మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలు. ఆరు పేపర్లు.. రోజు విడిచి రోజు నిర్వహణ. ప్రభుత్వానికి ఎస్సెస్సీ బోర్డు ప్రతిపాదనలు

 రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు-2023 : ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ముగింపు తేదీకి అటుఇటుగా ఒకరోజు వ్యవ ధిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్(ఎస్సెస్సీ బోర్డు) షెడ్యూల్ను రూపొందిం చింది. ఇంటర్ పరీక్షలు మార్చి 15న ప్రారంభమై ఏప్రిల్ 4వ తేదీతో ముగుస్తాయి. రాష్ట్రంలో పాఠశాల విద్యలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో.. టెన్త్ పబ్లిక్ పరీక్షలనూ అదే ప్యాట్రన్లో చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. సీబీఎ స్ఈలో పబ్లికపరీక్షలు రోజు విడిచి రోజు జరుగుతాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షలను కూడా రోజు విడిచి రోజు నిర్వహించాలని ఎస్సెస్సీ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించేలా ప్రభుత్వం ఇంతకు ముందు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆరు పేపర్ల పరీక్షలను రోజు విడిచి రోజు నిర్వహిం చనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఇటీవల పలు విద్యాసంస్థల యాజ మాన్యాలతో జూమ్ మీటింగ్ నిర్వహించి.. పలు అంశాలపై చర్చించారు. సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్లు కలిపి ప్రశ్నపత్రాలిస్తారు. పీఎస్ లో 16, ఎన్ ఎస్లో 17 ప్రశ్నలుంటాయి. సమాధాన పత్రాలు రెంటికీ వేర్వేరుగా రాయాల్సి ఉంటుంది. ముందు పీఎస్, అనంతరం ఎన్ఎస్ ప్రశ్నలుంటాయి. అలానే సమాధానాలూ రాయాలి.

పేర్లు, వివరాల్లో తప్పులు సరిచేసుకునేందుకు.. ఎడిట్ ఆప్షన్


పరీక్ష ఫీజును పాఠశాలల యాజమాన్యాలు కట్టినా, లేదా సీఎ ఫ్ఎంఎస్ ద్వారా ఎవరు కట్టినా పరిగణనలోకి తీసుకుం టామని చెప్పారు. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పుగా నమోదు చేసి ఉంటే కనుక ఆందోళన చెందాల్సిన పనిలేదని, పరీక్ష ఫీజు చెల్లించిన అనం తరం ఎడిట్ ఆప్షన్ ఇస్తామని దేవానందరెడ్డి ఆయా యాజమాన్యాలకు వివరించారు.

No comments:

Post a Comment

LATEST POST

Feedback Form Links to be submitted in the final session by all Primary & Secondary teachers who attended the Cluster Complex - August 2026

ఈరోజు స్కూల్ కాంప్లెక్స్ కు హాజరయ్యే ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సబ్మిట్ చేయవలసినటువంటి ఫీడ్బ్యాక్ లింకులు. Prim...