మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

 2023-24 విద్యా సంవత్సరానికిగాను డా.బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి గతంలో ఇచ్చిన గడువును ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగించారు . 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 ఎస్సీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ గడువు మార్చి 24వ తేదీ తో ముగిసిపోగా దీన్ని మార్చి 31వ తేదీ వరకూ పొడిగించారు . 

ఆన్ లైన్ ద్వారా ఈ ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించాలి. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతిలోకి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు అర్హులు.

 5 వ తరగతిలోకి ప్రవేశం కోరే విద్యార్థులు

 https://apgpcet.apcfss.in/swfifthform 

 అనే వెబ్ సైట్ ద్వారా, అలాగే ఇంటర్ లో ప్రవేశం కోరే విద్యార్థులు

 https://apgpcet.apcfss.in/swinterform 

 అనే వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఈనెల 31వ తేదీ లోపుగా సమర్పించాలి.

 గురుకుల సీట్ల కేటా యింపులో ఎస్సీ ఎస్సీలకు 75 శాతం, బీసీ-సీ కేటగిరీకి చెందిన క్రిస్టియన్ దళితుల కు 12శాతం, ఎసటీలకు 7శాతం, బీసీలకు 6 శాతం, ఓసీలకు 2శాతం రిజర్వేషన్ల ప్రకారంగా కేటాయించడం జరుగుతుంది.

No comments:

Post a Comment

LATEST POST

AP open school 10th class halltickets download link

AP ఓపెన్ స్కూల్ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్ లను విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ ...