని తరగతులకు నిర్వహించబోయే బేస్ లైన్ టెస్ట్ శాంపిల్ పేపర్లను విడుదల చేశారు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షల్లో టెస్ట్ నిర్వహించబడుతుంది.

విద్యార్థి స్థాయిలో మార్పులేకపోతే ఉపాధ్యాయులపై చర్యలు

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆంక్షల ఒత్తిడి పెరుగుతోంది. బేస్లైన్ పరీక్షల తర్వాత విద్యార్థుల స్థాయుల్లో మార్పు రాకపోతే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ నెల 22 నుంచి విద్యార్థులకు బేస్ లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారో నిర్ధారిస్తారు. మొదట మౌఖిక పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఐదు స్థాయులుగా విభజిస్తారు. వీరిలో నాలుగు, ఐదు స్థాయుల్లో ఉన్న వారికే రాత పరీక్ష పెడ తారు. ఈ వివరాలను ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ యాప్లో నమోదు చేయాలి. ఆగస్టు 15 నుంచి మండల, డిప్యూటీ, జిల్లా విద్యాధికారులు పాఠశాలలను తనిఖీలు చేస్తారు. ఈ సమయంలో బేస్లైన్ పరీక్షలో విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు? ఆ సమయంలో ఏ స్థాయికి వచ్చాడో పరిశీలిస్తారు. ఒకవేళ విద్యార్థి స్థాయిలో ఎలాంటి మార్పు లేకపోతే ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇప్పటికే వర్చువల్ సమావేశంలో ఆదేశించారు. విద్యార్థి స్థాయి మారక పోతే ఉపాధ్యాయుడు చదువు చెప్పనట్లేనని, ఇదే ప్రాతిపదిక అని ఆయన పేర్కొన్నారు. నెల, రెండు నెలల్లో విద్యార్థి స్థాయిలో మార్పు రాకపోతే ఉపాధ్యాయులపై చర్యలకు ఉపక్రమించనున్నారు. ఇప్పటికే పాఠ్య ప్రణాళిక, డైరీలు రాయాలని, వీటిని క్షేత్రస్థాయి అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన పాఠ్య ప్రణాళిక ఆదేశాల అమలుకు ఇప్పుడు చర్యలు చేపట్టారు.

AP GO MS No: 177 Dated: 19-07-2022 Group Insurance Scheme slab rates

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక భీమా పథకం GIS - 01.01.2022 నుండి 31.03.2022 వరకు వడ్డీ రేట్లు, టేబుల్స్, RPS 2022 ప్రకారం స్లాబ్ రేట్లు నిర్ధారిస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల.


ఏపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల GIS స్లాబ్ రేట్లను PRC-2022 పే స్కేల్స్ ప్రకారం జీతాల నుంచి మినహాయించుటకు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.


స్లాబ్ A : 54,060 - 1,79,000 : రూ.120

స్లాబ్ B : 35,570 - 1,37,220 : రూ.60

స్లాబ్ C : 25,220 - 1,07,210 : రూ.30

స్లాబ్ D : 20,000 - 76,730 : రూ.15


01-01-2022 నుంచి 30-03-2022 వరకు GIS పథకంపై వడ్డీ రేటును 7.1 % గా చెల్లించుటకు నిర్ణయిస్త ఆదేశాలు జారీ.

Baseline Test Orientation YouTube Live

బేస్ లైన్ టెస్ట్ పై ఈ రోజు మధ్యాహ్నం 2.30గం.లకు అందరి ఉపాధ్యాయులకు (ప్రైమరీ, UP ,High School) (2nd Class to 10th Class) నిర్వహించబోయే BaseLine Test  మీద AP SCERT వారిచే ఆన్లైన్  Orientation YouTube Live ఈరోజు కలదు.

https://youtu.be/Lvegu_fFAi4



ఆగస్టులో ఉపాధ్యాయుల బదిలీలు: మంత్రి బొత్స సత్యనారాయణ గారు

ఉపాధ్యాయుల బదిలీలు ఆగ స్టులో నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. గరిష్ఠంగా ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ ఉంటుందన్నారు. ఎక్కువ మంది బదిలీ అయ్యేందుకు వీలుగా ఐదేళ్లుగా నిర్ణయిం చామని పేర్కొన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాల యంలో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో సంఘాల నాయకులు హృదయరాజు, జీవీ నారాయణరెడ్డి, వి. శ్రీనివాసరావు, కేఎస్ఎస్ ప్రసాద్ మంగళవారం మంత్రి బొత్సని కలిశారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తానని మంత్రి వెల్లడించారు. బదిలీల్లో గరి స్థంగా ఎనిమిదేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోవా లని, ఉపాధ్యాయులకు గతంలో కల్పించిన ఈ అవకా శాన్ని తొలగించొవద్దని మంత్రికి ఫ్యాప్టో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మంజుల విన్నవించారు.

ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారితో సమావేశమయ్యాము.ఈ సమావేశ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు

ఉన్నత పాఠశాలలో 46 రోల్ వద్ద రెండవ సెక్షన్ గా పరిగణలోకి తీసుకోవాలని కోరాము.

పిఎస్ హెచ్ఎం 100 రోల్ వద్ద అదనంగా ఇవ్వాలని ,

ఉన్నత పాఠశాలలో పది సెక్షన్ల తర్వాత హిందీతో పాటు పిఎస్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని ,

ఉన్నత పాఠశాలలలో 9,10 తరగతులకు రోల్ 10 దాటిన సమాంతరం మీడియం కొనసాగిస్తూ, సెక్షన్ ని కొనసాగించాలి. 

రోల్ తో సంబంధం లేకుండా యూపీ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇవ్వాలని హై స్కూల్స్లో హెచ్ఎంPD/,PET పోస్టులను రోల్ తో సంబంధం లేకుండా కొనసాగించాలని,

జులై 7 మంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరాము.

