మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

పదో తరగతి పరీక్షల ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు.


పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పదోతరగతి పరీక్షా కేంద్రాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా దేవానందరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థులు ‘పది’ పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

ఈనెల 18తో ‘పది’ పరీక్షలు ముగుస్తాయన్న దేవానందరెడ్డి.. 19 నుంచి 26వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ జరుగుతుందని తెలిపారు. 

ఇందులో 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని చెప్పారు. వాల్యుయేషన్ అనంతరం కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో విద్యాశాఖ మంత్రి అనుమతితో పది ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

No comments:

Post a Comment

LATEST POST

AP TET PAPER 1&2 MATHS 30 QUESTIONS STE 17

AP TET పరీక్షలుకు సంబంధించి MATHS లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 30 ప్రశ్నలతో exam open అవుతుంది.30 ప్రశ్నలు ...