మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

‘పది’పై నెలాఖరున స్పష్టత.పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు

ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలపై నెలాఖరున స్పష్టత ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు వి.చినవీరభద్రుడు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జీఎంసీ బాలయోగి సైన్స్‌ పార్కును ఆయన బుధవారం సందర్శించి విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఉపాధ్యాయులు సహకారం అందించాల్సింది పోయి రాద్ధాంతాలు చేయడం సహేతుకం కాదన్నారు. 

సీబీఎస్‌ఈ విధానం అమలులో భాగంగా 80% ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌, 20% ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తామని చెప్పారు. ‘మనబడి నాడు-నేడు’ పథకం రెండోదశలో 16,400 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment

LATEST POST

TaRL Mid Line Assessment

2025-26లో జరగబోయే FA 3  పరీక్షలలో TaRL మిడ్ లైన్ పరీక్షను పొందుపరచడం జరిగింది  ఇందులో భాగంగా అసెస్మెంట్ బుక్లెట్ లోని FA 3 విభాగంలో Tool 2 ప...