ఉన్నత పాఠశాలలో ప్లస్ 2 ఉపాధ్యాయులకు, ప్రదానోపాధ్యాయుల కు ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు.

2008 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు మే ఆరో తారీకు నుండి జీతాలు చెల్లించాలని ప్రాతినిధ్యం చేసాము.పరిశీలిస్తామని మంత్రి గారు చెప్పారు. 

బదిలీలకు మినిమం సర్వీసు జీరో సర్వీస్ ఉంటుందని,

మ్యాగ్జిమం సర్వీస్ 5 ఏకడమిక్ ఇయర్స్ అన్ని కేటగిరీలకు అని చెప్పారు. ఎనిమిది సంవత్సరాల సర్వీస్ ని మ్యాగ్జింగా పరిగణించాలని కోరాము.

పాఠశాలల విలీనాన్ని ఆపాలని, సమాంతర మీడియంను కొనసాగించాలని విజ్ఞప్తి చేశాము.

మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి ఈ నెల శాలరీలు ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరాము.

మున్సిపల్ సర్వీస్ రూల్స్ ని అమెండ్ చేసి అర్బన్ MEO, అర్బన్ డివైఓ పోస్టులను పూర్తి కోరాము.

మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పోస్ట్ లను అప్గ్రేడ్ చేయాలని ప్రాతినిధ్యం చేసాము.

ఈ సమావేశంలో FAPTO చైర్మన్ ఎన్ వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ సిహెచ్ మంజుల , V. శ్రీనివాసరావు డిప్యూటీ సెక్రటరీ జనరల్ , కార్యవర్గ సభ్యులు కె ఎస్ ఎస్ ప్రసాద్ , G.హృదయ రాజు,GVనారాయణరెడ్డి , MVSN ప్రసాద్ హాజరయ్యారు.

School Education - The Andhra Pradesh Right of Children to Free and Compulsory Education Rules , 2010- Amendments Notification - Orders

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్దులకు 25% ఉచిత సీట్లును లాటరీ సిస్టమ్ లో కేటాయించుటకు, ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ కోసం నూతన మార్గదర్శకాలు GO 129 Dated 15.7.2022 విడుదల.

Click Here To Download Go 

ప్రవేట్ పాఠశాలలకు మోదం - ప్రభుత్వ పాఠశాలలకు గొడ్డలి పెట్టు

ప్రైవేటు స్కూల్స్ లో పేద విద్యార్ధులకు సీట్లు రిజర్వు G.O 129 

Private Schools లో Entry level Class (1st/Pre school) లో 25% సీట్లు SC, ST, BC, EBC, Minority, Ph, Students of Aids Parents etc. లకు  రిజర్వు చేయటకు‌, ఫీజు రీ ఇంబర్స్  చేయుటకు విధి విధానాలు & RTE Act 2009AP G.O 20 కు సవరణలు చేస్తూ G.O 129 dt 15.7.2022 జారీ


Private Schools జాబితా ను online లో ఉంచి రిజర్వు కేటగిరి విద్యార్ధులకు  లాటరీ పధ్ధతిలో కేటాయింపు అవకాశము


Private schools లో సీట్లు మిగిలి పోతే ఆ పాఠశాలల పరిధి 3KM వరకు పెంపు.


జగనన్న అమ్మ ఒడికి వర్తించే అర్హతలే దీనికీ వర్తిస్తాయి.


ఆర్ధిక సం• లో మార్చి 31 లోపు ఫీజు రీయింబర్స్మెంట్ క్లైంలు ఆన్లైన్ చేసి July 31 లోపు చెల్లింపులు జరపాలి.


బడుల విలీనంపై ఎమ్మెల్యేలకు మంత్రి బొత్స లేఖ.క్షేత్రస్థాయి సమస్యలను తెలియజేయాలని సూచన

పాఠశాలల విలీనంపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ అధికారుల వైఖరి ఒకలా ఉంటే, మంత్రి బొత్స సత్యనారాయణ మరోలా స్పందిస్తున్నారు. పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ నలు చేస్తుండగా.. ఉన్నతాధికారులు మాత్రం క్షేత్రస్థాయి అధికారుల పై ఒత్తిడి చేసి, ఈ ప్రక్రి యను పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విలీన ప్రక్రియలో సమస్యలు ఉంటే తెలియజేయాలంటూ ఎమ్మెల్యేలకు మంత్రి బొత్స లేఖలు రాయడం విద్యాశాఖలో చర్చనీయాంశంగామారింది. పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఈనెల 18న అసెంబ్లీకి వస్తున్నం దున వాటిని లిఖిత పూర్వకంగా తెలియచేయా లని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులకు వెసులు బాటు ఉండేలా పాఠశాలల హేతుబద్ధీకరణకు కిలోమీటరు పరిధిని నిర్ణయించామని, విలీన పాఠ శాలకు వెళ్లేందుకు రహదారులు, వాగులు, వంక లను దాటాల్సి రావడంలాంటి పరిస్థితులు ఎక్క డైనా దృష్టికి వస్తే వాటిని సరిదిద్దే చర్యల్లో భాగ స్వాములు కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి సీఎం జగన్ ఆశయమని, అందరికి విద్యా హక్కు- జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పలు సంస్కరణ లకు విద్యాశాఖ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

Nadu NEDU STMS Latest version 2.5.3

మన బడి నాడు-నేడు  వెర్షన్ 2.5.3 కి 15.07.2022 న అప్డేట్ చేయబడినది.

(పాత app ని పూర్తిగా UnInstall చేసిన తర్వాతే, కొత్త App వెర్షన్ (2.5.3) ని Install చేయాలి).

