మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Latest Updated Version DIKSHA App

DIKSHA APP (JULY 31)న అప్డేట్ అయ్యింది, కొత్త UPDATED వెర్షన్ ను క్రింది లింక్ నుండి INSTALL/ Update చేసుకోగలరు.

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app

Dearness Allowances to the State Government Employees from 1st January 2019. G.O.Ms.No.51 Dated 31-07-2021.

జనవరి  2019 డి.ఏ జి.ఓ విడుదల 

Cash from July 2021 those salaries paid in August 2021.
From 1st January 2019 to June 2021 Arrears Into ZPPF / GPF accounts.
From January 2019 to June 2021 10% Arrears amounts into PRAN Accounts for CPS Employees.

జనవరి 2019 నుంచి రావలసిన కరువుభత్యం DA ARREARS 30 నెలల బకాయిలు 3 విడతల లో చెల్లిస్తారు.జూలై నెలలో జీతం తో పాటు చెల్లించాలి. కొత్త డిఎ తో జూలై నెల జీతం వివరాలు HRA వారీగా మరియు మీ  బేసిక్ పే కి 3 విడతలకు మొదటి విడత  ఆగష్టు లో ఎంత వస్తుంది పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది.

https://www.aptfvizag.com/2021/07/da-33536-from-01012019-cash-paid-in.html

From January 2019 to June 2021 90% Arrears Amounts to be Paid in cash to CPS Employees in 3 Equal Installments.

Dearness Relief to Pensioners @ 3.144% with effect from 1st January, 2019

G.O 50 ప్రకారం  DR @33.536%  July  2021 నుండి పెన్షనర్ లకు చెల్లింపు  జరుగును.ది 1.1.2019 నుండి ది30.6.2021 వరకు చెల్లించాల్సిన DA @33.536% బకాయిలను  3 వాయిదాలు లో చెల్లిస్తారు.కాని ఆ వాయిదాలు  ఏవో, ఎప్పుడో  G.O లో చెప్పలేదు.

New Education Policy 2020 Transformation from 10+2 academic structure to 5+3+3+4 structure - Certain guidelines - Issued Cir:172 Dt:31.07.21

న్యూ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం -2020...New Education Policy Guidelines Dt.31.07.2021 విడుదల.ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22 నుండే అమలు. పూర్తి విధి  విధానాలు.10+2 నుండి 5+3+3+4 Academic Structure మారుస్తూ ఉత్తర్వులు జారీ

 NEP హైస్కూళ్ళ (3-10) ఏర్పాటు.
NEP అమలులో భాగంగా HS లకు 250 మీటర్ల పరిధిలోని PS ల లోని 3-5 తరగతులను High schools లో విలీనం చేయుటకు DEO లు HMs కు ఏర్పాటు చేసిన Preparatory meetings లోని కొన్ని అంశాలు.
HS లలో రూములు చాలక పోతే PS లోని రూములను వాడుకోవాలి. క్రొత్త రూములు కట్టే వరకు టీచర్లు అక్కడకు వెళ్ళి 3-5 తరగతులకు బోధించాలి. 
3-5 తరగతులకు 4 hours మాత్రమే Subject బోధన. మిగిలిన Hours Rhymes, Tables, yoga, Drill, Extra CA, Home work etc. Brain కు Strain లేకుండా మనస్సు ను ఆహ్లాదం పరచాలి. 
Subject Teachers చాలక పోతే HMs ఆ తరగతులకు వెళ్ళాలి.  PS నుండి వచ్చే టీచర్ల తోపాటు HS లోని SA లు కూడా అవసరమైతే 3-5 తరగతులు బోధించాలి. 
HM & PET లు ఉదయం 8 గంటలకే రావాలి. P.Et/PDs ఉ 8-9.30AM వరకు మరియు 4PM to 6PM వరకు పాఠశాలలో ఉండి విద్యార్థులకు Study hour games, Sports,Yoga etc నేర్పించాలి. మిగిలిన Time లో HS లో అవసరము లేదట.
 Parents లో పనుల కెళ్ళే వాళ్ళు తమ పిల్లలను ఉదయం 8 గంటలకు స్కూలు లో దించి, మరల సా6 గంటలకు తీసుకెళ్ళే అవకాశము ఉన్న పాఠశాలల్లో కూడా ఉండాలి. కనీసం ఒక టీచరైనా ఆ సమయముల లో Parents కు School లో కనపడాలి.
క్రొత్తగా స్కూలు అసిస్టెంట్లు పోస్టులు ఏవీ ఇప్పుడే మంజూరు కావు. It Tskes Time. 
2022 నాటికి అన్ని PS ల లోని 3-5 తరగతులు HS/UP లలో Merge అవుతాయి. Merged 3-5 తరగతులకు క్లాసుకు ఒకరు చొప్పున SGT/LFL HM ను బదలాయించ బడును. 
ఈ HS లలో3-5 తరగతులు బోధించే‌ Teachers HM కంట్రోలులో ఉంటారు.
3-5 తరగతులు విలీనం వలన ఆ విద్యార్థులకు high school అంటే భయం పోవును. 
ఈ 3-5 తరగతులకు ఏదో ఒక మీడియం(TM/EM) లోనే బోధన ఉండునట.
Dy Eo & MEO లు సరిపడినంత లేరు కనుక HMs కు కొన్ని ఇతర bvNEP High schools(-) ను Supervision బాధ్యత కూడా ఇస్తారు.

BASE LINE TEST MARKS ENTRY LINK

బేస్ లైన్ పరీక్ష లకు సంబంధించి Marks Entry ఆప్షన్ ను ఎనేబుల్ చేశారు .పిల్లల మార్క్స్ ను ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు. 

USER ID AND BASE LINE TEST  MARKS ENTRY LINK ARE SAME AS CHILD INFO

https://studentinfo.ap.gov.in/EMS/logout.do


APPSC Departmental Tests November 2020 Notification Hall Tickets are available

డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ హాల్ టికెట్ లను విడుదల చేయడం జరిగింది 

Click Here To Download Hall Tickets 

CBSE: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల..

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.విద్యార్థులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌(cbseresults.nic.in లేదా cbse.gov.in)ను వీక్షించవచ్చు. దాంతోపాటు digilocker.gov.in, డిజిలాకర్ యాప్‌లో ఫలితాలను చూసుకునే వీలుంది. అందుకోసం విద్యార్థులు రోల్‌నంబర్‌ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

 https://www.cbse.gov.in/

ఆగ‌స్టు 16న పాఠ‌శాల‌లు పునఃప్రారంభిస్తాo- విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.

ఆగ‌స్టు 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠ‌శాల‌లు పునఃప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ పునరుద్ఘాటించారు.

☆ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు తెరుస్తున్నామన్నాారు. 

☆ ఉపాధ్యాయుల్ని విద్యార్థుల ఇంటికి పంపి సన్నద్ధతకు ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి వివరించారు. 

☆ ఉపాధ్యాయుల‌కు ఆగ‌స్టు16లోగా 100శాతం బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పూర్తిచేయాల‌ని సీఎం జగన్​ ఆదేశించినట్లు తెలిపారు.

☆ నాడు-నేడు ప‌నులు 98శాతం పూర్తయ్యాయని.. ఆగస్టు 16న సీఎం జగన్ వీటిని ప్రజ‌ల‌కు అంకితం చేస్తారని పేర్కొన్నారు. 

☆ అదేరోజు నాడు-నేడు రెండోదశ కింద రూ. 4వేల కోట్లతో 16వేల స్కూళ్ల రూపురేఖ‌లు మార్చే కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. 

☆ అమ్మ ఒడి వ‌ద్దన్న 9 ల‌క్షల మంది, డిగ్రీ కాలేజీల్లో వ‌స‌తి దీవెన వ‌ద్దనుకుంటున్న విద్యార్థులకు వ‌చ్చే విద్యాసంవ‌త్సరం నుంచి ల్యాప్​ట్యాప్​లు ఇస్తామన్నారు.

MDM RICE ALLOCATION FOR THE MONTH OF AUGUST2021

మీ పాఠశాలకు ఆగష్టు నెల కు సంబంధించి MDM కోసం విడుదల చేసిన బియ్యం వివరాలు క్రింద లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. 

https://scm.ap.gov.in/SCM_REPORT/SchoolWiseMDMAllocationReport.jsp

Jagananna vidyakanuka component received proforma

జగనన్న విద్యాకానుక COMPONENT WISE గా తీసుకున్న  ITEMS ని నమోదు చేయడానికి  ప్రొఫార్మా 

Inspection and verification of various ongoing schemes like vidyaKanuka, Nadu-Nedu, Mid Day Meal and other Education Flaship Programmes -Allotment of Districts to the officers of school Education /Samagra Siksha

జగనన్న విద్యాకానుక, మధ్యాహ్న భోజన పథకం,నాడు- నేడు ఇతర విద్యా కార్యక్రమాల తనిఖీ మరియు నిర్ధారణకు గాను..అధికారుల నియామకం విషయమై జారీ చేయబడిన ఉత్తర్వులు

AP 2nd year Intermediate Short Memo download link.

ఇంటర్ మీడియేట్ 2nd Year షార్ట్ మార్క్స్ మెమో లను అందుబాటులో ఉంచారు. క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

https://bie.ap.gov.in/GenSy2021.do

Preparation of Seniority Lists of SGTs/School Assistants and equivalent cadres in respective Districts and display in the district websites to take up promotions

జిల్లాల వారీగా సీనియారిటీ లిస్ట్స్ తయారు చేయుటకు DEO లకి revised షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖా సంచాలకులు.RC.No. 13028/9/2021-EST 3 Dated:26/07/2021.

Sl.No. Item of work Date of completion of

the item of work

1. Gathering of information from feld level/

updation of teacher information 10-08-2021

2. Display of tentative Seniority list 18-08-2021

3. Submission of Objections to the RJDSE/DEO through concerned MEO/HM/Dy.E.O/DEO 31-08-2021

4. Redressal of objections 12-09-2021

5. Final Seniority list of all cadres 15-09-2021

KORUKONDA SAINIK School Entrance Test Results Released

సైనిక పాఠశాల ప్రవేశపరీక్ష తుది ఫలితాల విడుదల

అఖిలభారత సైనిక పాఠశాల ప్రవేశపరీక్ష (2021-22) తుది ఫలితాలు విడుదలయ్యాయని కోరుకొండ సైనిక్‌స్కూల్‌ ప్రిన్సిపల్‌ కల్నల్‌ అరుణ్‌ కులకర్ణి తెలిపారు.

