Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

పరీక్ష గదికి 16 మంది. విద్యార్థులే.కరోనా ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు. పరీక్ష కేంద్రాల సంఖ్య 4,200కు పెంపు

ఇప్పటికే విద్యార్థులు, టీచర్లందరికీ వ్యాక్సిన్‌

పరీక్షలకు 6.30 లక్షల మంది విద్యార్థులు

మే 2 నుంచి 13 వరకు పరీక్షలు. పరీక్షల్లో ఉత్తీర్ణత పెంపునకు ప్రత్యేక మెటీరియల్‌ పంపిణీ

 రాష్టంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో గదికి 16 మంది విద్యార్థులే ఉండేలా ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకు ముందు గదికి 24 మంది ఉండేవారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు గతంలోనే విద్యార్థుల సంఖ్యను కుదించింది. ప్రస్తుతం కరోనా దాదాపు తగ్గుముఖం పట్టినప్పటికీ, విద్యార్థుల ఆరోగ్యంతోపాటు పరీక్షల్లో కాపీయింగ్‌ జరగకుండా బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. గతంలో దాదాపు 2 వేల కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు నిర్వహించగా, ఇప్పుడా సంఖ్యను 4,200కు పెంచినట్లు ఎస్సెస్సీ బోర్డు డైరక్టర్‌ డి.దేవానందరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ఈ ఏడాది పరీక్షలకు 6.30 లక్షల మంది హాజరుకానున్నారు. టెన్త్‌ విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ ఇప్పటికే ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయించింది.

మే 2 నుంచి పరీక్షలు

టెన్త్‌ పరీక్షలను మే 2వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించేలా బోర్డు షెడ్యూల్‌ను ఇంతకు ముందే విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సిలబస్‌ పూర్తి చేశారు. ఇప్పుడు ప్రత్యేక మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నారు. రివిజన్‌ చేయిస్తూ రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాల బ్లూప్రింట్, మాదిరి ప్రశ్నపత్రాలను బోర్డు విడుదల చేసింది. ఈసారి అంతర్గత మార్కులతో సంబంధం లేకుండా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో హిందీ మినహా తక్కినవాటిలో రెండేసి పేపర్లు 50 మార్కులు చొప్పున ఉండేవి.

తాజాగా పేపర్లను ఏడింటికి కుదించడంతో 100 మార్కులకు ప్రశ్నపత్రాలు ఉంటాయి. బిట్‌ పేపర్‌ విడిగా ఉండదు. వ్యాసరూప ప్రశ్నలకు 8, లఘు సమాధాన ప్రశ్నలకు 4, అతి లఘు ప్రశ్నలకు, లక్ష్యాత్మక ప్రశ్నలకు 1 మార్కు ఇస్తారు. మేథమెటిక్స్‌లో అకడమిక్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం ప్రాబ్లెమ్‌ సాల్వింగ్, రీజనింగ్‌ అండ్‌ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్, విజువలైజేషన్‌ అండ్‌ రిప్రజెంటేషన్‌ అంశాలను పరిశీలన చేసేలా ప్రశ్నలుంటాయి. లక్ష్యాత్మక ప్రశ్నల్లో ప్రయోగాలు, ప్రశ్నలు రూపొందించడం,  క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు, పట నైపుణ్యాలు వంటివి ఉంటాయి. సైన్సు సబ్జెక్టుల్లో సమస్యకు సరైన కారణాలు ఊహించి చెప్పడం, ప్రయోగ అమరిక చిత్రాన్నిచ్చి ప్రశ్నించడం, ప్రయోగ నిర్వహణకు అవసరమైన పరికరాల గురించి అడగడం వంటివి ఉంటాయి. 

Teacher Information System TIS Last date for updation

March 2 వ తేది లోపు ప్రతి teacher తమ వివరాలు TIS లో తప్పనిసరిగా అప్డేట్ చేసి సబ్మిట్ చేయవలెను.

https://studentinfo.ap.gov.in/EMS/login.do

TIS_HM మరియు టీచర్ ఎలా చేయాలి??

1.To add a teacher:

Child info login లో services నందు staff అను tab లో ఉన్న cadre strength అనే tab నొక్కిగానే ఒక టేబుల్ డిస్ ప్లే అవుతుంది.

ఈ టేబుల్ నందు Sanctioned posts మరియు working అను fields లో సరిసమానంగా ఉంటే కొత్త టీచర్ ని Add చేయుటకు వీలు కాదు.

Sanctioned posts కంటే working posts తక్కువగా ఉంటే చివరన Pending అనే గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది.

ఆ గ్రీన్ కలర్ బాక్స్ లో ఎన్ని పెండింగ్ లో ఉంటే అన్ని పోస్ట్ లు Add చేయుటకు వీలు ఉంటుంది.

ఇప్పుడు Pending posts అనే గ్రీన్ బటన్ పై నొక్క గానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.

అందులో Treasury ID ఎంటర్ చేయుట ద్వార Teacher details forms ఓపెన్ అవుతాయి. అవి పూర్తి చేసి submit చేయగా ఆ టీచర్ Add అవుతారు.