Click Here TO Download App


బడి’.. బేజారు! ప్రభుత్వ పాఠశాలలు మానేస్తున్న విద్యార్థులు. విలీనంతో పెరిగిన దూరం. దీంతో ప్రైవేటు స్కూళ్ల బాట. అంతంత దూరం పంపలేకతల్లిదండ్రుల సంచలన నిర్ణయం. టీసీల కోసం భారీగా దరఖాస్తులు.ప్రైవేటుకు వరంగా మారిన విలీనం

పాఠశాలల విలీనంతో విద్యార్థులను సుదూర ప్రాంతాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. దీంతో సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను మానేసినట్టు తెలుస్తోంది. గత ఏడాది వరకు బడులు తెరిచిన మొదటి రెండు మూడు రోజుల్లోనే విద్యార్థుల కొత్త చేరికలు, తర్వాత తరగతికి ప్రమోషన్లు దాదాపుగా జరిగిపోయేవి. ఇప్పుడు బడులు తెరిచి వారం దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అనుకున్నస్థాయిలో కనిపించడం లేదు. మొ త్తం ఈ ఏడాది 47 లక్షలమందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటారని అంచనా వేశారు. అయితే, ఇప్పటి వరకు 36 లక్షల మంది మాత్రమే ఎన్‌రోల్‌ అయ్యారు. ఒకటో తరగతి, ఆరో తరగతి విద్యార్థుల చేరికలు కొంత ఆలస్యం అవుతాయి. ఈ రెండు తరగతుల్లో ఇప్పటికి మూడు లక్షలమంది బడుల్లో చేరారు. ఇంకా మిగిలిన చేరికలు గరిష్ఠంగా నాలుగైదు లక్షలు ఉండొచ్చు. వారు కూడా వస్తారన్న గ్యారెంటీ లేదు. మిగిలిన తరగతుల్లో చాలా వరకు ఎన్‌రోల్‌మెంట్‌ జరిగిపోగా, ఇంకా కొంత పెరగాల్సి ఉంది. అన్నీ కలిపినా ఈ ఏడాది ఐదు నుంచి పది శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధానంగా పాఠశాలల విలీనం కారణంగా ఉన్నట్టు తెలుస్తోంది.

దీనికితోడు.. తమ చిన్నారులను అసలు ఏ పాఠశాలలో చేర్పించాలి? ఎవరు పాఠాలు చెబుతారో? పిల్లల్ని ఎంత దూరం పంపించాలో? అని తల్లిదండ్రులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో అమ్మఒడి కింద అందిన నగదుతో తమ పిల్లలను సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని తెలుస్తోంది. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల ఫీజులు తక్కువగా ఉండడంతో అక్కడే చేర్పిస్తున్నారు. ఉచితమే అయినా.. సుదూర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. మరోవైపు ఈ పరిణామంపై సర్కారు పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. గత ఏడాది ‘అమ్మ ఒడి’ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ పెంచామని ప్రచారం చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు అమ్మ ఒడి ఇచ్చినా.. ప్రభుత్వ స్కూళ్లలో చేరకపోగా, ప్రైవేటును ఆశ్రయించడంపై డోలాయమానంలో పడ్డారు. దీనికి విలీనమే కారణమని తెలిసినా.. ఈ విషయంపై మాత్రం మౌనం వహిస్తున్నారు.  

ఇప్పుడేవీ ఆ ప్రకటనలు?

గతేడాది బడులు తెరిచిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిపోయిందంటూ ప్రభుత్వం వరుసగా ప్రకటనలు జారీచేసింది. ప్రతిరోజూ ఎంత మంది కొత్తగా చేరారనే వివరాలను విడుదల చేసింది. ఈ ఏడాది ఉన్నవారే వెళ్లిపోతుండటంతో ఆ ప్రకటనలు కనిపించడం లేదు. ఇప్పుడు ప్రకటనలు జారీచేస్తే అందులో ఎంత మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారనే విషయాలు వెలుగులోకి వస్తాయి. అందువల్ల ఆ విషయాలు బయటపడకుండా పాఠశాల విద్యాశాఖ చేరికల గురించి ఇంత వరకు పెదవి విప్పకపోవడం గమనార్హం.

అటు నుంచి అటే

విలీనం ప్రక్రియ లేకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదేమోగానీ, విలీనం ప్రారంభం కావడంతోనే పిల్లలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రాథమిక పాఠశాలల్లో రెండు, మూడు, నాలుగు తరగతులు చదివిన విద్యార్థులను అదే పాఠశాలల్లో తర్వాతి తరగతులకు ప్రమోట్‌ చేస్తారు. ఎవరైనా ప్రత్యేక పరిస్థితి ఎదురైతే తప్ప ఇతర బడులకు వెళ్లరు.కానీ, ఈ ఏడాది విలీనం పేరుతో 3, 4, 5 తరగతుల విద్యార్థులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు పంపుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులే తీసుకెళ్లి మ్యాపింగ్‌ చేసిన పాఠశాలలకు అప్పగిస్తున్నారు. ఈ ప్రక్రి య జరిగే సమయంలో కొందరు తల్లిదండ్రులు టీసీలు ఇస్తే తామే చేర్పించుకుంటామని కోరుతున్నారు. వారికి టీసీలు ఇవ్వగానే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ పాఠశాలలో 132 మంది విద్యార్థుల్లో ఇలా 28 మంది టీసీలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో టీసీల పుస్తకం అయిపోయిందని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు.  