 వెబ్‌సైట్‌లో  వివరాలు అందుబాటులో 

www.sainikschoolkorukonda.org

Baseline test and Marks upload process

రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జూలై 27 నుండి 31 వరకు మన పాఠశాలలో  బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు, ఆగస్టు 4 వతేది నుండి10 వ తేది వరకు మార్కుల నమోదు కు సూచనలు

సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు సూచనలు:

 ఉపాధ్యాయులు వారు గత సంవత్సరం బోధించిన సబ్జెక్టుకు సంబంధించి ప్రతి తరగతికి  విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించే విధంగా మోడల్ పేపర్లో సూచించిన విధంగా 10 బిట్లు తయారుచేసి తరగతి ఉపాధ్యాయునికి ఆదివారం సాయంత్రం లోపు పంపాలి.

తరగతి ఉపాధ్యాయులకు సూచనలు:

తరగతి సంబంధించి సబ్జెక్టు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి బిట్స్ అన్నింటినీ కలిపి కన్సాలిడేటెడ్ ప్రశ్నపత్రాన్ని 60 ప్రశ్నలతో తయారుచేసి అవసరమైనన్ని కాపీలు పాఠశాల ఖర్చుతో జిరాక్స్ తీయించవలెను. వాటిని  విద్యార్థులను దత్తత ఇచ్చిన ఉపాధ్యాయులకు అందజేయవలెను. ఈ పనులను సోమవారం లోపు పూర్తిచేయాలి.

విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయులకు సూచనలు:

 ఉపాధ్యాయులు వారికి దత్తత ఇచ్చిన విద్యార్థులకు సంబంధిత ప్రశ్నాపత్రాలను వారి తల్లిదండ్రుల ద్వారా ఫోన్ చేసి జూలై27 నుండి పిలిపించి అందజేసి విద్యార్థులతో పరీక్ష వ్రాయించి తిరిగి తల్లిదండ్రుల ద్వారా జూలై 31 లోపు తెప్పించుకొనవలెను. 

ఆ విద్యార్థులకు సంబంధించి ప్రశ్నాపత్రాలను "కీ" ద్వారా మూల్యాంకనం చేసి, నిర్దేశిత తేదీలలో కేటాయించిన విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేయించవలెను.

School Children Text Books Indent HM login

జగనన్న విద్యా కానుక పథకం లో భాగంగా విద్యార్థులు కు పంపిణీ చేయవలసిన పాఠ్య పుస్తకాలు ను MEO OFFICE నుండి తీసుకొని వాటివ వివరాలను HM లాగిన్ లో సబ్మిట్ చేయాలి. 

Click Here Textbooks indent hm login page

IMMS APP Updated Version

IMMS APP Updated Version  (1.2.0 - 25.07.2021) మరియు  న్యూ ఫీచర్స్

1. Offline login and data submission for Attendance, MDM Inspection, TMF Image Capturing.

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

2. Password Reset Option.

3. App login with mobile PIN and finger print.

4. Cleaning Tools details entry screen.

5. Bathroom Accessories details entry screen.

6. Dry ration - distribution under Phase-3 (Hostel welfare depts)

7. User last login date time display

 

Now IMMs App is available at play store

AP polytechnic Entrance Exam Notification and important Dates

పాలిటెక్నీక్ కామన్ ప్రవేశ పరీక్ష పాలిసెట్ - 2021ముఖ్యమైన తేదీలు 

★ఆన్లైన్ దరఖాస్తు ఫారం  రూ.400/

★హెల్ప్ లైన్ సెంటర్లు/Gate  Way చెల్లింపు ద్వారా దాఖలు చేయుటకు ప్రారంభ  తేది : 26.08.2021

★ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలుకు ఆఖరు తేది : 13.08.2021

★పాలిసెట్ - 2021 నిర్వహించు తేది : 01.09.2021

 వెబ్సైట్ : https://sbtetap.gov.in

 Online Application : https://polycetap.nic.in

SE-SSC -2021 Examinations- FA1 and FA2 Marks Entry- Correction of certain mistakes occurred while entering the marks in CSE Website

పదవ తరగతి విద్యార్థులకు FA 1 మరియు FA 2 మార్కులను ఎంటర్ చేసినప్పుడు వచ్చిన తప్పులను సవరించుకోవడం కోసం ఉత్తర్వులు 

STMS Nadu Nedu NEW WEBSITE AND UPDATED latest STMS App


Nadu-Nedu : STMS NEW VERSION - NOW IT IS UPDATED TO 2.3.6 version
Click here to download update STMS App Through Web link

మన బడి నాడు-నేడు అప్లికేషన్ వెర్షన్ 2.3.6 కి అప్డేట్ చేయబడినది.

Download STMS Latest version 2.3.6

క్రింది ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి ఏ పాఠశాల యొక్క నాడు నేడు కార్యక్రమం కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
Click Here To NEW STMS WEBSITE 


🔔గమనిక : నాడు - నేడు app vesion update అయిన ప్రతీసారి.పాత version ని uninstall చేసిన తరువాతే new version ని install చేసుకోవాలి.

Baseline Test Model Papers for 1st Class to 10th Class

బేస్ లైన్ పరీక్ష నిర్వహించు నిమిత్తం 1 నుండి 10 వ తరగతి వరకు ఉపాద్యాయులు తయారు చేసిన మోడల్ ప్రశ్న పత్రాలు.కావలసిన వారు ఉపయోగించు కోగలరు..

CM YS JAGAN KEY DECISSIONS ON EDUCATION AND NEW EDUCATION POLICY

 సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు..

►ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

►మొదటి విడత నాడు–నేడు కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ప్రజలకు అంకితం చేయనున్న ముఖ్యమంత్రి

►రెండోవిడత నాడు –నేడుకు అదే రోజు శ్రీకారం

►అదే రోజు విద్యాకానుక ప్రారంభం

►నూతన విద్యా విధానం విధి, విధానాలపై ఆగష్టు 16నే ప్రకటన 

►నూతన విద్యావిధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును సీఎంకు వివరించిన అధికారులు

►నూతన విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు

►ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే.. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టు 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలన్న సీఎం

►కొత్త విద్యావిధానంలో పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్‌

►శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌  ( పీపీ–1, పీపీ–2)

►పౌండేషన్‌ స్కూల్స్‌  (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు)

►పౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు)

►ప్రీహైస్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు)

►హైస్కూల్స్‌  (3 నుంచి 10వ తరగతి వరకూ)

►హైస్కూల్‌ ప్లస్‌ ( 3 నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయని తెలిపిన సీఎం. 

►పౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా అంగన్‌ వాడీల నుంచే ఇంగ్లిషు మీడియం ప్రారంభం అవుతుంది

►శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు రూపాంతరం చెందుతాయి

►శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌కు ఫౌండేషన్‌స్కూల్స్‌ మార్గనిర్దేశకత్వం వహిస్తాయి

►ఇక్కడ కూడా ఎస్‌జీటీ టీచర్లు పర్యవేక్షణచేస్తారు, ఉత్తమ బోధన అందేలా చూస్తారు

►శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్‌ ప్రతి ఆవాసంలో ఉంటుంది. 

►కిలోమీటరు లోపలే పౌండేషన్‌ స్కూల్‌ ఏర్పాటవుతుంది

►మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్‌ ఉంటుంది

►మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు

►వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నాం

►ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విధానం ప్రధాన లక్ష్యం 

►పిల్లలకు ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యం, ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఉన్న టీచర్లతో బోధన ఉంటుంది

►ప్రస్తుతం 5 తరగతి వరకు ప్రతి టీచర్‌ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు 

►ఇంటర్‌ తర్వాత డిప్లమో ఇన్‌ ఎడ్యుకేషన్‌ చేసి సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా పనిచేస్తున్నారు

►కొన్ని చోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు, మరికొన్ని చోట్ల నలుగురికి ఒకే టీచర్‌ బోధిస్తున్న పరిస్ధితి ఉంది

►నూతన విద్యా విధానంలో ఈ రకమైన పరిస్ధితుల్లో మార్పు తెస్తున్నాం

►5వ తరగతి వరకు 18 సబ్జెక్టులును బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నాం 

►తద్వారా పిల్లలకు ఫోకస్డ్‌ ట్రైనింగ్‌ వస్తుంది 

►విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం

►ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ రాబోతున్నారు

►ఎందుకు ఈ విధానానికి పోతున్నామనే దానిపై మరింత జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని అధికారులకు సీఎం జగన్‌ నిర్దేశం

►పౌండేషన్‌ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరిగాయా ? లేదా ? అని అధికారులను ప్రశ్నించిన సీఎం

►ఇప్పటికే వివిధ సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించామన్న అధికారులు

►ఇందులో ఎటువంటి సందేహాలకు తావుండరాదు

►తల్లిదండ్రులకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి

►నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వారికి తెలియాలి

►ఆ మేరకు విస్తృతంగా అవగాహన కలిగించాలి : సీఎం ఆదేశం

►నాడు – నేడు, నూతన విద్యావిధానంకోసం మనం సుమారు రూ.16వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం

►దీని ద్వారా సాధించబోయే లక్ష్యాలను స్పష్టంగా చెప్పాలి

►ఈ రకమైన మార్పులు తీసుకురావడం ద్వారా విద్యావ్యవస్ధ పునరుజ్జీవనానికి ఏం చేయబోతున్నామో చెప్పాలి

►మరోవైపు ఉపాధ్యాయులకు కూడా దీనిపై సమగ్ర అవగాహన కలిగించాలి

►నూతన విద్యా విధానంలో ఏరకంగా ఉద్యోగ తృప్తి ఉంటుందో వివరించాలి

►అంగన్‌వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పాటు చేస్తున్నాం

►ప్రతి తరగతికి ఒక టీచర్‌ ఉండేలా హేతుబద్దీకరణ

►జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యావ్యవస్ధ 

►ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం

►మొదటి విడత నాడు–నేడులో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్ధవంతంగా ముందుకు సాగాలి 

►అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ

►పిల్లల భవిష్యత్తుకోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం

►ఎక్కడా అవినీతికి, వివక్షతకు తావుండరాదు

►ఇలాంటి ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు

►పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వమూ గతంలో లేదు

►పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి

►అవినీతి ఏ స్ధాయిలో ఉన్నా సహించేది లేదు

►అధికారులకు స్పష్టం చేసిన సీఎం

►నూతన విద్యా విధానం, నాడు నేడు తొలిదశ పనులు పై సీఎంకు వివరాలందించిన అధికారులు

►తొలిదశలో నాడు–నేడు చేపట్టిన స్కూల్స్‌లో  పనులు దాదాపు పూర్తయ్యాయన్న అధికారులు

►అమ్మఒడి, నాడు–నేడు, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం వంటి సంస్కరణలు విద్యా వ్యవస్ధలో మంచి ఫలితాలు అందించబోతున్నాయన్న అధికారులు

►స్కూల్స్‌ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక పంపిణీపై సమగ్ర వివరాలు అందించిన అధికారులు

►ఆగష్టు 16 నాటికి అంతా సన్నద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం

►వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్‌ విద్యార్థులను పాస్‌చేశామన్న అధికారులు

►కొన్ని రిక్రూట్‌మెంట్లలో మార్కులను పరిగణలోకి తీసుకుంటున్నారని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ప్రస్తావించిన అధికారులు

►దీన్ని పరిగణలోకి తీసుకుని 2020 టెన్త్‌ విద్యార్థులకూ కూడా మార్కులు ఇవ్వాలని నిర్ణయం

►అంతర్గత పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు

►అలాగే 2021 టెన్త్‌ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు

►స్లిప్‌టెస్టుల్లో మార్కులు ఆధారంగా 70శాతం మార్కులు, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా మిగిలిన 30శాతం మార్కులు ఇస్తామన్న అధికారులు

►మొత్తం మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని వెల్లడి..

Javahar Navodaya 6th Class exams Admit Card Download

జవహర్ నవోదయ విద్యాలయ సమితి 6 వ తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డ్ లను అందుబాటులో ఉంచారు. 

Registration Number , Date of birth Enter చేసి Admit card Download చేసుకోవచ్చు

Click Here To DOWNLOAD ADMIT CARD

Registration Number మర్చిపోతే candidate name ,  Father name, Mother name, Date of birth Enter చేసి Registration number తెలుసుకోవచ్చు

Find your Registration Number


ఆగష్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.

★తొలి విడత నాడు - నేడు పనులను అదేరోజు ప్రజలకు  అంకితం..

★విద్యారంగంలో రెండో విడత  నాడు - నేడు పనులకు శ్రీకారం

★విద్యాకానుక కిట్లు కూడా  అందజేయనున్న ప్రభుత్వం

★నూతన విద్యావిధానంపై  సమగ్రంగా వివరించనున్న  ప్రభుత్వం..

★విద్యాశాఖలో నాడు - నేడు   పై సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం

Baseline Test 1st Class to 5th class Model Papers

బేస్ లైన్ పరీక్ష నిర్వహించు నిమిత్తం 1 నుండి 5 వ తరగతి వరకు ఉపాద్యాయులు తయారు చేసిన మోడల్ ప్రశ్న పత్రాలు.కావలసిన వారు ఉపయోగించు కోగలరు

Details of Teachers who completed the EdFirst online English Teachers Trainings in Visakhapatnam District

విశాఖపట్నం జిల్లా లో EdFirst English Teacher Trainings కి సెలెక్ట్ అయిన 3898 మంది ఉపాధ్యాయులు ట్రైనింగ్ లో పాల్గొన్న వారందరూ తమ వివరాలను క్రింది గూగుల్ పామ్ లో తప్పనిసరిగా నమోదు చేయాలి. 

https://forms.gle/m2zUbKMr7ReSvgst7

Edfirst ట్రైనింగ్ కి సెలెక్ట్ అయిన విశాఖపట్నం జిల్లా  ఉపాధ్యాయుల వివరాలు క్రింద పైల్ లో కలవు. 

AP Inter 2nd year Results 2021 - IPE March 2021 Results with memo of Marks Download Here

AP ఇంటర్  సెకండియర్ 2021 ఫలితాలు  విడుదల.విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఫలితాల విడుదల.

examsresults.ap.nic.in

bie.ap.gov.in

results.bie.ap.gov.in

results.apcfss.in

పదో తరగతి లోని ప్రధాన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం, ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజ్ను ఇంటర్మీడియట్ బోర్డు పరిగణనలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఫలితాల విడుదల.




Jagananna Vidya Kanuka Updated App version 1.0.4

జగనన్న విద్యా కానుక (JVK APP) అప్డేట్ వెర్షన్ 1.0.4 

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు JVK apk ను install చేసుకోవలయును.

Click Here To Download JVK App

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కు user id లు ఇచ్చి ఉన్నారు

User id: IMMS APP User Id

Pass word: 1qaz!QAZ(అందరికి Common). మండల విద్యా శాఖాధికారులు, School complex Head Masters Jagananna Vidya Kaanuka apk install చేసుకొని, Uniform (MEOs only ), Shoes,  Notebooks, Belts, Bags రిసీవ్ చేసుకున్న తదుపరి వివరాలు JVK app నందు అప్లోడ్ చేయాలి.

మండల విద్యా శాఖాధికారులు, School Complex Head Masters స్టాక్  రిసీవ్ రిజిస్టర్, స్టాక్ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.

Rc.No. 123/Spl/SCERT/SSC/2021 Dt.21/07/2021,SSC -2021 Examinations- FA1 and FA2 Marks Entry- Correction of certain mistakes occurred while entering the marks in CSE Website Constitution of Committee

10 వ తరగతి విద్యార్థులకు  FA 1 మరియు F A 2 లో  మార్క్స్  ఆన్లైన్ ఎంట్రీ   లో జరిగిన తప్పిదాలు సరిచేయుటకు చర్యల నిమిత్తం కమిటీ ని ఏర్పాటు చేసిన గౌ౹౹ డైరెక్టర్ గారు.

ప్రారంభ పరీక్ష (BASE LINE TEST) నిర్వహణకు సూచనలు..

1) అన్ని పాఠశాలల్లో 1 వ.తరగతి నుండి 10 తరగతులకు అందరు విద్యార్థులకు ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

2) కింది తరగతి పాఠ్యాంశ విషయాలు మరియు సామర్థ్యాలకు అనుగుణంగా మాదిరి పరీక్ష పత్రాలు ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు స్వయంగా ప్రారంభ పరీక్ష ప్రశ్న పత్రాలు తయారు చేసి నిర్వహించాలి.

3) ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను పాఠశాలకు పిలవరాదు. 

4) తల్లి తండ్రులు ద్వారా పరీక్ష పత్రాలు పంపిణీ మరియు పరీక్ష రాసిన అనంతరం తిరిగి పొందడం చేయాలి. 

5) పరీక్ష నిర్వహణ జూలై 27 నుండి 31 వరకు జరపాలి.

6) మూల్యాంకనం జూలై 28 నుండి 3 ఆగష్టు వరకు చేయాలి.

7) మార్కుల నమోదు ఆగష్టు 4 నుండి 10 వరకు. 

level 1.. 1&2 తరగతులకు. 

level 2.. 3,4&5 తరగతులకు.

6 నుండి 10 వరకు తెలుగు,ఇంగ్లీష్ మాధ్యమం మరియు మైనర్ మీడియం.

8) తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో విడివిడిగా ప్రశ్న పత్రాలను తయారు చేసుకోవాలి.

పై ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహణ చేయడానికి ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు భాధ్యత వహించాల్సి ఉంటుంది.

జులై నెలాఖరులోగా పీఆర్సీపై చర్చలు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ

 ‘‘రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలుపై జులై నెలాఖరులోగా ఆర్థికశాఖ అధికారులు, ఇతర అధికారులతో చర్చిస్తాం . ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతోను సమావేశం ఏర్పాటు చేస్తాం’’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హామీ ఇచ్చారు. ఎన్ జీ వో సంఘం నేతలు బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి ,కృపావరం తదితరులు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి మాట్లాడారు. పెండింగు పీఆర్సీతో పాటు ఏడు డీఏ ల అమలుపైనా వారు వినతిపత్రాలు సమర్పించారు.


పీఆర్సీ అమల్లో  ఆలస్యం వల్ల పదవీ విరమణ చేసిన చేస్తున్న వారికి నష్టం ఎదురవుతోందని, 55శాతం ఫిట్మెంట్ తో వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్ జీ వో నేతలు కోరారు. కేంద్రం కూడా డీఏలు విడుదల చేసినందున రాష్ర్ట ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.  జీవో 94 ప్రకారం 2021 నుంచి రావాల్సిన డీఏ బకాయిలు, రెండో విడత రావాల్సిన డీఏ బకాయిలు ఇప్పించాలని కోరారు.  1.7.2021 నుంచి కొత్త డీఏ అమలు చేయాల్సిన అవసరాన్ని వారు వివరించారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ దిల్లీ నుంచి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు.

School Education SCERT, AP- Conduct of Base Line Test 2021-22 - for Classes I to X from 27.07.2021 to 31.07.2021 - Certain Instructions

1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు విద్యార్థులకు బేస్ లైన్ పరీక్ష ను జూలై  27 నుండి 31 వరకు నిర్వహిచాలని ఉత్తర్వులు .అలాగే పరీక్ష లకు సంబంధించి పేపర్ ను కూడా ఇవ్వడం జరిగింది. 

APGLI COMPLETE POLICY DETAILS WITH DATES And all Claims Proformas


క్రింద ఇచ్చిన  లింక్ ని క్లిక్ చేసి మీ యొక్క పాలసీ నెంబర్, మీ పుట్టిన తేదీని ఎంటర్ చేసి  మీరు ఎప్పుడెప్పుడు APGLI పెంచారో వాటి వివరములను తెలుసుకోవచ్చును.
Click Here To Know Your APGLI COMPLETE  POLICY DETAILS 
APGLIC క్లెైమ్ లకు సంబంధించి కావలసిన అన్ని ప్రోపార్మాలు కూడా ఒకే చోట అందుబాటులో ఉంచడం జరిగింది. 

teachers who have trouble in edfirst training Enrollment they are fill the Google form

ఇంగ్లీష్ Edfirst ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యే ఉపాద్యాయులు కోర్స్ లో జాయిన్ అవడానికి ఇబ్బంది పడుతున్న వారు క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ నింపి సబ్మిట్ చేయగలరు. 

 https://forms.gle/bfD8MCQRMWAoV8Ns5


ఆగస్టు నుంచి స్కూళ్లు?విద్యార్థులంతా ఒకే రోజు రానవసరం లేదు.ఒక రోజు సగం మందికి తరగతులు.తర్వాతి రోజు మిగిలిన సగం మందికి క్లాసులు.థర్డ్‌ వేవ్‌పై ఆధారపడి ఆ ప్రణాళిక: మంత్రి సురేశ్‌

 పాఠశాలలను ఆగస్టు నుంచి ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్‌ దృష్ట్యా విద్యార్థులందరూ రోజూ రావాల్సిన అవసరం లేకుండా..ఒకరోజు 50శాతం మంది, తర్వాతి రోజు మిగిలిన 50శాతం మంది తరగతులకు వచ్చేలా ఆలోచిస్తున్నామని తెలిపారు. కరోనా తొలి దశ అనంతరం కూడా ఇలాగే తరగతులు నడిచాయి. ఒకరోజు కొన్ని తరగతులకు, మరో రోజు మరికొన్ని తరగతులకు క్లాసులు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అమలుచేస్తామని మంత్రి సురేశ్‌ చెప్పారు. అయితే, కరోనా మూడో వేవ్‌ ఎలా ఉంటుందన్నదానిపైనా ఈ ప్రణాళిక, తరగతుల నిర్వహణ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

Ap Residential 5th class and Intermediate Entrance Hall Tickets available

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  గురుకుల కళాశాల లో  5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశం కొరకు నిర్వహించు పరీక్షల యొక్క హాల్ టిక్కెట్స్ అందుబాటులో ఉంచారు.

