మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

విద్యార్థి విజ్ఞాన్ మంథన్కు దరఖాస్తుల ఆహ్వానం . 6 నుంచి 11 వ తరగతి విద్యార్థులు అర్హులు ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 30

నమూనా పరీక్షలు: నవంబర్ 27 ,30

ఫలితాలు వెల్లడి : డిసెంబర్ 20

రాష్ట్రస్థాయి పరీక్ష : 2023 జనవరి 5 , 15 , 22

జాతీయస్థాయి పరీక్ష : 2023 మే 20 , 21

కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ ( ఎన్.సి.ఇ.ఆర్.టి ) , విజ్ఞాన భారతి , విజ్ఞాన్ ప్రసార్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 6 నుంచి 11 వ తరగతి ( ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ) విద్యార్థులకు ఆన్లైన్లో ఓపెన్ బుక్ పద్ధతి ద్వారా టెస్ట్ నిర్వహిస్తున్నారు . సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ , రాష్ట్ర బోర్డు విద్యార్థులు ఈ పోటీ పరీక్షకు అర్హులు . 


దరఖాస్తు ఇలా .


రూ .200 చెల్లించి '  https://vvm.org.in/main వెబ్సైట్లో ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తు చేసుకున్న వారికి జూనియర్ , సీనియర్ విభాగాల్లో నవంబర్ 1 న నమూన పరీక్షలు నిర్వహిస్తారు . ఇంగ్లిషు , హిందీతో పాటు తెలుగు మీడియంలోనూ పరీక్షకు హాజరయ్యే అవ కాశం ఉంది . 


పరీక్ష విధానం 


గణిత , సామాన్య శాస్త్రం పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం అంశాలు , విజ్ఞాన శాస్త్ర రంగంలో దేశ కృషిపై 20 శాతం , శాస్త్రవేత్తల జీవిత చరిత్రకు సంబంధించి 20 శాతం , లాజిక్ , రీజనింగ్కు 10 శాతం బహుళై చ్ఛిక ప్రశ్నలు ఉంటాయి .


ప్రతిభ చాటితే ..

 పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలైతే ఆన్లైన్ ద్వారా ప్రశంసాపత్రం అందుకోవచ్చు . జిల్లా స్థాయిలో విజేతలైతే ప్రశంసా పత్రంతో పాటు వెబ్సైట్ లాగిన్ ఇస్తారు . ఆ లాగిన్ ద్వారా రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనాలి . ఇందులో విజేతలైతే ధ్రువపత్రంతోపాటు జ్ఞాపిక అందిస్తారు . ప్రతిభ చాటిన ముగ్గురికి రూ .5 వేలు , రూ .3 వేలు , రూ .2వేలు చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తారు . జాతీయ స్థాయిలో సత్తా చాటిన ముగ్గురిలో ప్రథమ రూ .25 వేలు , ద్వితీయ రూ .15 వేలు , తృతీయ బహుమ తుల కింద రూ .10 వేలు చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తారు . దీంతోపాటు నెలకు రూ .2 వేల చొప్పున ఏడాది పాటు ఉపకార వేతనం అందిస్తారు . దేశం లోని పరిశోధన సంస్థలను సందర్శించేందుకు కూడా అవకాశం లభిస్తుంది.

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

ఉమ్మడి విశాఖ జిల్లా SGT and SCHOOL ASSISTANT సీనియార్టీ నెంబర్ ను మీ ట్రెజరీ id ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెంబర్ కి ముందు ఎంత ...