మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

3 రాజధానులపై హైకోర్టు కీలక తీర్పు.రాజధానిపై ప్రభుత్వానికి శాసనాధికారం లేదు : హైకోర్టు

మూడు రాజధానులు , CRDA రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది . అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది . CRDA చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని , 6 నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని ఆదేశించింది . భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలంది . రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టేందుకు వీల్లేదని స్పష్టం చేసింది . 

రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది . అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని తెలిపింది . పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ . 50 వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది . అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని , అక్కడి అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని తీర్పు చెప్పింది .

No comments:

Post a Comment

LATEST POST

School complex agenda

ఈ రోజు నిర్వహించే క్లస్టర్ కాంప్లెక్ సమావేశం యొక్క సెషన్స్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు, చివరలో సబ్మిట్ చేయవలసిన ఫీడ్ బ్యాక్ ఫామ్ Clus...