Click Here To Download  హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్

 

Memo No. F2/3058/2013 Dt: 19/07/2021, NATIONAL PENSION SYSTEM –Partial withdrawal from PRAN Account through self-declaration - Comprehensive guidelines to all Stake holders Instruction

ఇక పై CPS ఉద్యోగులు పాక్షిక ఉపసంహరణ కు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వవలసిన అవసరం లేదు. పాక్షిక ఉపసంహరణ చేసుకొనే ఉద్యోగులు ఇక ముందు ఎలాంటి డాక్యుమెంట్ ప్రూఫ్ తో పనిలేకుండా PFRDA ఇచ్చిన ఉత్తర్వుల ను అనుసరించి స్వీయ ధ్రువీకరణ తో చేసుకొనే అవకాశం కలిపిస్తూ DTA, ఇబ్రహీంపట్నం వాళ్ళు ఈ రోజు మెమో ఇవ్వడం జరిగినది.

సెల్ఫ్ డిక్లరేషన్ తో కూడిన CPS పాక్షిక ఉపసంహరణ నూతన దరఖాస్తు..601

Click Here To Download Withdrawal Application

Click here to download application 

Regularization of mandatory quarantine /treatment (14days )period for the Teachers /Employees who were affected covid 19positive -request to treat the absence period as special causal Leave Regarding

రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు గానీ,వారి కుటుంబ సభ్యులు గానీ కోవిడ్ ప్రభావితులైన సందర్భాలలో  ఆయా ఉపాధ్యాయులు వారి విధులకు హాజరుకాలేని కాలమునకు 14 రోజుల స్పెషల్ క్యాజువల్ సెలవు మంజూరు చేసేందుకు తగు చర్యలు తీసుకోవలసిందిగా అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP మెమో జారీ చేసారు.

All districts English training Google form.

ఇంగ్లీష్ ట్రైనింగ్ లో శిక్షణ కొరకు  పేర్లు ఉన్నవారు ఈ క్రింది గూగుల్ పామ్ లో వివరాలు నింపి సబ్మిట్ చేయగలరు 

Click Here To Base line test link

Visakhapatnam Distict All DSC wise Selection Lists From 1977 to 2014

విశాఖపట్నం జిల్లా కు సంబంధించి అన్ని కేడర్ల ఉపాధ్యాయులు కు సంబంధించిన అన్ని DSC ల 1977 నుండి 2014 వరకు సెలక్షన్ లిస్టు లను అందుబాటులో ఉంచడం జరిగింది. 

Click Here To Download DSC Selection Lists

Guidelines for writing and issuing Record Sheets

రికార్డు షీట్ రాయుటలో నియమ నిబంధనలు ఏమిటి ?

నవీన కాలంలో వచ్చిన మార్పులు (చైల్డ్ ఇన్ఫో , ఆన్ లైన్, ఆధార్ నెం.) వలన ఇపుడు మార్కెట్ లో దొరికే రికార్డ్ షీట్ పనికి రాదు. మార్కెట్ లో దొరికే రికార్డ్ షీట్ ను  మరి కొన్ని వివరాలు కలుపుతూ రికార్డ్ షీట్ తయారు చేశారు. ఒకే పేజీ లో రెండు వచ్చే విధంగా ప్రభుత్వ అధికార ముద్రతో డిజైన్ చేయబడింది. 

 1 )  రికార్డ్ షీట్ పై వరుస నెంబర్ రాయడం తప్పనిసరి. ఒక వేళ పాఠశాల లో ఇదివరకు సరైన వరుస క్రమం లేనట్లయితే వరుస నెంబర్/సంవత్సరం  పద్దతి లో రాయవచ్చు.

ఉదా: 27/2018

 2 )  రికార్డ్ షీట్ మీద వైట్ నర్ వాడకూడదు. తప్పు పోయినట్లు అయితే కొట్టివేసి HM సంతకం చేస్తే సరిపోతుంది.

3 )  విద్యార్థి పేరు ను పూర్తి గా రాయాలి. ఇంగ్లీష్ లో రాసేవారు పెద్ద అక్షరాల లో రాయాలి.

4)  విద్యార్థి రికార్డ్ షీట్ ఎపుడు తీసుకుంటాడు అదే రోజు నాటి తేదీ నీ ఇష్యూ డేట్ గా రాయాలి. కానీ పాఠశాల వదిలి వెళ్ళిన తేదీ మాత్రం అకాడమిక్ సంవత్సరం చివరి రోజుది వేయాలి. ఇది విద్యార్థి తరగతి పూర్తి చేసినపుడు వర్తిస్తుంది. మద్యలో వెల్లినట్లైతే వెళ్ళిన తేదీ రాయాలి.

5 )  విద్యార్థి కులం రాసే సమయంలో మతం, కులం, ఉప కులం ను రాయాలి మరియు వారి  వరుస నెంబర్ రాయాలి.

ఉదా:మతం:హిందూ , కులం:యాదవ, BC-D(33).

6 )  పుట్టిన తేదిని ఖచ్చితంగా పదాలలో రాయాలి.

7 )  విద్యార్థి తల్లిదండ్రులు తో కాకుండా వేరే వారితో నివాసం ఉంటూ చదివినట్లు అయితే ( ఆమ్మమ్మ దగ్గర ) వారి పేరు రాయవలసి ఉంటుంది.

8 )  రికార్డ్ షీట్ లు రెండు రాయాలి. ఒకటి ఆఫీస్ కాపీ, ఇంకొకటి విద్యార్థికి ఇవ్వాలి. ఒక వేళ విద్యార్థి ఈ రికార్డ్ షీట్ పోగొట్టుకున్న ఎడల మరొకటి రాసి ఇవ్వచ్చు. కానీ వరుస నెంబర్ ( రికార్డ్ షీట్ నెంబర్ ) మారకూడదు . ఆఫీస్ కాపి ను చూసి రాయాలి.

9 )  ఒక వేళ ప్రభుత్వ పాఠశాల అయితే విద్యార్థులను దగ్గర లోని ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు గారే చేర్పించాలి. ఒక వేళ విద్యార్థి తల్లిదండ్రులు వేరే దగ్గర చేర్పిస్తాము అన్నట్లైతే సంబంధిత సర్టిఫికెట్ లు వారికి ఇచ్చి ఆ పాఠశాల పేరును ఆఫీస్ కాపి పై రాయాలి.

10 )  విద్యార్థికి రికార్డ్ షీట్ ఇచ్చే సమయంలో విద్యార్థి తల్లిదండ్రులు సమక్షం లో ఇవ్వడం మంచిది. మరియు విధిగా వారు అడగక పోయినా వారికి  బోనఫైడ్ సర్టిఫికెట్, క్యుములెట్ రికార్డ్ ( మార్క్ ల షీట్ ) , రికార్డ్ షీట్ , ఆరోగ్య కార్డు లు ను ఒక ఫైల్ కవర్ లో ఇవ్వాలి.

11 )  ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చిన్న పిల్లలు కావున, వారికి బోనఫైడ్ సర్టిఫికెట్, క్యుములెట్ రికార్డ్ ( మార్క్ ల షీట్ ) , రికార్డ్ షీట్ , ఆరోగ్య కార్డు లు ముట్టనట్లు గా విద్యార్థి నుండి మరియు విద్యార్థి తల్లిదండ్రులు నుండి సంతకం తీసుకోవాలి.

12 )  రికార్డ్ షీట్ మరియు  బోనఫైడ్ లను కొన్ని వివరాలు మనకు వీలైనపుడు ముందే రాసి పెట్టుకుంటే ఇచ్చే సమయంలో గాబార పడాల్సి రాదు.

13 )  రికార్డ్ షీట్ ఇచ్చే సమయంలో అడ్మిషన్ రిజిష్టర్ లో వివరాలు నమోదు చేసి అందులో సంతకం చేసిన తర్వాత మాత్రమే రికార్డ్ షీట్ ఇష్యూ చేయాలి. పని ఒత్తిడి లో గాని గాబరా లో గాని అడ్మిషన్ రిజిష్టర్ లో రాయడం మరచి పోవడం పరిపాటి, కానీ ఇదే విద్యార్థికి మరియు అప్పటి HM కు తీవ్ర నష్టం కలుగుతుంది.

14 )  పుట్టు మచ్చలు రెండు  రాయాలి, ఒక వేళ రెండు దొరకక పోతే కనీసం ఒకటి రాయడం తప్పనిసరి. 

15 )  పుట్టు మచ్చలు ఖచ్చితంగా బయటకు కనిపించేవి మాత్రమే రాయాలి. ఉదా: ముఖం, మెడ, మోచేతి వరకు చేతి పైన, కాలి మడమల వరకు.

కొవిడ్‌ రోగులంతా టీబీ పరీక్షలు చేయించుకోవాలి.కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు

కరోనా సోకిన రోగుల్లో కొంతమంది ట్యూబర్‌కులోసిస్‌(టీబీ) బారినపడుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ తరహా కేసులు నిత్యం డజన్ల కొద్దీ వెలుగుచూస్తుండటం వైద్యులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్‌ బారినపడివారు టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అలాగే టీబీ రోగులు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచనలు చేసింది. అయితే కొవిడ్ కారణంగా టీబీ కేసులు పెరుగుతున్నాయడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌తో బాధపడుతున్నారని గతంలో బ్రిటన్‌లో జరిగిన అధ్యయనంలో వెల్లడైన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక కొవిడ్‌ బారిన పడ్డవారిలో దాదాపు 200లక్షణాలు ఉంటాయని గుర్తించారు. కనీసం ఆరు నెలల వరకు తీవ్రమైన ఇబ్బందులు రోగులను వెంటాడుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

Whatsap Multi Devices Support Option introduced

వాట్సాప్ మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ బీటా వెర్షన్‌ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు.

మన ఖాతా ఉన్న ఫోన్ కాకుండా మరో నాలుగు డివైజ్‌ (ల్యాప్‌టాప్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌)లలో లాగిన్‌ కావచ్చు.

ఎలా ఉపయోగించాలి::

వాట్సాప్ మల్టీ డివైజ్‌ ఫీచర్ ఉపయోగించాలంటే మందుగా మీ ఫోన్లో కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేస్తే లింక్‌ డివైజ్‌ ( *ప్రస్తుతం బీటా యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది*) అనే ఆప్షన్ కనిపిస్తుంది. 

