మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ప్రశ్నపత్రాలను షేర్‌ చేసే వారిపైనా చర్యలు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి

 పదో తరగతి ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి బయటకు పంపేవారిపైన, వాటిని షేర్‌ చేసేవారిపైనా కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి వెల్లడించారు. పరీక్షల చట్టం 25/97 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశ్నపత్రాన్ని షేర్‌ చేసిన వారు శిక్షార్హులేనన్నారు. ఫోన్‌కు ఎవరైనా ప్రశ్నపత్రం పంపితే దాన్ని ఎవరికీ షేర్‌  చేయకుండా ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లోగానీ, మండల విద్యాధికారికిగానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. మీడియా ప్రతినిధులు సైతం సహకరించాలని కోరారు. పరీక్షల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉండాలని, ఎవరైనా ప్రైవేటు వ్యక్తులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించినా, మొబైల్‌ఫోన్లు కనిపించినా చీఫ్‌ సూపరింటెండెంట్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. రంజాన్‌ పండుగను ఏ తేదీన నిర్వహించుకున్నా పరీక్షల తేదీల్లో మార్పులు ఉండవని వెల్లడించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

LATEST POST

Mental Ability Quiz 1 for secondary students

UP & HS స్థాయి విధ్యార్థులకు MENTAL ABILITY కి సంబంధించి 20 QUESTIONS తో Quiz ప్రోగ్రామ్. Quiz పూర్తయిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అన్నీ చూపి...