ఆలస్యమూ ఓ కారణమే

ప్రభుత్వ పాఠశాలలను ఆరు రకాలుగా విభజించాలని ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుంది. బడులు తెరవకముందే దీనిపై ఉత్తర్వులు జారీచేసింది. కానీ, అమలు విషయంలో పాఠశాల విద్యాశాఖ తీవ్ర జాప్యం చేసింది. రేపు బడులు తెరుస్తారనగా ముందురోజు రాత్రి విలీనం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అప్పటి వరకు ఉపాధ్యాయులెవరికీ విలీనం ఉంటుందా? లేదా? అనే స్పష్టత లేదు. అప్పటికప్పుడు వచ్చిన ఉత్తర్వులను అమలుచేయడం కష్టంగా మారింది. లేదంటే ముందుగానే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించే అవకాశం ఉండేదని ఉపాధ్యాయులు అంటున్నారు. హడావుడిగా ఇచ్చిన ఉత్తర్వులు ఈ గందరగోళం నెలకొనడానికి కారణమయ్యాయనే వాదన వినిపిస్తోంది.

ప్రైవేటు వరంగా విలీనం

ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రక్రియ ప్రైవేటు విద్యాసంస్థలకు కాసులు కురిపిస్తోంది. ఈ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం అయినా, ప్రైవేటు అయినా ఏటా 5 నుంచి 10 శాతం వృద్ధి ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం ప్రైవేటులో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. కరోనా సమయంలో ప్రైవేటు నుంచి ప్రభు త్వ బడులకు వచ్చినవారు తిరిగి అక్కడికే వెళ్లిపోతున్నారు. 

APRS-5th CLASS PHASE-2 Results

Ap రెసిడెన్షియల్ పాఠశాలలో 5 వ తరగతి  ఫేజ్ 2 రిజల్ట్స్ 

https://aprs.apcfss.in/APRSFifthResult.do

UGC NET : యూజీసీ నెట్ 2022 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. యూజీసీ నెట్‌ డిసెంబర్ 2021, జూన్ 2022 ఫేజ్ 1 పరీక్షల కోసం అడ్మిట్ కార్డుల‌ను విడుదల చేసింది. సోమవారం (జూలై 11, మంగళవారం (జూలై 12) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏజెన్సీ అడ్మిట్ కార్డుల‌ను వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు అధికారికగి వెబ్‌సైట్ http://ugcnet.nta.nic.in నుంచి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

👉అధికారిక వెబ్‌సైట్వ్ http://ugcnet.nta.nic.inకి వెళ్లండి.

👉హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న యూజీసీ నెట్‌ డిసెంబర్ 2021, జూన్ 2022 అడ్మిట్ కార్డు లింక్‌పై క్లిక్ చేయండి.

👉అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఎంట‌ర్ చేయండి.

👉ఇప్పుడు సబ్‌మిట్‌ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

👉మీ యూజీసీ నెట్‌ 2022 అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

👉యూజీసీ నెట్ 2022 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయండి.

👉దాని ప్రింటవుట్ తీసుకోండి.

Rc.No.ESE02-20/24/2021-Estt.3-CSE-Part (3) Dated 14/07/2022 DSC-2008 – Renewal of Contract inrespect of 1757 Secondary Grade Teachers appointed on contract basis with Minimum Time Scale(MTS) with terms and conditions as applicable to contract employees w.e.f 05.07.2022 – renewal of contract period for 2022-23 academic year (10 Months) – Orders

డి యస్.సి 2008 కాంట్రాక్ట్ టీచర్స్  విధులు రెన్యువల్ చేస్తూ విద్యా శాఖ కమీషనర్ తాజా ఉత్తర్వులు.



School education- norms for the re- apportionment of teaching staff under various management viz, government, Zilla Parishad/ Mandal Parishad schools amendment orders

AP GO MS No: 128 Dated: 13-07-2022
ఉపాధ్యాయుల రేషనలైజేషన్ జీవో 117 కు సవరణలు చేస్తూ జీవో 128 విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గౌ.బుడితి రాజశేఖర్ గారు.
సవరణలు
1).   విద్యార్థుల రోలు 21 దాటి 60 మధ్యలో ఉంటే రెండో SGT పోస్టు మంజూరు
2).   150 రోలు దాటితో PS HM పోస్టు మంజూరు
3).   ఉన్నత పాఠశాలల్లో (6 నుంచి 10 తరగతులకు) 10 సెక్షన్ల నుంచి రెండో హిందీ పోస్టు మంజూరు.

డిగ్రీలో 40 % వచ్చినా టెట్కు అర్హులే

డిగ్రీలో 40 శాతం మార్కు లు పొంది బీఈడీ ఉత్తీర్ణులైన ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగ అభ్యర్థులందరూ టెట్ పేపర్ 2 ఏ రాయవచ్చని పాఠశాల విద్యా శాఖ కమి షనర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు .

అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఈ అవకాశము ఉంటుందని తెలిపారు . కాగా , టెట్ ఆన్లైన్ పరీక్షలు ఆగస్ట్లో జరగనున్నాయి

దీనికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే టెట్ వెబ్సైట్ లో పొందుపరిచారు .

AP EAPCET 2022 Keys-Response Sheets-Question Papers- Key Objections

AP EAPCET-2022 ఇంజనీరింగ్ కేటగిరీ లో ప్రిలిమినరీ 'కీ', రెస్పాన్స్ షీట్స్, మాస్టర్ ప్రశ్నాపత్రాలు విడుదల

https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

Deceplinary action taken those teachers and non teaching staff who are given representations hod's

ఉపాధ్యాయ,బోధనేతర సిబ్బంది నేరుగా రెప్రజేంటేషన్, ఫిర్యాదులు HOD కి ఇవ్వడం అవిధేయత క్రిందకు వస్తుందని, అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసిన జే.డి సర్వీసెస్



DSC 2008 MTS ఉపాధ్యాయుల 10 నెలల పాటు నియామక నిమిత్తం విడుదల చేసిన GO 111

పాఠశాల విద్య- 06.05.2022 నుండి 06.05.2022 నుండి పది (10) నెలల కాలానికి, కనీస కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రాష్ట్రంలో DSC - 2008లో నియమితులైన (1757) సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల కాంట్రాక్ట్ పీరియడ్ పునరుద్ధరణ సంవత్సరం 2022-2023 - పర్మిషన్ ఆర్డర్లు - జారీ .