 దానిపై క్లిక్ చేస్తే ఫింగర్ లేదా పాస్‌వర్డ్ అథెంటికేషన్ అడుగుతుంది. (ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే) తర్వాత మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్న డివైజ్‌లో వాట్సాప్‌ వెబ్ ఓపెన్‌ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేస్తే మీ వాట్సాప్‌ ఖాతా అందులో కూడా ఓపెన్ అవుతుంది. 

అలా మీరు ఒకేసారి వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్ కాకుండా మరో నాలుగు డివైజ్‌లలో యాక్సిస్ చెయ్యొచ్చు.

ఒకవేళ మీ ఫోన్ స్విచ్‌ఆఫ్ అయినా మీరు లాగిన్ అయిన నాలుగు డివైజ్‌ల నుంచి వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. 

అలానే మీ కాంటాక్ట్ లిస్ట్‌, ఛాట్‌ హిస్టరీ అన్ని వేర్వేరుగా సదరు డివైజ్‌లకు కనెక్ట్ అవుతాయని వాట్సాప్ పేర్కొంది.

ఆగస్టు 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం-శ్రీ చిన వీరభద్రుడు

ఉపాధ్యాయులకు కరోనా టీకా త్వరలో ముగియనుండటంతో ఆగస్టు 15న జెండా వందనంతో పాఠ శాలలను పునఃప్రాంభించేందుకు చర్యలు తీసు కొంటున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్య శాఖ డైరె క్టర్ కె. చినవీరభద్రుడు తెలిపారు. 

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమలిపురిలో నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠ శాలలను ఆయన గురువారం పరిశీలించారు. 

ఈ సందర్భంగా వీరభద్రుడు మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి 30 వరకు విద్యార్థులను అభ్యసనానికి సిద్ధం చేసి, 

సెప్టెంబరు ఒకటి నుంచి తరగతులు నిర్వహించాలని భావిస్తు న్నట్లు చెప్పారు.

అంగన్వాడీలను నిర్వీర్యం చేస్తారని వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదనిస్థలం లేని చోట్ల పాఠశాలల్లోనే భవనాలు నిర్మించి పూర్వ విద్య నుంచి పదో తరగతి వరకు ఒకే ఆవరణలోకి తీసుకు వచ్చి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

రెండేళ్లలో సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడమే తప్ప ఒక్క ఉద్యోగం రద్దు కాదన్నారు. రెండో విడత నాడు- నేడు కింద రాష్ట్రంలో 25 వేల అదనపు తరగతి గదులను నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. 

అవసరమైతే పదో తరగతి సిలబస్ లో రెండు అధ్యాయాలు తొలగించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు.

COVID fine 100 RS for not wearing mask

కోవిడ్ నియంత్రణ - పోలీసు చర్యలు - జరిమానా బహిరంగ స్థలాల్లో మాస్క్ ధరించకున్నా, కోవిడ్ నిబంధనలు ఉల్లఘించినా రూ. 100/- జరిమానా విధించే అధికారం SI, ఆపై అధికారులకు ఇస్తూ ఉత్తర్వులు

New Student Admission option Enabled in cse login

STUDENT ENROLLMENT CSE SITE లో న్యూ admission OPTION ENABLE చేయడం జరిగింది. లాగిన్ అయి పిల్లలు వివరాలను నమోదు చేయవలెను. 

న్యూస్టూడెంట్ ను ENROLL చేయాలంటే ముందుగా 

★స్టూడెంట్   బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం1 fill చేయాలి

★ఆ తర్వాత నే ఫారం 2 FIIL. చేయాలి

https://studentinfo.ap.gov.in/newstudentRegistrationFormBasicDetailsOne.htm

NOTE: 1)ఫారం1ను పూర్తి చేసి  ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే

2)పారం1,2 రెండు వివరాలు అసంపూర్తి ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు.




OBC Cremelayer Annual Income Raised to 8 lakhs

OBC క్రీమీ లేయర్ వార్షిక ఆదాయ పరిమితి 6 నుండి 8 లక్షలకు పెంపు_Memo. No.145584/BCW/F/2021 Dated: 14.07.2021

రూ.8 లక్షల్లోపు ఉంటే ఈడబ్ల్యూఎస్‌.ఆదాయం తప్ప కేంద్రం విధించిన మిగతా నిబంధనల నుంచి మినహాయింపు.ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఉత్తర్వులు.

విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల అమలు నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీ మినహాయింపులనిచ్చింది. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉండాలన్న ఒక్క నిబంధన మాత్రమే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన   మిగతా అర్హత నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెస్తూ బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో విడుదల చేసిన జీవోలో ఆ విషయం స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకూ రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం ఉండాలన్న ఒకే ఒక్క నిబంధననే వర్తింపజేస్తూ మరో ఉత్తర్వు ఇచ్చింది.

కేంద్ర నిబంధనలు ఇవీ.

కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు వీలు కల్పిస్తూ చట్టం చేసినప్పుడు అందుకు కొన్ని అర్హత నిబంధనలు పొందుపరిచింది. దాని ప్రకారం.

కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నవారే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హులు.

 కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నప్పటికీ.. ఆ కుటుంబానికి 5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నా, 1000 చ.అడుగులు, అంతకు మించిన వైశాల్యం కలిగిన ఫ్లాట్‌ ఉన్నా, ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌ పరిధిలో 100 చ.గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల స్థలం ఉన్నా, ఇతర ప్రాంతాల్లో 200 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలం ఉన్నా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హులు కాదని స్పష్టం చేసింది.

ఆ కుటుంబ ఆస్తులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా కూడా అవన్నీ కలిపే లెక్కిస్తారని తేల్చిచెప్పింది.

కుటుంబ వార్షికాదాయాన్ని లెక్కించేటప్పుడు.. రిజర్వేషన్‌ కోరుతున్న వ్యక్తితో పాటు, వారి తల్లిదండ్రులు, భార్య/భర్త, 18 ఏళ్ల లోపు వయసున్న సోదరులు, పిల్లల ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపింది.

రెండేళ్ల కిందట యథాతథంగానే..

రష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చినప్పుడు కేంద్ర నిబంధనల్ని యథాతథంగా వర్తింపజేసింది. ఇప్పుడు వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక, ఆర్థిక, భౌగోళిక వైరుధ్యాల్ని పరిగణనలోకి తీసుకుని.. వార్షికాదాయం రూ.8లక్షల్లోపు అన్న నిబంధన తప్ప మిగతావన్నీ మినహాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రం.. కేంద్రం నిర్దేశించిన అర్హత నిబంధనలే యథాతథంగా అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

AP MODEL SCHOOL దరఖాస్తు గడువు పెంపు

ఏపీ మోడల్ స్కూళ్లల్లో ఈనెల 15 వరకు ఉన్న అడ్మిషన్ల గడువును 25వ తేదీ వరకు పెంచుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు

దరఖాస్తు చేయు వెబ్ సైట్

https://apms.apcfss.in/

Distribution of MDM Dry Ration to all eligible students from 12.06.2021 to 31.07.2021 - Instructions issued Memo.No.ESE02-27023/2/2021-MDM-CSE Dated: 15-07-2021

జూన్ 12, 2021 నుంచి జులై 31, 2021  వరకు (40 పనిదినాలకు) విద్యార్థులకు డ్రై రేషన్ పంపిణీకి మార్గదర్శకాలు విడుదల.

Dry Ration( 40 days) 12/06/2021 to 31/07/2021

Rice:4kgs(1-5),6kgs(6-10)

Eggs:22

Chikkies:22

RedGramDal:1.5kgs(1-5),2.5kgs(6-10)

ఇంతవరకు పదవ తరగతి పిల్లల మార్కులు ఆన్లైన్ లో ఎంటర్ చేయని 13 జిల్లాల స్కూల్ వారి మరియు పాఠశాల వారి పెండింగ్ వివరాలు

2020-21 విద్యా సంవత్సరమునకు సంబంధించి 10 వ తరగతి విద్యార్థుల FA 1 & FA 2 మార్కులను CSE పోర్టల్ నందు నిర్ణీత సమయంలో నమోదు చేయవలసిందిగా పలుమార్లు కోరినప్పటికీ, కొన్ని పాఠశాలలు వానిని నమోదు చేయలేదు.

Click Here To Download 13 District schools list 

Click Here To Download 13Districts students list

అందరు DEO లు ఆయా మండలాలలో ముగ్గురు సభ్యులతో (సంబంధిత MEO మరియు ఇరువురు ఉన్నత పాఠశాలల HM లు) ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా FA 1 & FA 2 మార్కులు ఇంకనూ నమోదు చేయని పాఠశాలలను సందర్శింపజేసి..... ఆ పాఠశాలల్లో జవాబు పత్రాలను, వాని మూల్యాంకనాన్ని, మార్కుల రిజిస్టర్ లను తనిఖీ చేసి ధ్రువీకరించి సదరు మార్కులను ఆ కమిటీ సంబంధిత DEO లకు సమర్పించేలా చూడాలి.

పైన పేర్కొనబడిన రికార్డు లన్నీ సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయా పాఠశాలల HM లను మార్కులు CSE పోర్టల్ లో నమోదు చేయుటకు (DEO లాగిన్ నందు) అనుమతిస్తారు.