2  Delete a teacher

Child info లో లాగిన్ అయ్యాక,services అను tab నందు ,staff అనే tab లో teacher status అనే tab నొక్కితే ఆ పాఠశాలలోని అందరు టీచర్ల వివరాలతో ఒక విండో ఓపెన్ అవుతుంది.

ఆందులో status అనే field నందు working,transfer,retire, expire అనేవి ఇవ్వబడినవి.

Working ఎంపిక చేసుకొంటె అపాఠశాలలోనే కొనసాగుతారు.

మిగతావి తదనుగుణంగా మనం ఎంపిక చేసుకొంటే మనం కోరిన విధంగా అ టీచర్ ఆ పాఠశాల నుండి delete చేయబడతారు.

అసలు ఇంతవరకు TIS లేని టీచర్స్ ఎలా add చేయాలి?:

మనం child info లో లాగిన్ అయ్యి,services లో staff అనే tab లో cadre strength నొక్కి తే వచ్చిన కొత్త విండో లో sanctioned ఎక్కువ ఉండి, working తక్కువ ఉంటే pending posts అనే గ్రీన్ బాక్స్ లో తేడా ఎన్ని పోస్ట్ లో చూపబడుతుంది.

ఆ గ్రీన్ బాక్స్ పై నొక్కి తే ఒక కొత్త విండో ఒపెన్ అవుతుంది.

అందులో మన treasury. ID ఎంటర్ చేసి , వచ్చిన కొత్త విండో లో మన details అన్ని ఇచ్చి, submit చేయగానే ఆ టీచర్ ఆ పాఠశాలలో Add అయిపోతారు.

TIS_ టీచర్ లాగిన్ లోUPDATE చేసుకొనే విధానం:

1.student info.AP.gov.in/EMS అనే వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి.

2. Dept Login అనే ఆరంజ్ కలర్ బటన్ నొక్కాలి.

3. User ID: మన ట్రెజరీ ఐడీ(Treasury ID)

Password: మనం set చేసుకొన్నది.

4. Password లేకపోతే?:

Dept login నొక్కిన తరువాత కింద వచ్చిన విండోలో "forgot password " అనేది ఎర్రని అక్షరాలలో ఉంది.

Forgot password నొక్కితే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.

అక్కడ మన ట్రెజరీ ID,క్యాప్చ కొట్టితే...OTP మన మొబైల్ నంబర్ కి వస్తుంది.

ఆ OTP తో మనం కొత్త password set చేసుకుని పైన చెప్పిన ప్రకారం లాగిన్ కావచ్చు.

5. మొబైల్ నంబర్ తప్పు అనుకుంటే?:

MEO గారిని కలిసి వారి లాగిన్ లో HM mobile update అనే దగ్గర Teacher మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు.

రామన్ ఎపెక్ట్ ఆవిష్కరణ ఫిబ్రవరి28.జాతీయ సైన్సు దినోత్సవ శుభాకాంక్షలు

అది1928వ సంవత్సరం, ఫిబ్రవరి 28వ తేదీ..భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ (సర్.సి.వి.రామన్) ఒక వినూత్న, విజ్ఞాన శాస్త్ర ప్రయోగ ఫలితాన్ని ప్రపంచానికి అందజేసిన పండుగరోజు.

ఏక వర్ణకాంతి, వస్తువుపై పడి పరిచ్ఛేదనం చెందినపుడు బహిర్గత కాంతిలో ఎక్కువ తీవ్రత మరియు తక్కువ తీవ్రత గల్గిన రేఖలు ఏర్పడుతాయి. హెచ్చు తీవ్రత గల్గిన రేఖలను "స్టోక్ రేఖ" లనీ, తక్కువ తీవ్రత గల్గిన రేఖలను ప్రతి లేదా "వ్యతిరేక స్టోక్" రేఖలనీ అంటారు. ఇటువంటి దృగ్విషయాన్ని "రామన్ ఫలితము" అంటారు. ఇక్కడ జరిగే పరిచ్ఛేదనాన్ని రామన్ పరిచ్ఛేదనం లేదా రామన్ స్కేటరింగ్ అంటారు. ఈ దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్రదినము"గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజును "రామన్స్ డే" అని కూడ అంటారు

ఫిబ్రవరి 28, 1928న సర్‌ సి.వి.రామన్‌, తన ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్‌’ దినోత్సవంగా ప్రకటించింది.

భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో, ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది. జాతీయ స్థాయిలో సైన్స్‌ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ నేషనల్‌ సైన్స్‌ డే లక్ష్యాలు

ఈ రోజున అన్ని ప్రభుత్వ జాతీయ సంస్థలలయిన DRDO, ISRO వంటి సంస్థల్లోకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు.

ఫిబ్రవరి 28వ తేదీన దేశం నలుమూలల వైజ్ఞానిక సదస్సులు, చర్చాగోస్టులు, జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహా సమావేశాలు, విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసే సంబరాలు అంబరాన్ని జరపడం ప్రతి యేడాది ఆనవాయితీ అయింది.

ముఖ్యంగా ప్రతి విద్యార్తి స్రుజనాత్మకంగా అలోచింపజేసె తత్వాన్ని ప్రొత్సహించటమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం

రామన్ ఫలితము - అనువర్తనాలు (ఉపయోగాలు)

అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణు ధర్మాలు అధ్యయనం చేయవచ్చు

రేడియోధార్మికత,అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు తెలుసుకోవచ్చు

అన్ని రాళ్ళను సానబట్టినపుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థాన భ్రంశము వంటి విషయాల అవగాహనకు రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు

కర్బన రసాయన పదార్ధాల అమరికలో శృంఖలాలు, వలయాలు కనుగొని ఆటోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది

మిశ్రమ లోహాలు, ఆ లోహాలు, ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది

వాహాకాలు, అర్థవాహకాలు, అతి వాహకాల స్వభావం తెలుసు కోవచ్చు

.మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, నూక్లియాన్ల ఆకృతి, క్రియా శీలతల పరిమాణాత్మక విలువలు కనుక్కోవచ్చు.

డీ ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం (D.N.A) మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం.దీనికి గల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు

మధుమేహం, కేన్సరు రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.

వాతావరణంలో కాలుష్యాలైన CO2,CO,SO2,O3 ఉనికిని గుర్తించవచ్చు.

జల కాలుష్యాలైన సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటక నాశన పదార్థాలు, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికి కనుక్కోవచ్చు

ప్లాస్టిక్కులలో రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.

కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు

సైన్సు ఒక జీవన విధానం. సైన్సు మనకు ఎమి తెలియని అయోమయస్తితి నుండి , నిర్దిస్టమైన అవగాహన దిశగా , ఖచ్చితమైన ,విశ్వసనీయమైన మార్గం గుండా తీసుకొని పోతుందని  అనటంలో ఏలాంటి సందేహం లేదు

ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశమైన ఆర్థిక , సమాజిక , పారిశ్రమిక అభివృద్ధి అనేది ఆ దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే  కొలమానంగా పరిగనించ బడుతుంది . అందుకే నేడు  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక కొలమానం గా మారిది. నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అననేది ప్రగతికి చిహ్నం

1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్  బిరుదుతో ఆయనను సత్కరించింది.

రామన్ ఎఫెక్టు అసామాన్య మైనదని, అందులో కనీసం  200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైన దని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు

ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి

భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా చేసుకోగలిగాం

ఈ రోజు విద్యా సంస్థలలో ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతారు, విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా ప్రోత్సహిస్తారు.

రామన్ తన ప్రయోగానికీ  అయిన ఖర్చు  కేవలం 200 రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ  ఖర్చుతో ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రావటం అనేది ఇంత వరకు జరుగలేదు , భవిష్యత్తులో కూడ జరగదు. నోబెల్ బహుమతితో తనకు వచ్చిన డబ్బుతో భారతదేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయం అయిన భారతీయ విజ్ఞానసంస్థానం  (Indian Institute of science) కు విరాళం ఇవ్వటం జరిగింది.

ఇలా _ఎందరో మన దేశానికి చెందిన  శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో  మన దేశ ఎనలేని కీర్తి  ప్రతిష్టలతో  దేశ కీర్తిప్రతిష్టలను విశ్వవ్యాప్తం   చేశారు. విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం.

అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం

ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’.. ప్రపంచంలోనే శక్తిమంతమైన బాంబును రష్యా ప్రయోగిస్తుందన్న ఆందోళన.. ఉక్రెయిన్ కు తరలించిన రష్యా

ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.. ఇప్పుడు ఉక్రెయిన్, నాటో సహా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న అత్యంత భయంకరమైన బాంబిది. అవును మరి, అణ్వాయుధాల తర్వాత అంత శక్తిమంతమైన బాంబ్ ఏదైనా ఉందంటే అది ఈ బాంబే. ఉక్రెయిన్ పై ఈ బాంబును ప్రయోగించేందుకు రష్యా తహతహలాడుతోందని అమెరికా, బ్రిటన్ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆ బాంబును గానీ ఉక్రెయిన్ పై రష్యా ప్రయోగిస్తే దాని పర్యవసానాలు మామూలుగా ఉండవన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఇప్పటికే ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ను ప్రయోగించే మిసైల్ లాంచర్ వ్యవస్థలను ఉక్రెయిన్ కు రష్యా తరలించింది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. నిన్ననే ఆ మిసైల్ లాంచర్లను యుద్ధ రంగంలోకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పంపించారని చెబుతున్నారు. 

అసలేంటీ బాంబు.. ఎందుకంత భయం?

రష్యా తయారు చేసిన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అసలు పేరు టీవోఎస్. దాంట్లోనే రష్యా మూడు వెర్షన్లను తయారు చేసుకుంది. టీవోఎస్–1 బురాటినో, టీవోఎస్ – 1ఏ సోల్న్ ట్సెపక్ (మండే సూర్యుడు), టీవోఎస్ 2 వెర్షన్లున్నాయి. ఈ బాంబులు ‘థర్మోబారిక్’ వర్గానికి చెందినవి. ఇప్పుడున్న సంప్రదాయ బాంబులతో పోలిస్తే ఈ థర్మోబారిక్ బాంబులు చాలా భిన్నమైనవి. 

సంప్రదాయ బాంబుల్లో 25 శాతం పేలుడు పదార్థం, అది మండి పేలేందుకు వీలుగా 75 శాతం ఆక్సిడైజర్లను వాడుతుంటారు. కానీ, ఈ థర్మోబారిక్ బాంబుల్లో మొత్తంగా పేలుడు పదార్థాలనే వినియోగిస్తారు. బాంబును ప్రయోగించాక టార్గెట్ ను చేరే క్రమంలో మన చుట్టూ ఉండే గాలిలోని ఆక్సిజన్ ను వాడుకుని టార్గెట్ కు అతి చేరువలో గాల్లోనే అది పేలుతుంది. 

తద్వారా ఊహకందని ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది. టార్గెట్ లో ఉన్నవారి ఎముకలు కూడా దొరకనంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. పేలిన చోట 300 మీటర్ల నుంచి 600 మీటర్ల దాకా దాని ప్రభావం ఏర్పడుతుంది. ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చేస్తుంది. ఏమీ లేని ఖాళీ (వాక్యూమ్)ను ఏర్పరుస్తుంది. అందుకే వీటిని ‘వాక్యూమ్ బాంబ్స్’ అని, ‘ఏరోసాల్ బాంబ్స్’ అని, ‘ఫ్యూయెల్ ఎయిర్ ఎక్స్ ప్లోజన్ (ఎఫ్ఏఈ) బాంబ్స్’ అనీ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. 

పేలినప్పుడు ఏర్పడే తీవ్రత ఒకెత్తయితే.. పేలాక దాని ప్రభావం మరో ఎత్తు. బాంబు పేలాక ఏర్పడే వేవ్స్ వల్ల దాని చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలోని జనాలపై పెను విధ్వంసమే అది సృష్టిస్తుంది. ఆ వేవ్స్ వల్ల కర్ణభేరి, ఊపిరితిత్తులు పగిలిపోతాయని, మెదడు కణజాలం దెబ్బతింటుందని, చూపు పోతుందని, లోపలి అవయవాలు ఛిద్రం అయి చిత్రవధ చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ బాంబులను అత్యంత ప్రమాదకరమైనవని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆక్షేపించాయి. వాటి వినియోగాన్ని నిషేధించాలని కోరాయి. ఇప్పుడు ఆ వెపన్ నే రష్యా తరలించడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. 

అమెరికా దగ్గర మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్

వాస్తవానికి ఒక్క రష్యానే కాదు.. శక్తిమంతమైన సైన్యాలున్న దేశాలు వాటిని తయారు చేసుకుంటున్నాయి. మొదటగా ఈ థర్మోబారిక్ బాంబులను రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగానే వెలుగులోకి తీసుకొచ్చారు. అమెరికా, జర్మనీ, రష్యా వంటి దేశాలు వాటిని సిద్ధం చేసుకున్నాయి. 

అమెరికా దగ్గర ఈ థర్మోబారిక్ బాంబుల చాలా రకాల వెర్షన్లున్నాయి. కానీ, వాటికి మించి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ను ఆ దేశం తయారు చేసుకుంది. జీబీయూ 43/బీగా పిలిచే ఆ బాంబును మ్యాసివ్ ఆర్డ్ నెన్స్ ఎయిర్ బ్లాస్ బాంబ్ అనీ పిలుస్తుంటారు. దాని బరువు 9,797 కిలోలు కాగా.. 11 టన్నుల టీఎన్టీ (ట్రైనైట్రో టోలీన్) బాంబులను పేలిస్తే వచ్చేంత తీవ్రతను అది వెలువరిస్తుంది. 150 నుంచి 300 మీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుంది. బాంబు తయారీ ఖర్చు 1.28 కోట్ల డాలర్లు. 

అమెరికా తయారు చేసిన ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కు రష్యా తయారు చేసిన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ రెండింతల శక్తిమంతమైనది. టీవోఎస్ బరువు 7,057 కిలోలుండే దీని తీవ్రత.. 44 టన్నుల టీఎన్టీని పేలిస్తే ఏర్పడేంత తీవ్రతకు సమానం. దీని వెర్షన్లను బట్టి ప్రభావ తీవ్రత 300 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకు ఉంటుంది. 

మన దగ్గర కూడా ఒక థర్మోబారిక్ బాంబ్ ఉంది. అయితే, అమెరికా, రష్యా దగ్గర ఉన్నవాటంత శక్తిమంతమైనది మాత్రం కాదు. ఎంబీటీ అర్జున్ కంబాట్ ట్యాంక్ లలో వాడేందుకు వీలుగా పెనట్రేషన్ కమ్ బ్లాస్ట్ (పీసీబీ), థర్మోబారిక్ (టీబీ) బాంబులను డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ)కు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఏఆర్డీఈ) రూపొందించింది. బంకర్లు, సిటీ యుద్ధ పరిస్థితులు, శత్రువులు దాక్కున్న బిల్డింగులను టార్గెట్ చేసుకుని పేల్చేసేలా వీటిని రూపొందించారు.