Rc. No.31/A&I/2022 Dated: 10/07/2022 Establishment of Junior Colleges- one exclusive for girls in every Mandal in the State - Annual Academic Program (Calendar) for the Academic year 2022-23

 రాష్ట్రంలోని ప్రతి మండలంలో బాలికల కోసం ప్రత్యేకంగా ఒక జూనియర్ కళాశాలల స్థాపన - 2022-23 విద్యా సంవత్సరానికి వార్షిక విద్యా కార్యక్రమం (క్యాలెండర్) విడుదల.

Click Here 

Residential schools results Released

రెసిడెన్షియల్ స్కూల్స్ నందు మిగిలిపోయిన 6,7,8 తరగతుల సీట్లకు దరఖాస్తు చేసిన వారి ఫలితాలు విడుదల .

 https://aprs.apcfss.in/APRSBacklogResult.do

National Pension System – Contributory Pension Scheme –For authorization of Family Pension/Invalid Pension to the State Government employees covered under NPS and their family members in case of died while in service without having PRAN No – Orders issued by Government

 ప్రాన్ కార్డు లేకుండా చనిపోయిన CPS ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ కి సంబందించి సూచనల మార్గదర్శకాలు విడుదల.

School Education – Updation of Child Info and marking of Student Attedance – Orders


As the 30th September of respective academic year is the cutof date for updating UDISE+ data, the same will be applied for updating the child information also.

The Child info registrations shall be stopped w.e.f 30.09.2022 for the academic year 2022-23.

As the student’s attendance is one of the criteria for Jagananna Ammavodi program, all headmasters and teachers shall ensure that the students who attend the school shall be updated and synchronized regularly to ensure that all the students refected in students attendance app

Navodaya 6th Class Entrance Exam JNVST 2022 Results

జవహర్ నవోదయ విద్యాలయాలలో (2022-23) 6వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి 30.04.2022 జరిగిన ఎంపిక పరీక్ష ఫలితాలు విడుదల...అన్ని జిల్లాల ఫలితాలు పి.డి.ఎఫ్ లో కలవు.

Click Here To Download results

Childinfo new admission option enabled now

New Admissions

Child info site లో Admission & Exit లో  Student Profile Entry లో స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం 1 fill చేయాలి

ఆ తర్వాత నే ఫారం 2 FIIL చేయాలి.

https://studentinfo.ap.gov.in

ఫారం 1 ను పూర్తి చేసి ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే

పారం 1 , 2 రెండు వివరాలు అసంపూర్తిగా ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు

మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ ( BASIC DETAILS ) చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది

స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ  కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే entry ఫారం ఓపెన్ అవుతుంది

1.STUDENT BASIC DETAILS

2.PARENT BASIC DETAILS

ఆధార్ నెంబర్ , బాంక్ అకౌంట్ డీటెయిల్స్ , IFSC కోడ్ , పేరెంట్స్ మొబైల్ నంబర్స్

3.OTHER DETAILS

BLOOD గ్రూప్

EMAIL ID

MOLE1,2

ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది

NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్అవుతుంది


Sanction of two outsourcing posts in upgraded junior colleges

జూనియర్ కళాశాలలుగా అప్డేట్ అవుతున్న ఉన్నత పాఠశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో రెండు నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు.



Up gradation of 292 high schools into high school plus for girls from academic year 2022-23

292 హై స్కూల్ లో 2022-23 సంవత్సరం నుండి బాలికల హై స్కూల్ ప్లస్ కాలేజి లను ఏర్పాటు చేస్తూ జీవో జారీ .

Click Here To Download Go 

ఉపాధ్యాయ బదిలీలు,రేషనలైజేషన్ సమాచారం Dt.07.06.2022.విద్యాశాఖ మంత్రి గారితో ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో చర్చించిన అంశాలు

1. జి.ఓ. నం.117కు ఈ రోజు లేక రేపు మార్పులు చేసి ఉత్తర్వులు ఇస్తారు


. ప్రాథమిక పాఠశాలల్లో 1:20గా చూస్తారు. 21 రోల్ దాటితే 2వ పోస్టు ఇస్తామన్నారు.


 ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం. పోస్టు 150 రోల్ పైన ఉన్న పాఠశాలకు ఇస్తారు.


ఎన్ రోల్ మెంట్ తేదీని 05.05.2022గానే ఉంచారు.


 హైస్కూల్ లో 2వ హిందీ టీచర్ పోస్టు 10 సెక్షన్ వద్ద ఇస్తారు.


 ప్రీ హైస్కూల్స్ లో 98 రోల్ పైన ఉన్న చోట 6గురు స్కూల్ అస్టిస్టెంట్లు 1 పిఇటిని ఇస్తారు.


రాష్ట్రంలోని హైస్కూల్స్ లో 998 హెచ్.ఎం. పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు.


 స్కూల్ అసిస్టెంట్  5419 పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు.


 రాష్ట్రంలో 2342 ఎస్.ఏ. పోస్టులు తత్సమాన పోస్టులకు కన్వర్షన్ ఇస్తున్నారు.

అన్ని హైస్కూల్స్ కి


 హెచ్.ఎం. మరియు పి.డి. పోస్టు ఇస్తారు.


 అన్ని వసతులున్న చోట మాత్రమే మెర్జింగ్ చేస్తారు.


 ఏ ఉపాధ్యాయునికి 36 పీరియడ్లు పైబడి ఉండవు.