ఈ ప్రక్రియ అంతా ది.18.07.2021 నాటికి తప్పనిసరిగా పూర్తి కావలెను

ఇప్పటికే నమోదు చేయబడిన మార్కులను సవరించుటకు ఎట్టి పరిస్థితులలోనూ అవకాశం లేదు

ఈ మేరకు DSE AP వారు అందరు DEO లను కోరుతూ ఉత్తర్వులు జారీ చేసారు

General Administration Department - Implementation of 10% Reservation to the Economically Weaker Sections (EWS) for initial appointments in the Posts and Services under the State Government

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో  EWS Economically Weaker Sections కు 10% రిజర్వేషన్స్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ.విద్యా  సంస్థలలో  ప్రవేశాలకు  ఆర్ధికంగా బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్‌ అమలుకు ఉత్తర్వులు జారీ

టీచర్ల బదిలీలపై విద్యాశాఖ ప్రొసీడింగ్స్ రద్దు.తీర్పుకు విరుద్ధంగా జీవో 54.కేటగిరి 3,4 పాఠశాలల్లో రీ కౌన్సెలింగ్ నిర్వహించండి.హైకోర్ట్

బదిలీల కౌన్సి లింగ్ను కేటగిరి3, 4 పాఠశాలలకు మాత్రమే వర్తింప చేస్తూ విద్యా శాఖ జారీచేసిన ప్రొసీడింగ్స్న హైకోర్టు రద్దు చేసింది. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్న సవాల్ చేస్తూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటి షన్లు వేసారు. వీటిపై హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ డీవీవీఎస్ సో రూజులు విచారణ జరిపారు. తదుపరి కౌన్సెలింగ్ నిర్దిష్టమైన విధానాలను అనుసరిస్తామని అప్పట్లో అడ్వొకేట్జనరల్ ఎస్ శ్రీరాం కోర్టుకు నివేదించారు. దీనిపై బుధవారం మరోసారి విచారణ జరిగింది. పిటిషనర్ల తరుపున న్యాయవాది గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు. ఏజీ హామీకి విరుద్ధంగా విద్యాశాఖ అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఏజీ హామీ అమలుకు స్పష్టం చేశారు. అందువల్ల ఈ ప్రొసీడింగ్స్న నోచుకోలేదని రద్దుచేసి తిరిగి కౌన్సి లింగ్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో ఏకీభవించిన న్యాయమూర్తి విద్యాశాఖ ప్రొసీ డింగ్స్ హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని జీవో 54 లో కూడా ఇదే ప్రస్పుటమైందని వ్యాఖ్యానించారు. జీవోతో పాటు ధర్మాసనం తీర్పును క్రోఢీకరించి అందుకు అనుగుణంగా తాజాగా కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు

Rc.No.151-A&I-2020 Dated:14/07/2021 School Education COVID-19 Pandemic – School preparedness and teaching learning process for the Academic Year 2021-22 – Certain instructions

 ది.27.07.2021 నుండి ది.31.07.2021 వరకూ పాఠశాలల్లో బేస్ లైన్ పరీక్ష నిర్వహించు నిమిత్తం రోజుకి 50 మందికి మించకుండా విద్యార్థులను పాఠశాలకు పిలిపించాలనే ఉత్తర్వులు సవరిస్తూ ఈ రోజు రాత్రి DSE AP వారు సవరించిన ఉత్తర్వులు జారీ చేసియున్నారు.

సవరించిన ఉత్తర్వుల ప్రకారం..

విద్యార్థులను ఎట్టి పరిస్థితులలోనూ పాఠశాలలకు పిలిపించరాదు.

తల్లిదండ్రుల ద్వారా వారి పిల్లలకు బేస్ లైన్ పరీక్ష పేపర్లు పంపవలెను.

విద్యార్థులు ది.27.07.2021 నుండి ది.31.07.2021 వరకూ వారికి సౌకర్యవంతంగా ఉండు సమయాలలో బేస్ లైన్ పరీక్ష వ్రాస్తారు.

విద్యార్థులు పరీక్ష వ్రాసిన పిదప వాటిని వారి తల్లిదండ్రుల ద్వారా తెప్పించుకొని ది.28.07.2021 నుండి ది.03.08.2021 వరకూ సదరు పరీక్ష పేపర్లు సంబంధిత ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయవలెను.

మిగతా కృత్యములన్నీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు మినహా అన్ని యాజమాన్యాల పాఠశాలలు పాటించాలి.

EHS steering committee key Decissions

ఈరోజు జరిగిన EHS Steering Committee  విషయాలు

1. Smart Health Cards 4 రోజుల్లో DDO ల ద్వారా Distribute అయ్యేట్లు చర్యలు తీసుకుంటామన్నారు.

2. EHS లో ట్రీట్మెంట్ కు 2లక్షల నుండి 3 లక్షలకు పెంచారు.

3. EHS Package రేటులను పెరిగిన రేటులకనుగుణంగా రివిజన్ చేసారు. అవసరమైతే మరో 10% పెంచేందుకు అంగీకరించారు.

4. APSRTC వారికి కూడా Health Cards ఇచ్చారు. ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్స్ కు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన వెంటనే అమలు చేస్తారు.

5. ఇకపై మెడికల్ కాలేజ్ లు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ఔట్ పేషెంట్ ట్రీట్మెంట్ తో బాటు టెస్టులు కూడా చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా ఒక జిల్లాలో ట్రయల్ గా నడపి, మిగిలిన జిల్లాలకు అమలు చేస్తారు.

6. ఇకపై మెడికల్ రీయింబర్స్ మెంట్ మంజూరు అయితే Trust నుంచి Message వస్తుంది. అలాగే జూన్ 1 నుండి మంజూరు ఉత్తర్వులు ఆన్ లైన్ ద్వారా తీసుకోవచ్చు.

7. YSR Trust లో మెడికల్ బిల్లుల Status తెలియజేసేందుకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగి తో బాటు మరొక ఉద్యోగిని కూడా కేటాయిస్తారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 18004251818 కు ఫోన్ చేసి కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.

8. కోవిడ్, హాస్పిటల్ రెన్యువల్ వంటి వివిధ కారణాలతో 6నెలలలోపు Online చేయలేకపోయిన మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లు సబ్మిట్ చేయడానికి పర్మిషన్ ప్రత్యేకంగా ఇవ్వాలని కోరాము. పరిశీలిస్తారు.

9. కాలిపోయిన బిల్లులు నేటికీ పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే మంజూరు అయ్యేట్లు చూడాలని కోరాము. బిల్సు Xerox కాపీ లను Attest చేయించి సబ్మిట్ చేస్తే మంజూరు చేస్తారు. అలా ఇప్పటికి 42 మంది దరఖాస్తు చేస్తే 27 మందికి చెల్లించామని చెప్పారు.

10. కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ప్రతీ హాస్పిటల్ లో EHS పథకంలో ఉద్యోగుల కోసం కొన్ని Beds ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు.

Center Govt Enhance DA to their employees from 17% to 28%

డీఏ పెంపుకు కేంద్రం అంగీకారం

7th Pay Commisssion Updates కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ! దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం చెల్లింపుపై కేంద్రం స్పందించింది. ఎటువంటి కోతలు లేకుండా ఉద్యోగులు ఊహించనట్టుగానే కరవు భత్యాన్ని పెంచింది. దీంతో  54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

7వ వేతన ఒప్పందం సంఘం సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తున్న కరువు భత్యం (డియర్‌నెస్‌ అలవెన్స్‌ డీఏ)ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏను 2021 నుంచి అమలు చేయనున్నారు.

కరోనా కల్లోలం కారణంగా 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 2021 జులై నుంచి కొత్త డీఏను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై పడింది. దీంతో ప్రభుత్వం డీఏ పెంచేందుకు అంగీకరించింది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి డీఆర్‌ పెంపుపై ఎటువంటి ప్రకటన రాలేదు.

Download Admit Cards for JEE Mains

JEE Main అడ్మిట్‌ కార్డులు విడుదల

 ❖   మూడో విడత జేఈఈ మెయిన్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.

 ❖   పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చిన తెలిపింది.

https://jeemain.nta.nic.in/

❖ క  రోనా కారణంగా వాయిదా పడిన మూడో విడుత జేఈఈ ఈనెల 20, 25 తేదీల్లో జరగనుంది. 

❖ ఇందులో ఇంజినీరింగ్‌ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్షకు మాజరవుతారు.

❖ కాగా, నాలుగో విడుత జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

❖ ఈ పరీక్షను జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు.

❖  ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌తోపాటు ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు.

2021-22 విద్యా సంవత్సరానికి 1-10 తరగతుల అడ్మిషన్స్, బేస్ లైన్ టెస్ట్, వర్క్ షీట్స్ ప్రాక్టీస్, ఆన్ లైన్ తరగతులు, క్లాస్ రూమ్ టీచింగ్ లపై తగు సూచనలతో... తాజాగా షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

★ పాఠశాల విద్యా శాఖ సంచాలకులు తాజా ఉత్తర్వులు Rc.No. 151 తేది: 14.07.2021 ప్రకారం

★ పాఠశాల లో అడ్మిషన్లు 15.07.2021 నుండి మొదలు

★ బేస్లైన్ పరీక్ష నిర్వహణ 27.07.2021 to 31.07.2021

★ (రోజుకి 50 మంది పిల్లలను మించకుండా పాఠశాలకు అనుమతించి పరీక్ష నిర్వహణ)

★ బేస్లైన్ పరీక్ష మూల్యంకనం:

28.07.2021 to 03.08.2021

★ ప్రైమరీ విద్యార్థుల గత సం. వర్క్ షీట్స్ పూర్తి చేశారో లేదో చూడడం లేనిచో వాటిని పూర్తి చేయించుట: 02.08.2021 నుండి 07.08.2021

★ ప్రైమరీ ఈ విద్యా సం. వర్క్ షీట్స్ చేయించుట: 09.08.2021 నుండి 31.08.2021

★ 6 నుండి 10 తరగతుల వారికి ఈ విద్యా సం. వర్క్ షీట్స్ చేయించుట: 04.08.2021 నుండి 31.08.2021

Fillingup of Staff Nurses, Labtechnicians on contract basis and DEO and Last Grade Services on outsourcing basis in Dr.Y.S.R.Urban Clinic G.ORtNo.367. Dated :12.07.2021.

రాష్ట్రం లో ఏర్పాటయ్యే 560 వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లలో ఓప్పందం ప్రాతిపదికన స్టాప్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ లు భర్తీ చేయడానికి జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 
Governmenttoaccordnecessarypermissionforfillingupofthepostsof StaffNurses, Labtechnicians on contract basis and DataEntry Operators and Last Grade Service on outsourcing basis sanctionedin G.O.1stread above duly adjusting the 104 surplus staffof40Staffnurses, 297Lab Technicians, 239DataEntryOperators and180 LastGradeServiceEmployees

COVID Vaccine for All Govt and private Teachers in Ap before July 31

అందరు ఉపాధ్యాయులు కు 31.07.2021 లోపు కోవిడ్ వేక్సిన్ వేయాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు. below 45years కూడా వేయించుకోవాలి.


పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం
అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులందరికీ టీకాలు వేయాలని అందరూ DM & HO లు మరియు DIOS ఆదేశాలు ఇవ్వబడ్డాయి.
 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉపాధ్యాయులకు కూడా జూలై 31, 2021 లోపు టీకాలు వేయవచ్చని తాజాగా ఆదేశాలు జారీ.

Proc.Rc.No 5/C&T/SCERT/2021 Dated:12/07/2021 School Education- SCERT, AP - COVID-19 pandemic School Preparedness and teaching- learning process for the Academic year 2021-22 Work sheets for all classes – Certain instructions

విద్యార్థులకు 1 నుంచి 10 తరగతుల కు వారధి worksheets   DCEB ల ద్వారా తయారు చేసి  అందజేత కు సూచనలు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ.