Human Resources- Allocation - Provisional allocation of posts & personnel in the restructured District / Division offices – Procedural GuidelineG .O.Ms.No.31 Dated: 26-02-2022

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు, పోస్టుల వర్గీకరణ, ఉద్యోగుల కేటాయింపు పై పూర్తి స్తాయి అధికారిక ఉత్తర్వులు G.O.Ms.No.31 Dated: 26-02-2022 విడుదల.

Click Here TO Download Go

DEPARTMENTAL TESTS: NOVEMBER 2021 SESSION (MAY 2021 SESSION CLUBBED) (Notification No.22/2021) scheduled to be held from 04.03.2022 to 09.03.2022

డిపార్ట్మెంటల్ పరీక్షల హల్ టికెట్స్ ని విడుదల చేయటం జరిగింది.

Download Hall Tickets

https://psc.ap.gov.in/(S(24a2gcbecx2gji0jxmitsjcm))/UI/CandidateLoginPages/LoginNew.aspx

Jagananna Gorumudda-Instructions on receiving of PM POSHAN / Jagananna Gorumudda rice from Fair Price Shops(FP Shop

Receiving of Rice from FP Shops Instructions : HM లు వేలి ముద్ర వేసి మాత్రమే బియ్యం తీసుకోవాలి.

మధ్యాహ్న భోజన పథకం కోసం బియ్యాన్ని ప్రధానోపాధ్యాయులు/ ఏజెన్సీ వారు వేలి ముద్ర వేసి మాత్రమే తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కొన్ని పాఠశాలలకు బియ్యం కేటాయింపు జరగకపోవడం గమనించారు. దీనికి కారణం ప్రధానోపాధ్యాయులు చౌక ధరల దుకాణం నుండి వేలిముద్ర వేయకుండా మాన్యువల్ గా బియ్యం తీసుకోవడం వలన ఈ ఇబ్బంది తలెత్తుతుందని గమనించారు. బియ్యం తీసుకునే విషయంలో ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నందువలన ప్రధానోపాధ్యాయులు ఎవరు మాన్యువల్ గా బియ్యం తీసుకోకూడదని సూచించారు. 

గతంలో ఇలా ప్రధానోపాధ్యాయులు మాన్యువల్ గా బియ్యం తీసుకోవడం వలన ఇబ్బందులు తలెత్తిన క్రమంలో రెండుసార్లు ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో సరి చేయడం జరిగింది.

ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ వారు బియ్యాన్ని మ్యాన్యువల్ గా తీసుకోవడం వలన బియ్యం లెక్కలు సరిపోకపోవడం మరియు అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కావున విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియపరచ వలసిందిగా ఆదేశించారు.

ప్రధానోపాధ్యాయులు గమనించవలసిన అంశాలు

ప్రతి నెల పాఠశాలకు కావలసిన బియ్యం వివరాలను ఐ ఎం ఎం ఎస్ యాప్ లో 15వ తేదీ నుండి 20వ తేదీ మధ్యలో నమోదు చేయవలెను.

ప్రధానోపాధ్యాయులు అందరూ విధిగా వేలి ముద్ర వేసి ప్రతి నెలా 1వ తేదీ నుండి 15వ తేదీ లోపు బియ్యం ను తీసుకోవాలి.

చౌక ధరల దుకాణం వివరాలు మార్చుకోవాలి అనుకుంటే, బియ్యం తీసుకున్న తర్వాత ప్రతి నెలా 20వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. 

ఈ ఆదేశాలను పాటిస్తూ ప్రతి నెలా బియ్యం తీసుకోవాలని, ఈ ఆదేశాలు పాటించని పక్షం లో ప్రధానోపాధ్యాయులను భాధ్యులు చేస్తూ ప్రధానోపాధ్యాయుల పై చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Meeting with secretariat department hod's for districts restructuring ,Cir.Memo.no.1653359/ Fin DT:24-02-2022

కొత్త జిల్లాల విభజన ప్రక్రియ. నూతన జిల్లాలు/ రెవెన్యూ డివిజన్ ల ఏర్పాటు తర్వాత ఉద్యోగుల/ అధికారులకేటాయింపు పై సచివాలయ, శాఖాధిపతులు అధికారుల సమావేశం

Click Here to download complete processing

Download IMMS App Latest version 1.3.7 24.02.2022

IMMS APP వెర్షన్ 1.3.7 కి 24.02.2022 న అప్డేట్ చేయబడినది.పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Click Here To Download Latest IMMS APP

New Features: 24.02.2022:
1. Miscellaneous tools details capture provision in HM login
2. Cleaning chemical phase 2 details capture provision in hm login
3. Gloves and mini brush details capture provision in MEO login


LEARN A WORD A DAY (రోజుకో పదం) 15.02.2022 నుండి 15.03.2022 వరకు తేదీ : 24.02.2022

 లెవెల్ - 1 (1,2 తరగతులు)

Leg : కాలు

లెవెల్ - 2 (3,4,5 తరగతులు)

Habit : అలవాటు

1). Learn good habits

2). My habit is reading

3). Tell me your habits

లెవెల్ - 3 (6,7,8 తరగతులు)

