మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

అటెండెన్స్ యాప్ అందరికీ.ముందుగా విద్యాశాఖలో ప్రవేశపెట్టాం. చీఫ్ సెక్రటరీ నుంచి ఆఫీస్ సబార్డినేట్ దాకా అందరూ చేయాల్సిందే

 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతోమంత్రి బొత్స చర్చలు

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్వరలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్సు వ్యవస్థను తీసుకుని రానున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల అటెండెన్సు నమోదు కోసం రూపొందించిన యాప్ వినియోగంలో ఉన్న అపోహలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలన్నిటిలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్సు వ్యవస్థను తీసుకురావటంలో భాగంగానే ముందుగా విద్యాశాఖలో ఆ విధానం అమలుకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. చీఫ్ సెక్రటరీ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ ఫేస్ రికగ్ని షన్ యాప్ నే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అటే ండెన్సుయాప్ విషయంలో ఉపాధ్యాయులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించటమే లక్ష్యంగా సానుకూల ధృక్పథంతోనే విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం.. వాటిని అమలు చేయడంలో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎపుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖలో ఉపాధ్యాయుల అటెండెన్సుకు సంబంధించిన యాప్ విషయంలో కొంతసమాచార లోపం వచ్చిందనీ, దానిని సరిదిద్దే క్రమంలో ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేసే చర్యలు చేపట్టామన్నారు. < వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలకు ఆలస్యంగా వస్తే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారన్న ప్రచారంపై కూడా బొత్స వివరణ ఇచ్చా రు. ఉద్యోగుల హాజరు విషయంలో ఏళ్ల తరబడి అమలులో ఉన్న నిబంధనలనే అమలు చేస్తున్నామన్నారు. మూడు సార్లకు మించి ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ కింద పరిగణించడం తప్ప కొత్త నిబంధనలేమీ విధించలేదన్నారు.


యాప్లో లక్ష మంది రిజిస్టర్


రాష్ట్రంలో 1.83 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే ఇంతవరకు దాదాపుగా లక్షమంది యాప్లో రిజిస్టర్ చేసుకున్నారని బొత్స తెలిపారు. మిగిలిన వారంతా యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాని వినియోగించటానికి వీలుగా 15 రోజులను L ట్రైనింగ్ పీరియడ్ గా పరిగణించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అటెండెన్సు నమోదు చేసేసమయంలో నెట్ వర్క్ సమస్యలు ఎదురైనప్పటికీ యాప్ ఏ విధంగా పనిచేస్తుందో ఉపాధ్యాయులకు అధికారులు సమావేశంలో వివరించారని తెలిపారు. 15 రోజుల ట్రైనింగ్ సమయంలో ఏమైనా కొత్త సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే వాటిని కూడా పరిష్కరించి యాప్ ను పూర్తి స్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

No comments:

Post a Comment

LATEST POST

  Agenda: School Cluster Complexes – February 2026 Session 1: Common Session (1:00 PM – 2:00 PM) Target Audience: All Participants | W...