మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

తారకరత్నకు ‘ఎక్మో’ విధానంలో చికిత్స.. వెంటిలేటర్‌కు, ఎక్మోకు తేడా ఏంటంటే.

 పాదయాత్రలో నడుస్తూ గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న (TarakaRatna Heart Attack) ఆరోగ్య పరిస్థితి (TarakaRatna Condition Critical) ఆందోళనకరంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు హెల్త్ బులిటెన్‌లో వెల్లడించడంతో నందమూరి అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. తారకరత్నకు ఎక్మో (TarakaRatna ECMO Treatment) ExtraCorporeal Membrane Oxygenation (ECMO) పరికరం ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు తెలిసింది. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Tamilnadu Ex CM Jayalalitha) ఆసుపత్రి పాలైన సందర్భంలో, గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubramanyam) ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో, తిరుమల ఆలయ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి పరిస్థితి విషమంగా మారిన సందర్భంలో కూడా ఎక్మో విధానంలోనే వైద్యులు చికిత్సనందించారు. అసలు ఈ ప్రాణరక్షణ పరికరం ఎక్మో ఎందుకు..? ఏ సందర్భంలో అక్కరకొస్తుందో తెలుసుకుందాం.


ఎక్మో (ECM0) ఎప్పుడు?

శస్త్రచికిత్స చేసే సమయంలో లేదా ఇతర వ్యాధులతో బాధపడుతూ గుండె, ఊపిరితిత్తులు పనిచేయని వారికి ‘ఎక్మో’ అక్కరకొస్తుంది. ఈ రెండు ప్రధాన అవయవాల బాధ్యతను ఎక్మో పరికరం తలకెత్తుకుని ప్రాణాలను నిలబెడుతుంది. న్యుమోనియా, ఊపిరితిత్తుల కేన్సర్‌, సీపీఓడీ మొదలైన రుగ్మతలతో రోగి తనంతట తాను స్వయంగా శ్వాస తీసుకోలేని సందర్భంలో ఎక్మో పరికరం ఉపయోగపడుతుంది. అలాగే గుండె కవాటాలు దెబ్బతిని, గుండె పనిచేయని స్థితిలో కూడా ఇదే పరికరం తోడ్పడుతుంది. ఈ సమయాల్లో పరికరాన్ని అమర్చి, చికిత్స కొనసాగిస్తారు. ఇప్పుడు తారకరత్న పరిస్థితి దాదాపుగా ఇదే అని వైద్యుల హెల్త్ బులిటెన్‌తో స్పష్టమైంది.

ఎక్మోతో దుష్ప్రభావాలు?

ఈ పరికరానికి సంబంధించిన కేథటర్లు అమర్చడం వల్ల కొంతమేరకు రక్తస్రావం జరిగే వీలుంది. దీనికి ఇన్‌ఫెక్షన్లూ తోడవ్వచ్చు. పెద్ద కేథటర్లతో రక్తం గడ్డకట్టే వీలు ఉంటుంది కాబట్టి రక్తం పలుచనచేసే మందులు వాడవలసి ఉంటుంది. ఇలా పలుచనైన రక్తం మరింత తేలికగా కారిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఎక్మో కారణంగా శరీరంలోని కొన్ని అవయవాలకు రక్తప్రసారం జరగకపోవచ్చు. ఫలితంగా ఎలాంటి నష్టం జరగకుండా, శరీరంలోని వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్సిజన్‌ శాతాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ చికిత్స కొనసాగుతుంది.

వెంటిలేటర్‌ - ఎక్మో!

ఈ రెండు పరికరాలూ శ్వాసకోశాలు పనిచేయని సమయంలో అక్కరకొచ్చేవే! ఊపిరితిత్తుల్లోకి గాలిని బలంగా పంపించడానికి వెంటిలేటర్‌ ఉపయోగపడితే, కేథటర్‌ ద్వారా నేరుగా శరీరానికే ఆక్సిజన్‌ను అందించడానికి ఎక్మో తోడ్పడుతుంది. వెంటిలేటర్‌కు కూడా ఊపిరితిత్తులు సహకరించని సమయంలో ఎక్మో ఉపయోగపడుతుంది.


ఈ వ్యాధుల్లో..

 ఉబ్బసం అదుపుతప్పి, తీవ్రమైనప్పుడు

 గుండె మార్పిడి సమయంలో

 విషవాయువుల బారిన పడ్డప్పుడు

 కార్డియోమయోపతీలో

 మయోకార్డైటిస్‌లో

గుండెలో లోపాలతో పుట్టిన పసికందులకు

న్యుమోనియా తీవ్రమైనప్పుడు

No comments:

Post a Comment

LATEST POST

100 days action plan for 10th class Day 24

10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డే 24 నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. 📥 DOWNLOAD SSC DAY ...