Ignore : నిర్లక్ష్యం చేయుట

1). He ignored his father's advice

2). Do not ignore the instructions to prevent Covid 19

3). He paid a penalty for ignoring the traffic rules

లెవెల్ - 4 (9,10 తరగతులు)

Familiar : బాగా తెలిసిన

1). Your voice is familiar to me

2). The thirsty crow is a familiar story

3). Gandhiji is quite too familiar

పీఆర్సీ నివేదిక బయటపెట్టరేం?జీతం రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం.అశుతోశ్‌ నివేదికను కోర్టు ముందుంచండి పీఆర్సీ జీవోలు పిటిషనర్‌కు ఇవ్వండి: హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

పీఆర్సీ విషయంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అశుతోశ్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. నివేదికను ఉద్యోగులకు ఇవ్వకుండా గోప్యత ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించింది. న్యాయస్థానానికి మాత్రమే నివేదికను అందజేస్తామని చెప్పేందుకు ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారం ఏమిటని ప్రశ్నించింది. పీఆర్సీ అమల్లో భాగంగా ఏ ఉద్యోగి నుంచైనా జీతం రికవరీ చేసినట్లు తేలితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటిషనర్‌కు అందజేయాలని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయడంతో పాటు అశుతోశ్‌ మిశ్రా ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. పీఆర్సీ విషయంలో జనవరి 17న ప్రభుత్వం జారీ చేసిన జీవో 1ని సవాల్‌ చేస్తూ ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ ఛైర్మన్‌ కె.వి.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం వేతన సవరణ ఉత్తర్వులు ఆధారంగా ఏ ఉద్యోగి జీతంలో రికవరీ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పి.రవితేజ వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్‌ దాఖలు చేయలేదన్నారు. అశుతోశ్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను, జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదన్నారు. దీనిపై ధర్మాసనం అడ్వకేట్‌ జనరల్‌ వివరణ కోరింది. ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ... ఉద్యోగుల జీతం నుంచి రికవరీ చేయడం లేదన్నారు. పీఆర్సీ నివేదికను కోర్టు ముందు ఉంచుతామని, దానిని పరిశీలించిన తరువాత పిటిషనర్‌కు ఇచ్చే విషయంలో ధర్మాసనం నిర్ణయం తీసుకోవచ్చన్నారు.

EMPLOYEES and PENSIONERS INCOME TAX SOFTWARE FOR FINANCIAL YEAR 2021-22

FINAL UPDATED (14-2-2022) WITH NEW PRC INCOME TAX SOFTWARE 2021-22 for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners prepared by K.S.NAIDU.

2021-22 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

Click Here To Download Income Tax Software 2021-22

➡ మీ మొబైల్ లో income tax software ను ఏవిధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియోను చూడండి.

https://youtu.be/SH6DHiiXlAQ

 కొత్త PRC ప్రకారం రెండు రకాల hra కూడా ఇవ్వడం జరిగింది అలాగే da కూడా మనకు ఎన్ని కావలిస్తే అన్ని చూపించే విధంగా కూడా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది

ఆదాయపు పన్ను శాఖ వారు అపీషియల్ గా మీ టాక్స్ బుల్ ఇన్కం పై ఎంత టాక్స్ పడుతుంది తెలుసుకోవడానికి ఒక లింకు ను ఇవ్వడము జరిగింది. 

Click Here To Download Income Tax Software 2020-21


ఉపాధ్యాయులు తమ యొక్క ఆదాయపన్ను ఫారం-16 నింపడానికి వీలుగా  వారి యొక్క వివరాలను నమోదు చేయడానికి వీలుగా ఒక MODEL application form ను PDF లో తయారు చేయడం జరిగింది.

Click here to Download Blank Form16 Proforma 

Click  Here To  Download for single application 

 మీ మొబైల్ లో income tax software  ఓపెన్ చేయడం కోసం WPS OFFICE  అనే app ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింకు క్రింద ఇస్తున్నాను.
👉 DOWNLOAD WPS CLICK HERE

Students Attendance – Marking of Student Attendance in the Mobile app mandated by Government


అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ని తప్పనిసరిచేస్తూ హాజరు నమోదు చేయని పాఠశాలలకు షోకాజ్ నోటీస్ జారీ చేయమని అధికారులకి ఉత్తర్వులు విడుదల.

Up gradation of existing one GHS/ZPHS into Senior Secondary Schools where there is no Junior College existing in those mandals – Identify and confrm the suitable High Schools

జూనియర్ కాలేజ్ లేని మండలం లో ఉన్న హై స్కూల్ ని సీనియర్ సెకండరీ స్కూల్ గ UPGRADE చేయుటకు ఉత్తర్వులు. Memo.No.75/A&I/2018 Dt:20/02/2022