Level I : For Classes 1 to 2

Level II : For Classes 3 to 5

NEET Exam date announced, exam held on September 12th

 నీట్-2021 పరీక్ష తేదీ ఖరారు.. ఎగ్జామ్ సెంటర్లు పెంపు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన నీట్(యూజీ) పరీక్షా తేదీని కేంద్రం విడుదల చేసింది. సెప్టెంబర్ 12న కరోనా నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహిస్తామని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

రేపు(జూలై 13) సాయంత్రం 5 గంటల నుంచి NTA వెబ్‌సైట్ల ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. సామాజిక దూరం పాటించే విధంగా ఎగ్జామ్ నిర్వహించే నగరాలను 155 నుంచి 198కి పెంచుతున్నామని.. అలాగే గత సంవత్సరం(3862) కంటే ఈ ఏడాది పరీక్షా కేంద్రాలను సైతం పెంచనున్నట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

కాగా, ప్రతీ సెంటర్ వద్ద విద్యార్ధులకు మాస్కులు అందుబాటులో ఉంటాయని.. ఎంట్రీ, ఎగ్జిట్‌కు నిర్దేశిత టైంస్లాట్స్‌తో పాటు కాంటాక్ట్‌లెస్ రిజిస్ట్రేషన్, శానిటైజేషన్, విద్యార్ధికి విద్యార్ధి మధ్య సామాజిక దూరం ఉండేలా సీటింగ్ విధానాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాగా, మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్ల కోసం నీట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా కాలేజీల్లో అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.

Nadu Nedu - 1st phase ,2nd phase diffrences

నాడు నేడు - మొదటి ఫేజ్, రెండో ఫేజ్ లలో మార్పులు

ఈసారి  సిమెంటు ,  గ్రీన్ బోర్డు మొదలైన వాటితో పాటుగా కరెంటు సామాన్లు , స్విచ్ బోర్డు, ఫ్యాన్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, బాత్రూం టైల్స్ ,బాత్ రూమ్ డోర్స్ , విండోస్ మొదలైన ఇతర సామాన్లు అన్నీ  నేరుగా  ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తారు....ఈ సారి విండోస్, డోర్స్ తుప్పు పట్టని stain less steel వి ఇస్తారు.

 నాడు నేడు మొదటి విడతలో లాగా అమౌంట్ చాల నట్లయితే మరో విడత విడుదల చేయు విధానం ఫేస్ -2 నందు ఉండదు.

కావున ప్రధానోపాధ్యాయులు పాఠశాల కమిటీ వారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహాయంతో ముందుగానే జాగ్రత్తగా అవసరమైన అన్ని పనులకు ఎస్టిమేషన్ తయారుచేసుకుని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్నటువంటి స్టేషనరీ కి సంబంధించి గాని రిపేరు చేస్తే ఉపయోగపడే వస్తువులకు సంబంధించి requirement పెట్టకపోవడం మంచిది.

ముందస్తుగా మనం సబ్మిట్ చేసే input data వివరాలు అత్యంత జాగ్రత్తగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇవ్వబడే నిధులు పూర్తిగా input data పై ఆధారపడి ఉంటాయి.

విద్యార్థులకు సంబంధించిన డ్యూయల్ డెస్క్ లు మరియు క్లాస్ రూమ్ కు అవసరమైన టేబుల్స్, ఫ్యాన్లు ,ట్యూబ్ లైట్లు , ఇతర సామాగ్రిని కూడా మనకున్న తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇండెంట్ రాయాలి. అదనంగా  రాయడం వల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది.

ఈసారి STMS app లాగిన్ ప్రధానోపాధ్యాయులు తో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఇవ్వబడుతుంది.

నాడు నేడు కమిటీలో నియమింపబడిన పీసీ కమిటీలోని ఐదుగురు సభ్యులు ఈ వర్క్ పూర్తయ్యేవరకు తప్పనిసరిగా వారే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను మార్చకూడదు.

నాడు నేడు సంబంధించి  స్కూల్ infrastructure అన్ని ఫోటోలను తీసి  జాగ్రత్త చేసుకోవాలి . ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది అని కంపేర్ చేస్తూ ఆ ఫోటోలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

ఈసారి నాడు నేడు పనుల పరిశీలన ప్రధానోపాధ్యాయుల తోపాటు  ఆ పాఠశాలలోని అందరు ఉపాధ్యాయులకు బాధ్యత కల్పించడం అయినది .  ప్రతి ఒక ఉపాధ్యాయుడు కూడా ఒక్కొక్క పనులకు సంబంధించి బాధ్యత వహించవలసి ఉంటుంది.

మరిన్ని అంశాలు రేపటి ఆన్లైన్ శిక్షణ అనంతరం తెలియజేయబడతాయి.

మీ ఊరిలోని పాఠశాలలో జరిగే నాడు-నేడు పనుల పూర్తిడేటా

 ఏవిధమైన కోడ్ లేకుండా జిల్లా , మండలము , గ్రామము , పాఠశాల పేరును సెలెక్ట్ చేసుకుని నాడు-నేడు పనులలో వాడిన మెటీరియల్ , పనివారు , మొదలైనవి క్రింది లింకుపై క్లిక్ చేసి పరిశీలించవచ్చును.

 http://nadunedu.se.ap.gov.in

TEACHER INFORMATION SYSTEM (TIS) FOR DSC 2008 CONTRACT TEACHERS

2008 DSC లో మినిమమ్ టైమ్ స్కేల్ లో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో వివరాలు పొందుపరచడం కోసం క్రింది గూగుల్ పామ్ ని నింపి సబ్మిట్ చేయాలి. 

July Month Primary Classes (1st to 10th) Online Classes Schedule 12.07.2021 to 31.07.2021.

కొవిడ్‌తో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అవకాశం లేకపోవడంతో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. 

❖ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు బోధించనున్నారు.

దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ యూట్యూబ్ లింక్

https://youtube.com/c/DoordarshanSaptagiri

❖ వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

1, 2 తరగతులు:

ఉదయం 11 నుంచి 12 గంటల వరకు

★3, 4, 5 తరగతులు:

మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు..

★6, 7 తరగతులు:

మధ్యాహ్నం రెండు నుంచి మూడు వరకు

★8, 9 తరగతులు:

మధ్యాహ్నం 3 నుంచి నాలుగు గంటల వరకు..

★పదో తరగతి విద్యార్థులకు:

ఉదయం 10 నుంచి 11 గంటల వరకు భాషా తరగతులు.. సాయంత్రం 4 నుంచి 5 వరకు భాషేతర శాస్త్రాల బోధన జరగనుంది.


ఆన్లైన్ తరగతులు జరుపుతున్న క్రమములో ఉపాధ్యాయులు పాటించవలసిన అంశాలు

1.  విద్యార్థుల కొత్త       హాజరుపట్టికలలో పేర్లు నమోదుచేయాలి.

2. విద్యార్థుల తరగతివారి లిస్టులు తయారు చేసి వారి తండ్రిపేరు, మొబైల్ నెంబర్, TV/ మొబైల్ ద్వారా ఆన్లైన్ క్లాసులు ఎలా వింటున్నారో నమోదుచేయాలి.

3. విద్యార్థులను తరగతి వారీగా సబ్జెక్టు గ్రూపులుగా వాట్సాప్ గ్రూపులతో నమోదు చేయాలి.

4. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయబృందం మాట్లాడి ఆన్లైన్ క్లాసుల ఆవశ్యకతను వివరించాలి.

5. తరగతివారీగా ఉపాధ్యాయులు ఇంచార్జి తీసుకోవాలి.

6. టీవీ, సెల్ ఫోన్ లేనిపిల్లలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మీ లిస్టులలో నమోదుచేయాలి.

7.  ప్రతిరోజూ Time Table ను పిల్లలకు పంపించాలి.

8. ఉపాధ్యాయులు 50% చొప్పున 2గ్రూపులుగా విభజించబడి రోజు ఒక గ్రూప్ హాజరు కావాలి. ఈ గ్రూపుల వివరాలు పై అధికారులకు అందజేయాలి.

9. ఆన్లైన్ క్లాసుల వర్క్ షీట్ ల తోపాటు ఉపాధ్యాయులు కూడా స్వంతంగా వర్క్ షీట్లు ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలి.

10. విద్యార్థులకు మూల్యాంకన పరీక్షలు నిర్వహించి వారి ప్రగతిని నమోదుచేయాలి.

11. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ వచ్చిన వెంటనే అందించాలి.

12. నూతన విద్యార్థులను నమోదు చేసుకోవాలి. TC పై వత్తిడి చేయకపోయినా, కనీసం study , Date of Birth సర్టిఫికెట్లు తెచ్చుకోమనాలి.

13. Work from home ఉన్న రోజు ఇంటివద్దనుండి విద్యార్థులకు కాల్ చేయాలి.

14. వీలయితే స్వంతంగా డిజిటల్ క్లాసులు తయారు చేసుకొని మీకు అనుకూలించిన సమయంలో విద్యార్థులకు బోధించవచ్చు.

15. విద్యార్థులకు త్వరలో రెగ్యులర్ తరగతులు జరుగుతాయని, పరీక్షలుంటాయని శ్రద్దగా ఆన్లైన్ తరగతులు వినాలని చెప్పాలి.

10 వ తరగతి గ్రేడ్లు పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఫార్మాటివ్ మార్కులే ప్రాతిపదిక గా ఛాయారతన్ కమిటీ నివేదిక!

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు చివరి క్షణం రద్దు చేయక తప్పలేదు. 

అయితే విద్యార్ధులకు భవిష్యత్తులో  నష్టం కలగకుండా పాస్ మార్కులు వేసే విషయంలో ఏం చేయాలన్న దానిపై ఛాయారతన్ కమిటీని నియమించింది. 

ఆ కమిటీ అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది.

ఏపీలో పదో తరగతి విద్యార్ధులకు వారు ఈ విద్యాసంవత్సరంలో సాధించిన ఫార్మాటివ్ అసెస్మెంట్ ( ఇంటర్నల్ మార్కులు) ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోంది. 

పరీక్షలు రద్దు కావడంతో ఎవరూ నష్టపోకుండా విద్యార్ధులు ఈ ఏడాది సాధించిన ఇంటర్నల్ మార్కుల్లో సగటు తీసి దాని ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 

అంటే రెండు ఫార్మాటివ్ అసెస్ మెంట్లలో సాధించిన మార్కుల్ని సగటు తీసి ఆ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ప్రకటిస్తారు. 

గ్రేడ్లు ప్రకటించిన తర్వాత రెండు, మూడు రోజుల్లో స్కూళ్ల నుంచి మార్కు మెమోల్ని తీసుకునే అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ ఏడాదితో పాటు గత విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రద్దయినా వారికీ గ్రేడింగ్ ఇవ్వలేదు. మార్కులూ ప్రకటించలేదు. 

దీంతో ఛాయారతన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2019-20 విద్య సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్ధులకు కూడా గ్రేడ్లు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. 

పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం గ్రేడ్లు ప్రకటించకపోవండతో ఇప్పటికే అప్పటి విద్యార్ధులు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ప్రక్రియను త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

FAPTO new Body Formation

ఫ్యాప్టో నూతన కమిటీ ఛైర్మన్ గా జోసఫ్ సుధీర్ బాబు  STU

సెక్రటరీ జనరల్ గా శ్రీ ch. శరత్ చంద్ర BTA 

కో ఛైర్మన్ N.వెంకటేశ్వర్లు  UTF 

కో ఛైర్మన్ భానుమూర్తి APTF257 

కోఛైర్మన్ కె.వెంకటేశ్వర్రావు APTF1938 

కోఛైర్మన్ ఎన్.శ్రీనివాస్ HMA 

ఎన్వీ రమణయ్య డిప్యూటీ  సెక్రటరీ జనరల్  DTF 

శ్రీ సి.హెచ్. వెంకటేశ్వర్లు డిప్యూటీ సెక్రటరీ జనరల్ SCST Association 

శ్రీ ks.ప్రకాష్ రావు , సెక్రటరీ APTA 

శ్రీ జి.శౌరిరాయలు ట్రెజరర్ SA. Association 

----------------

ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు 

KSS.prassd UTF

M.రఘునాధరెడ్డి STU

P.పాండురంగ వర ప్రసాద్ APTF 257

G.హృదయరాజు APTF1938 

GV.నారాయణ రెడ్డి HMA

K.నరహరి DTF 

P.వెంకట్రావు BTA

M.రాజేంద్రప్రసాద్ SCST association 

AGS గణపతి రావు APTA 

P.నరోత్తమరెడ్డి SA. Association

DSC 2008 candidates who are appointed on contract basis shall be allowed to join duty only after executing an agreement in the below format on Rs.110/- judiciary bond.

DSC 2008 కాంట్రాక్ట్ పద్దతిలో SGTs గా అపాయింట్మెంట్ పొందిన అభ్యర్థులు డ్యూటీలో జాయిన్ కావడానికి రూ.110 బాండ్ పై MEOs కి ఇవ్వవలసిన, MEOs తీసుకోవాల్సిన అగ్రిమెంట్.


Jagananna GORUMUDDA IMMS APP UPDATED VERSION 1.2.0 RELEASED

IMMS APP NEW VERSION 1.2.0 ఈరోజు (July10) ఇవ్వడం జరిగింది. పాత APP పనిచేయదు. అన్ని పాఠశాలల వారు ఈ కొత్త App ని Install చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ ప్రస్తుతం Play Store లో ఉండదు.

కావున IMMS APP కావలసినవారు ఇక నుండి Offline లో IMMS APP APK ఫైల్  డౌన్లోడ్ చేసి MANUAL గా INSTALL చేయాల్సి ఉంటుంది

Click Here To Download IMMS APP Updated 1.2.0 

గమనిక : IMMS APP పాత వెర్షన్ ను పూర్తిగా UN INSTALL చేసిన తర్వాత మాత్రమే కొత్త వెర్షన్ ని INSTALL చేయాలి.లేదంటే రెండు IMMS APPS (పాతది, కొత్తది) మన ఫోన్ లో కనబడతాయి.


DSC2008 (MTS) TABLE COPYFOR EXCERCISING THEOPTIONSOF THE CANDIDATESTO BE HELDON 10-07-2021 -PLAIN AREAOF VISAKHAPATNAMDISTRICT

విశాఖపట్నం జిల్లా కు సంబంధించి మినిమమ్ టైమ్ స్కేల్ లో సెలెక్ట్ అయిన 2008 ఉపాద్యాయుల వివరాలు, వారికి కౌన్షిలింగ్ లో చూపించ బోయే ఖాళీల వివరాలు

Vacency list

DA @ 33.536% FROM 01.01.2019 Cash paid in 07/2021 Arrears from 01.01.2019 to 30.06.2021 adjust to PF AC's in 3 instalments

జనవరి 2019 నుంచి రావలసిన కరువుభత్యం DA ARREARS 30 నెలల బకాయిలు 3 విడతల లో చెల్లిస్తారు.జూలై నెలలో జీతం తో పాటు చెల్లించాలి. కొత్త డిఎ తో జూలై నెల జీతం వివరాలు HRA వారీగా మరియు మీ  బేసిక్ పే కి 3 విడతలకు మొదటి విడత  ఆగష్టు లో ఎంత వస్తుంది పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది.

Instalment (1) 01.01.2019 to 31.10.2019=10 months in August 2021

Instalment (2) 01.11.2019 to 31.08.2020=10 months in Sep 2021

Instalment (3) 01.09.2020 to 30.06.2021 =10 months in Oct 2021

DSC - 2008 SGT పోస్టింగ్ లు ఇచ్చుటకు ఏ ఏ ఖాళీలు చూపించాలో సూచనలతో పాఠశాల విద్యా శాఖా ఉత్తుర్వులు

10. 07. 2021 కౌన్సెలింగ్

●బదిలీ అయి  substuite లేక రిలీవ్ కానీ  3,4 కేటగిరీ స్కూళ్లు

●ENROLL ఉండి ఉపాధ్యాయులు లేని 3,4 కేటగిరీ స్కూళ్లు

● రోల్ 40 పైబడిన ఏకోపాధ్యాయ  పాఠశాలలు3,4 కేటగిరీ స్కూళ్లు

● ఒకవేళ అబ్యర్ధులకు కౌన్సిలింగ్ చేయడానికి ఖాళీలు   తక్కువ ఉన్న సందర్భంలో   బ్లాక్ చేసిన4వ కేటగిరీ స్కూళ్లను ఓపెన్ చేయాలి

● 4వ కేటగిరీ లో కూడా అబ్యర్ధులకు కౌన్సిలింగ్ చేయడానికి ఖాళీలు   తక్కువ ఉన్న సందర్భంలో   బ్లాక్ చేసిన3వకేటగిరీ స్కూళ్లను ఓపెన్ చేయాలి (రోల్40 పై బడిన )

●  ఇంకా సరి పడని ఖాళీలు లేకపోతే  block చేసిన3వ కేటగిరీ స్కూళ్లు ఓపెన్ చేయాలి

DIKSHA Updated Version Available

దీక్ష ఆప్ - అప్డేటెడ్ వెర్షన్ 3.9.836 - అప్డేటెడ్ డేట్: జూలై 9 2021

Download Diksha Updated version

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&hl=en_IN&gl=US&referrer=utm_source%3Dgoogle%26utm_medium%3Dorganic%26utm_term%3Ddiksha+app&pcampaignid=APPU_1_b8bpYNjjBuSymgfS07qYDg

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&hl=en_IN&gl=US

Learning continues to be fun and richer on Diksha

WHATS NEW

1. We have enabled users to now easily upload and read offline Diksha contents using a new feature called "Import content" in the mobile app menu

2. Now Schools heads & officials

     a. Can easily see the reports of their submitted surveys from the home page

     b. Can also upload pdfs as evidence for projects

GO 42, Providing laptops to the eligible and willing beneficiaries in place of financial assistance, to the students studying from Classes 9th to 12th under Jagananna Ammavodi for the Academic Year 2021-22

జగనన్న అమ్మ ఒడి పథకం లో భాగంగా లాప్ టాప్ ల కోసం విల్లింగ్ ఇచ్చిన 9 నుండి 12 వ తరగతి విద్యార్థులకు లాప్ టాప్ లను పంపిణీ చేయుటకు ఉత్తర్వులు జారీ. 

Dept Exams Notification Nov 2020 Session Revised Exam Schedule

APPSC డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి షెడ్యూల్ ను మార్చడం జరిగింది. కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగష్టు 6 నుంచి 13 వరకు జరుగుతాయి. 

Departmental Exams will be held from 6th August to 13th August 2021

School Education – DSC – 2008 – Appointment of 2193 candidates who were affected due to change in selection pattern for appointment to the post of SGT’s as secondary Grade Teachers on contract basis with minimum Time Scale(MTS) with terms and conditions as applicable to contract employees Certain Instructions

DSC 2008 file ను re examine చేసి compleate details and remarks ను ఈ నెల 15 వ తారీఖు లోగా తెలియ జేయవలసింది గా ఆదేశిస్తూ DSE వారు అన్ని District DEO లకు పంపించిన memo copy.

While enclosing the copies of the above representations along with its

enclosures are herewith sent to the District Educational Officers concerned and they

are requested to examine the received representations by this office and also the

DSC 2018 objections/ representations received by the District Educational Officers

concerned.

Therefore, all the District Educational Officers in the state are requested to

submit a detailed report case wise ( In regard to DSC 2008 objections) along with

specific remarks and recommendations on or before 15.07.2021 for taking furtheraction in the matter.

This has got the approval of the Director of School Education, Andhra Pradeh,

Ibrahimpatnam, Amaravati.

Schools Reopening on August 16th

AP: ఆగష్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం.August 16 నుండి పాఠశాలలు పునఃప్రారంభం

పూర్వ ప్రాధమిక పాఠశాలలు,3-5 క్లాసులు

up/Hs లకు 2ఏళ్ళలో తరలింపు.

CM తో సమీక్ష అనంతరం విద్యామంత్రి
ఆదిమూలం


విద్యాశాఖలో నాడు- నేడు పై ముగిసిన సీఎం వైఎస్ జగన్ సమీక్ది మూలపు సురేష్ ,విద్యాశాఖ మంత్రి కామెంట్స్..

ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం 

ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం 

ఆగస్టులోపు  విద్యా సంస్థల్లో నాడు నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు

జూల్ 15-ఆగస్టు  15వరకు వర్క్ బుక్కులపై   ఉపాధ్యాయులకు శిక్షణ  కార్యక్రమం 

పాఠశాలలు పునః ప్రారంభం కానున్న  ఆగస్టు15లోపు పాఠశాల పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు 

పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారు

ప్రభుత్వం నూతన విద్యా విధానం తప్పనిసరిగా అమలు చేస్తుంది  

నూతన విద్యా విధానం అమలు వల్ల  ఏ స్కూల్ మూతపడదు, ఏ ఉపాద్యాయుడు పోస్టు తగ్గదు 

రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నర్మాణం పూర్తి 

నాడు నేడు కింద పనుల కోసం 16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు 

30శాతం పదోతరగతి , 70 శాతం ఇంటర్  ప్రధమ సంవత్సరం  మార్కులు  ప్రాతిపదికగా   ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తాం 

ఈనెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తాం

Electric Bykes Registration Process

Electric bike కొరకు  ddo code ఎంటర్ చేయకుండా మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి లాగిన్ అయితే ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేసి లాగిన్ అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

Note

యాప్ లో కాకుండా క్రింది లింకు ద్వారా chrome లేక fire fox లో ప్రయత్నించండి

http://evnredcap.in/


LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go