 ప్రభుత్వం నుంచి సిఫార్సు బదిలీలు ఉండవు.


జీరో సర్వీసుతో బదిలీలు చేస్తారు.


కట్ ఆఫ్ డేట్:30:06:2022 జులై నెలాఖరుకు మార్చాలని కోరాము.


 Maximum sevice:5 years for all cadres,

Nc teachers కు కూడా.


హెచ్ఎంలకు తప్ప మిగిలిన అన్ని క్యాడర్లకు 8 సం.లు ఉండాలని కోరాము.


2021 జనవరిలో transfer అయి ప్రస్తుతం rationalization కు గురయ్యే టీచర్లకు పాత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు.


. మ్యాపింగ్ వలన ఎఫెక్ట్ అయ్యేవారికి మాత్రమే స్పెషల్ పాయింట్స్ ఇస్తారు. మిగిలిన వారికి రేషనలైజేషన్ పాయింట్లు లేవు


. Against PD పోస్టులలో పనిచేసే PET లు కూడా బదిలీ చేస్తారు.


హైస్కూల్స్ లో 1:60 కాకుండా 1:45గా ఉండాలని ప్రాతినిధ్యం చేసాం.


. అన్ని కేడర్ల వారికి ఆన్ లైన్ లోనే బదిలీలు జరుగుతాయి. 


 MEO లకు బదిలీలు ఉండవన్నారు


12.  సీనియార్టీని స్కూల్ base గా కాకుండా స్టేషన్ base గా (పంచాయతీ) బదిలీలు ఉంటాయి.


ఆన్లైన్ విధానంలో పొరపాటు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.


ఓ.హెచ్ .,వి.హెచ్. వారికి 80% ఉంటేనే పరిగణిస్తారు


వినికిడి సమస్యలు ఉన్నవారిని పరిగణించరు


ఉర్దూ మీడియం పాఠశాలలో పనిచేసే తెలుగు ఉపాధ్యాయుల

అంశం పరిశీలిస్తామన్నారు


సింగిల్ మీడియా మాత్రమే ఉంటుంది తెలుగు మాధ్యమం ఉండదు అని చెప్పారు


ఎస్జీటీ పోస్టులు అదనంగా ఉన్న పాఠశాలలో బ్లాక్ చేస్తారు.


స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అదనంగా ఉన్నప్పటికీ బ్లాక్ చేయరు


సర్ ప్లస్ గా ఉన్న పోస్టులలో 2814 పోస్టులను కర్నూలు జిల్లాకు షిఫ్ట్ చేసి అప్గ్రేడ్ చేస్తారు 


పాతజిల్లాల ప్రాతిపదికన బదిలీలు ఉంటాయి


పూర్తి తాజా సమాచారం తర్వాతఅందిస్తాము.

Sanction of expenditure on Funeral charges (obsequies charges) of d-eceased Government Employees Enhancement of Funeral Charges (Obsequies charges) from Rs.15,000/- to Rs.25,000/- - Amendment

రూ.15,000/- నుండి రూ.25,000/- వరకు అంత్యక్రియల ఛార్జీలు (ఆబ్సెక్వియస్ ఛార్జీలు) పెంపుదల ఉత్తర్వులు జారీ

 


Declare All second Saturdays are Holidays in academic year 2022-23

ఈ విద్యా సంవత్సరంలో జూలై-2022 నుండి ఏప్రిల్-2023 వరకు అన్ని రెండవ శనివారాలు సెలవు దినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వారి ఉత్తర్వులు



బడుల విలీనంతో చదువుకు దూరం విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన - పాఠశాలకు తాళాలు

చిన్నపిల్లలను దూరప్రాంతానికి పంపలేం

ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం

ప్రజాశక్తి-యంత్రాంగం : గ్రామంలోని పాఠశాలను ఎత్తివేస్తే తమ పిల్లలు ఎక్కడ చదువుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఆందోళనకు దిగారు. పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంలోని పలు జిల్లాల్లో మంగళవారం నిరసన తెలిపారు. పాఠశాలలకు తాళాలు వేశారు. ఉపాధ్యాయులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి చదువేనంటూ ముఖ్యమంత్రి ఒకవైపు చెప్తూ, నూతన విద్యా విధానంలో భాగంగా పాఠశాలల సంఖ్యను మరోవైపు కుదిస్తుండడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్తున్న మాటలకు, ఆచరణకు పొంతన లేకుండా ఉందని ఆక్షేపించారు. తమ గ్రామంలోని పాఠశాలలను మూసివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దగ్గరలోని పాఠశాలను మూసేసి, దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లాలని చెప్తుండడం ఎంతవరకూ సమంజమని ప్రశ్నించారు. ఈ ఆందోళనల్లో విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులను కాళ్ల హైస్కూల్లో విలీనం చేయొద్దంటూ ఆ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 86 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళ్లకూరు ప్రాథమిక పాఠశాలకే సుమారు రెండు కిలోమీటర్లుపైబడి దూరం నుంచి వస్తున్నారని, కాళ్ల హైస్కూల్‌కు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ ఎస్‌సి కాలనీలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలను జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అమరావతి రోడ్డు దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందని, ఈ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ బండమీద జర్రావారిపల్లిలోని పాఠశాలను కీలపట్ల పాఠశాలలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జర్రావారిపల్లిలోని పాఠశాలకు తాళం వేసి విద్యార్థులతో కలిసి అక్కడ బైటాయించారు. ఉపాధ్యాయులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మూడు కిలోమీటర్ల దూరంలోని కీలపట్ల పాఠశాలకు వెళ్లాలంటే అడవి దారిలో ప్రయాణించాల్సి వస్తుందన్నారు. అడవి జంతుల దాడికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలను వేరే ఊరికి పంపే ప్రసక్తి లేదని నినాదాలు చేశారు. కార్వేటినగరం మండలం ఎన్‌ఆర్‌ కండ్రిగ, పాదిరి కుప్పం పాఠశాలలను జెడ్‌పి ఉన్నత పాఠశాల విలీనం వద్దని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా పాఠశాలల ఎదుట నిరసన తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. 3, 4, 5 తగరతులకు ఇతర ప్రాంతాల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించారు. హిందూపురం పురపాలక సంఘం పరిధిలోని మేళాపురం ప్రాథమికోన్నత పాఠశాలను ముదిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు పాఠశాలకు తాళంవేసి నిరసన చేపట్టారు. కణేకల్‌, బెళగుప్ప, బ్రహ్మసముద్రం మండలాల్లోని నిరసనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడు పాఠశాలను విలీనం చేయొద్దని పాఠశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాలలో సుమారు 260 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఇంతమంది పిల్లలున్న పాఠశాలను ఎలా విలీనం చేస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు.