5 రోజుల్లో జీతాల బిల్లులు చేయాల్సిందే.జనవరి నెల సస్పెన్స్‌ ఖాతా సర్దుబాట్లు.ఫిబ్రవరి నెల కొత్త జీతాల బిల్లులు.ఆలస్యమయితే ఫిబ్రవరి జీతాలు కష్టమే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు 2022 పీఆర్సీ ప్రకారం ఫిబ్రవరి జీతాలు సకాలంలో ఇవ్వాలంటే ఇప్పుడు డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు అధికారులకు, ఖజానా అధికారులకు పెద్ద పనే పడింది. 5రోజుల్లోనే రెండు నెలల బిల్లుల ప్రక్రియ పూర్తిచేయాలి. మొత్తం 4,96,875 మంది ఉద్యోగుల జనవరి జీతాలు 010 పద్దు కింద చెల్లించినట్లు డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంట్‌ అధికారులు ప్రక్రియను పూర్తిచేయాలి. తర్వాత కొత్త వేతన సవరణ ప్రకారం స్కేళ్లు తయారుచేసి అదనంగా చేర్చాల్సినవి, వారి జీతం నుంచి మినహాయించినవి తేల్చి, వాటిని ఖజానా అధికారులకు సమర్పించాలి. ఈ మొత్తం పని ఫిబ్రవరి 25లోపు.. అంటే 5రోజుల్లో పూర్తి చేయాలని ఆర్థికశాఖ అధికారులు ఉత్తర్వులిచ్చారు. సాధారణంగా జీతాల బిల్లులు నిర్దిష్ట గడువులోపు సమర్పించకపోతే అనుబంధ జీతాల బిల్లులు ప్రతి నెలా 5 తర్వాత సమర్పించేందుకు ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి జీతాలకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. మొత్తం జీతాల ప్రక్రియ రెండు నెలల పని రాబోయే 5 రోజుల్లో పూర్తిచేసి సమర్పించకపోతే ఫిబ్రవరి జీతాలు సకాలంలో అందుకోవడం కష్టమే అవుతుంది.

ప్రభుత్వం కొత్త పీఆర్సీని 2022 జనవరి నుంచి అమలు చేసింది. అప్పట్లో ఉద్యోగులు, డీడీవోల సహాయనిరాకరణ వల్ల కొత్త పీఆర్సీ జీతాల బిల్లులు సమర్పించలేదు. ప్రభుత్వం కచ్చితంగా జనవరి జీతాలు కొత్త వేతన సవరణ ప్రకారమే ఇవ్వాలనే పట్టుదలతో వ్యవహరించింది. దీంతో 24,496 మంది డీడీవోలు చేయాల్సిన పనిని ఒక ఖజానాశాఖ డైరక్టర్‌ చేసేలా ఆదేశాలిచ్చి జీతాల పద్దు నుంచి కాకుండా సస్పెన్స్‌ ఖాతా ద్వారా జనవరి జీతాలు చెల్లించింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోని డీడీవోలు వాస్తవంగా ఏ ఉద్యోగికి జనవరి జీతం ఎంత ఇవ్వాలో లెక్కకట్టాలి.

సస్పెన్సు ఖాతాకు డీడీవోలంతా జీతం హెడ్‌లను డెబిట్‌ చేసేలా సర్దుబాటు చేయాలి.

ప్రతి డీడీవో నుంచి సస్పెన్సు ఖాతా నుంచి డ్రా చేసిన మొత్తానికి సమానమైన మొత్తం బిల్లు జనరేట్‌ చేసి సంబంధిత సర్దుబాటు బిల్లు ట్రెజరీకి పంపితే అక్కడ సస్పెన్స్‌ ఖాతా సర్దుబాటు బిల్లులను ఆమోదిస్తారు.

దీంతోపాటు ఫిబ్రవరి జీతాల బిల్లులు తయారుచేసి ఖజానాలకు సమర్పించాలి.

ఉద్యోగుల వేతన స్థిరీకరణ కార్యక్రమం ఇంకా డీడీవోలు, ఖజానా అధికారులు, పే అండ్‌ అకౌంట్సు అధికారుల వద్ద డేటా ఎంట్రీ నమోదు, నిర్ధారణ ప్రక్రియ పూర్తిచేయలేదు. ఇదంతా ఎప్పటికి పూర్తవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

HRA Go, CCA Go, Additional Quantum Pension Go released

HRA G.O లోని ముఖ్యాంశాలు.

1.4.20 నుంచి 31.12.2021 వరకు HRA 8/16 శాతాలు మాత్రమే._ 

కొత్త HRA G.O అమలు 1.1.2022 నుంచి మాత్రమే_

G.O No 27 & 28 ల ప్రకారము నగర, పట్టణాలకు 8KM ల పరిధి వరకు వాటి HRA వర్తిస్తున్నందున..

RPS 2015 లో12% తీసుకొన్న వారందరికీ 10%HRA(Max11000)

HOD కార్యాలయాలకు 24% HRA

అన్ని జిల్లా కేంద్రాలు  మరియు నంద్యాల, ప్రొద్దుటూరు, విజయవాడ:  16% HRA

రెండు లక్షల జనాభా ఉన్న 54 నగరాలకు : 12% HRA

50 వెలు కన్నా తక్కువ జనాభా ఉన్న అన్ని ప్రాంతాలకు:  10% HRA

RPS 2015 లో 30%HRA తీసుకొన్నవారికి 24%HRA (Max 25000) ( Up toJun 2024) వరకు గరిష్ట పరిమితులకు లోబడి వర్తించును.

