మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

బడుల విలీనంపై ఎమ్మెల్యేలకు మంత్రి బొత్స లేఖ.క్షేత్రస్థాయి సమస్యలను తెలియజేయాలని సూచన

పాఠశాలల విలీనంపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ అధికారుల వైఖరి ఒకలా ఉంటే, మంత్రి బొత్స సత్యనారాయణ మరోలా స్పందిస్తున్నారు. పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ నలు చేస్తుండగా.. ఉన్నతాధికారులు మాత్రం క్షేత్రస్థాయి అధికారుల పై ఒత్తిడి చేసి, ఈ ప్రక్రి యను పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విలీన ప్రక్రియలో సమస్యలు ఉంటే తెలియజేయాలంటూ ఎమ్మెల్యేలకు మంత్రి బొత్స లేఖలు రాయడం విద్యాశాఖలో చర్చనీయాంశంగామారింది. పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఈనెల 18న అసెంబ్లీకి వస్తున్నం దున వాటిని లిఖిత పూర్వకంగా తెలియచేయా లని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులకు వెసులు బాటు ఉండేలా పాఠశాలల హేతుబద్ధీకరణకు కిలోమీటరు పరిధిని నిర్ణయించామని, విలీన పాఠ శాలకు వెళ్లేందుకు రహదారులు, వాగులు, వంక లను దాటాల్సి రావడంలాంటి పరిస్థితులు ఎక్క డైనా దృష్టికి వస్తే వాటిని సరిదిద్దే చర్యల్లో భాగ స్వాములు కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి సీఎం జగన్ ఆశయమని, అందరికి విద్యా హక్కు- జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పలు సంస్కరణ లకు విద్యాశాఖ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

LATEST POST

Ap Polycet Rank cards Available

పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2026 ఫలితాలు ఈరోజు ఉదయం 10 గంట లకు విడుదల చేయడం జరిగింది. https://polycetap.ap.gov....