Andhra Pradesh Public Service Commission DEPARTMENTAL TESTS MAY, 2022 SESSIONNOTIFICATION NO. 05/2022

APPSC డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగింది.



Ammavodi payment status using aadhar number

అమ్మఒడి పేమెంట్ స్టేటస్  క్రింది లింక్ ద్వారా అమ్మఒడి పథకానికి సంబంధించి మదర్ ఖాతా లో మనీ పడిందా? లేదా? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మదర్ ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలరు.

 https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP


Visakhapatnam district rationalalization information and surplus deficit post details


విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్, హై స్కూల్ ల రేషనలైజేషన్ వివరాలు, సర్ప్లస్ మరియు డెఫిషిట్ పోస్ట్ ల వివరాలు.

Road safety pledge in English and school safety pledge in telugu

Road Safety-Pledge(Every Tuesday)

Road is a symbol of civilization.  Travel is a sign of progress.  For us heirs of the technological age, travel is an essential necessity.

It is our duty to follow the traffic rules, respect the traffic police and use vehicles with discretion.  So I state that I will cross the road only at zebra crossings and get on and off only when the bus stops.

Life is very precious.  I understand that driving vehicles without helmet and seat belt at excessive speed, recklessly and without awareness is a danger and one who commits an irreparable mistake.

I will promote that driving under the age, without license, talking on cell phone and driving under the influence of drugs destroys lives.

I solemnly swear that the roads should shine with shade trees and not be stained with bloodstains.


పాఠశాల భద్రత ప్రతిజ్ఞ (ప్రతి బుధవారం)

 మేము, (పాఠశాల పేరు) ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు మా పాఠశాల అందరికీ సురక్షితమైన, భద్రమైన మరియు సంతోషకరమైన ప్రదేశంగా ఉండేలా ప్రతిజ్ఞ చేస్తున్నాము.


పాఠశాల అధిపతికి మద్దతు ఇస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము:

 1. పాఠశాల ఆవరణలో లేదా వెలుపల పిల్లలను వదిలివేయలేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పాఠశాల రోజు చివరిలో పాఠశాల భవనంను వదిలివెలతాం.

 2. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అతని/ఆమె అనుమతితో మాత్రమే వివిధ కార్యకలాపాల కోసం పాఠశాలలో తిరిగి ఉండేలా చూసుకోండి.

 3. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరినీ క్రమం తప్పకుండా మరియు కనీసం వారానికి ఒకసారి కలుసుకోండి మరియు సంభాషించండి.

 4. ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క అవసరాలు మరియు ఆందోళనల పట్ల సున్నితంగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ప్రాథమిక తరగతుల్లో ఉన్నవారు.

 5. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన మరియు బెదిరింపు లేని వాతావరణాన్ని సృష్టించండి మరియు బెదిరింపులను అరికట్టండి.

 6. తరలింపు కసరత్తులను క్రమం తప్పకుండా నిర్వహించండి.

 7. ఒక సూచన/పోస్కో బాక్స్‌ను నిర్వహించండి మరియు విద్యార్థులు భాగస్వామ్యం చేసిన వ్యాఖ్యలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.

DSC-2008 –Appointment of 1757 DSC 2008 candidates, as Secondary Grade Teachers on contract basis with Minimum Time Scale(MTS) with terms and conditions as applicable to contract employees renewal of contract period for 2022-23 academic year (10 Months)


డిఎస్సీ 2008 MTS ఉపాధ్యాయుల యెక్క సర్వీస్ 2022-23 విద్యా సంత్సరానికి (10నెలల ప్రాతిపదికన )రెన్యువల్ చేస్తూ 5.7.22 నుంచి హాజరు అవ్వమని కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వులు

RC.No. ESE02-13/90/2021- EST 3-CSE-Part(5) Date:04/07/2022 School Education Mapping of School maintenance of records, adjustment of teachers instructions

3 , 4 , 5 తరగతుల రిజిస్టర్లు అప్పగించాలని ఆదేశాలు

 ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలల్లో విలీనమైన ప్రాథమిక పాఠశాలలకు చెందిన 3 , 4 , 5 తరగతుల విద్యార్థుల వివరాలు , రిజి స్టర్లు , టీసీలను అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు . 

Click Here To Download proceedings 

కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో 3 , 4 , 5 తరగతులను విలీనం చేయాలని , ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలల్లో సదు పాయం ఉన్నచోట్లే విద్యార్థులను పంపించాలని గతంలో ఆదేశాలు ఇచ్చిన అధి కారులు క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు .

 ఉన్నత పాఠ శాలల్లో సదుపాయాలతో సంబంధం లేకుండా కిలోమీటరు దూరంలోని 3 , 4 , 5 తరగతులను విలీనం చేయడంతోపాటు రికార్డులను అప్పగించాలని ఆదేశిం చారు . 

విద్యార్థుల సంఖ్య వందలోపు ఉన్న ప్రాథమికోన్నతబడులను మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు .

 హేతుబద్ధీకరణతో ఎక్కువగా తేలిన ఉపాధ్యాయులను తాత్కాలి కంగా ఆయా బడుల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు . 

ఎస్జీటీలు తాత్కా లికంగా సబ్జెక్టు ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పాల్సి ఉంటుంది .

విలీనమైన విద్యార్థుల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించొద్దని , ప్రస్తుతం ఉన్న రిజిస్టర్లోనే కొత్తగా వచ్చిన వారి పేర్లు రాయాలని సూచించారు

JVK kit distribution details submitting form

క్రింది  లింక్ ద్వారా ప్రతీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు  తన పాఠశాలలో జూలై 5వ తేదీ నుండీ విద్యార్దులకు అందించడానికి అందుబాటులో ఉన్న  జగనన్న విద్యా కానుక kits వివరాలను submit చేయాలి.

https://datastudio.google.com/reporting/35cbd54a-1860-404f-aa65-85b733cd6ba7

CMOs అందరూ ఈ లింక్ ను మీ జిల్లా DEO/APC ల ద్వారా ప్రధానోపాధ్యాయులు/MEO వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసేటట్లు చేసి మీమీ జిల్లాలో అన్నీ పాఠశాల HMs ఈ google sheet ను  ఉదయం 10 గంటల నుండి 11 గం ల మద్యలో submit చేయడానికి కృషి చేయగలరు.

Mana badi Nadu nedu app Latest Version released

మన బడి నాడు నేడు APP  జులై 4 న కొత్త వెర్షన్ 2.5.2 కు అప్డేట్ చేయడం జరిగింది. App ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని Install చేయవచ్చును.పాత యాప్ పనిచేయదు.

Click Here To Download APP 

JVK APP Latest Version released

జగనన్న విద్యాకనుక అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ 1.1.6 నుండి వెర్షన్ 1.1.7 కి అప్డేట్ అయ్యింది.

MEOs, Complex HMs మరియు అన్ని పాఠశాలల వారు ఈ అప్డేటెడ్ వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు.

Click here to download app

పై apk నుండి యాప్ ను ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసే ముందు పాత వెర్షన్ ను అన్ఇన్స్టాల్ చేయండి

NMMS 2021-22 Selection List PDF To find with Ur Roll No

NMMS 2021-22 సెలక్షన్ లిస్ట్ లను విడుదల చేయడం జరిగింది.మీ రోల్ నెం తో ఫలితాలను తెలుసుకోగలరు.

Click Here To Download list

https://portal.bseap.org/APNMMSRESJUN/SiteContent/NMMSRESULTS.aspx

Rc.No. ESE02/501/2022- SCERT Dt.04/07/2022 School Education – SCERT AP – Baseline Assessment - School Remedial Teaching Programme – Certain guidelines issued.

జూలై 22న అన్ని పాఠశాలలో 2 వ తరగతి నుండి  10వ తరగతులకు baseline టెస్ట్ లు నిర్వహించాలని ఉత్తర్వులు.

Click Here To Download proceedings 

Memo.No.ESE02-27021/7/2022-MDM-CSE Dated:- 03/07/2022 Provide Eggs and Chikkies during Midday Meal to all the Students in the School irrespective of them having Mid day meals from the academic year 2022-23 under Jagananna Gorumudda

మధ్యాహ్నం భోజనం తో సంబంధం లేకుండా 2022-23 విద్యా సంవత్సరం నుంచి  పాఠశాలలోని విద్యార్థులందరికీ గుడ్లు, చిక్కిలు అందించాలని ఉత్తర్వులు విడుదల.




D.EL.Ed 1st Year SPOT Results- 2022 (2018-20 Batch)

డీ.ఎల్.ఈ. డీ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల 𝐀𝐃𝐌𝐈𝐓𝐓𝐄𝐃  𝐁𝐀𝐓𝐂𝐇 2018-20 𝐒𝐏𝐎𝐓  https://portal.bseap.org/DEDISTYRRESULTSJUN/Results_SPOT.aspx

23 Teachers Increment Postponement - due to lack of Knowledge about Readiness Programme

డి.ఈ.ఓ గారి ఆకస్మిక తనిఖీ లో స్కూల్ రెడీ నెస్ కార్యక్రమం పై అవగాహన లేకపోవడం తో 23 టీచర్ల ఇంక్రిమెంట్ సంవత్సరం పాటు నిలుపుదల.



School Education Department – A.P Model Schools – Certain instructions for admission into class VI & Intermediate 1st year for academic year -2022-23

పాఠశాల విద్యా విభాగం – A.P మోడల్ పాఠశాలలు 2022-23 విద్యా సంవత్సరానికి VI తరగతి & ఇంటర్మీడియట్ 1వ సంవత్సరంలో ప్రవేశానికి సంబంధించి ముఖ్యమైన తేదీలు.



Click Here 

Ap EAPCET Engineering, Agriculture and Pharmacy Common Entrance Test(Conducted by JNTU Anantapur on behalf of APSCHE)HALLTICKTS download Link

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ AP EAPCET హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ 

https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallticket.aspx


FEED BACK ON MATHS NCERT TEXT BOOK ORIENTATION.

 8th Class New Text Books మీద యూట్యూబ్ లైవ్ కు అట్టెండ్ అయిన Maths టీచర్స్ అందరూ సబ్మిట్ చేయాల్సిన Feed Back Google Form Link

Click Here Google Form 

LATEST POST

Ap Polycet Rank cards Available

పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2026 ఫలితాలు ఈరోజు ఉదయం 10 గంట లకు విడుదల చేయడం జరిగింది. https://polycetap.ap.gov....