Click Here To Download HRA GO

Click Here To Download CCA GO

Click Here To Download SECRETARIAT HRA GO

Click Here To Download PENSION GO

ఈ Revised HRA Slabs (10%/12%/16%/24%) జనవరి 2022 నుండి మాత్రమే వర్తించును.

CCA GO 29 ప్రకారము RPS 2015 లో ఉన్న CCA రేట్లే యథాతథంగా వర్తించును

పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ (Quantum Pension )

70-74 Yrs =7%

75-79 Yrs =12%

మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Cir.Memo.No.1249673 Fin.Dept DT:20-02-2022- implementation of RPS 2022 - instructions for clearance of suspense account, pay confirmation and discrepancies in payment

RPS-2022 అమలు, జనవరి 2022 సస్పెన్స్ ఖాతా యొక్క క్లియరెన్స్, పే కన్ఫర్మేషన్, జనవరి జీతాలు చెల్లింపులలో వ్యత్యాసాలు సరిచేయుట, ఫిబ్రవరి 2022 జీతాల గురించి తాజా సూచనలతో ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ.

జనవరి 2022 జీతాలు సస్పెన్స్ ఖాతా నుంచి చెల్లించినందున DDO లు అందరూ ఆ అమౌంట్ ను రెగ్యులర్ హెడ్స్ నుండి సస్పెన్స్ హెడ్ కి అడ్జస్ట్మెంట్ బిల్ ట్రెజరికి సబ్మిట్ చేయాలి.

ఫిబ్రవరి జీతాలు ఆగితే మార్చి లో వాటి కొరకు సంప్లిమెంటరీ బిల్స్ ఈసారి ఎనేబుల్ చేయబడదు.

Click here to download proceedings

Housing Loans and IT sections

హౌజింగ్ లోన్స్-ఐటీ సెక్షన్స్

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీసుకునే  Housing Loans పై చెల్లించే వడ్డీ పై ఆదాయపు పన్ను మినహాయింపు. 

IT section 24 ప్రకారం Housing Loans పై చెల్లించే వడ్డీ పై రెండు లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది.

దీంతో పాటు మరో రెండు సెక్షన్స్ ప్రకారం కూడా Housing Loansపై చెల్లించే వడ్డీపై IT మినహాయింపు పొందవచ్చు. అయితే, వాటికి షరతులు వర్తిస్తాయి.

IT సెక్షన్ 88EE.

ఈ సెక్షన్ ప్రకారం Housing Loan Interest మరో యాభై వేల రూపాయల వరకు IT మినహాయింపు పొందవచ్చు. ఇది రూ. రెండు లక్షల వడ్డీ మినహాయింపునకు అదనం. కండిషన్స్.

Housing Loan తేదీ 1.4.2016 నుంచి 31.3.2017 మధ్య కాలంలో మాత్రమే పొంది ఉండాలి.

ఇంటి విలువ రూ. 50 లక్షలకు మించకూడదు.

భూమి విలువ రూ. 35 లక్షలకు మించకూడదు.

IT సెక్షన్ 80EEA

ఈ సెక్షన్ ప్రకారం... Housing Loan Interest మరో రూ. 1.50 లక్షల వరకు IT మినహాయింపు పొందవచ్చు. ఇది కూడా రూ. రెండు లక్షల వడ్డీ మినహాయింపునకు అదనం. కండిషన్స్.

Housing Loan తేదీ 1.4.2019 నుంచి 31.3.2020 మధ్య కాలంలో మాత్రమే పొంది ఉండాలి.

స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షలు వరకు మాత్రమే ఉండాలి. స్టాంప్ డ్యూటీ పరిమితిని కొంతమంది డీడీవోలు Loan గరిష్ట పరిమితి అనే తప్పుడు భావనతో ఉండి, లోన్ 45 లక్షల రూపాయలు మించితే IT సెక్షన్ 80EEA వర్తించదని చెప్తున్నట్టు తెలిసింది. కానీ, అలా చేయడం కరెక్ట్ కాదు. అది స్టాంప్ డ్యూటీ విలువ మాత్రమే. మామూలు భాషలో చెప్పాలంటే... రిజిస్ట్రేషన్ చార్జీలన్నమాట.

లోన్ ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ (Banks) నుంచి మాత్రమే పొంది ఉండాలి.

అస్సెస్సీ IT సెక్షన్ 80EE క్లెయిమ్ చేయకూడదు. అంటే, IT సెక్షన్ 80EE, 80EEAలో ఏదో ఒకటి మాత్రమే వర్తింపజేయాలి.

లోన్ శాంక్షన్ అయ్యే తేదీ నాటికి అస్సెస్సీ Residential House Property కలిగి ఉండకూడదు.

FA-3 Syllabus February 2022 For Classes 1 to 10 by SCERT AP

1 నుండి 10 వ తరగతి వరకు SCERT AP వారు విడుదల చేసిన FA 3 సిలబస్..

Click here to download syllabus

50వేల మందికి 2 గంటల్లో భోజనం.జగనన్న గోరుముద్దకు కేంద్రీకృత వంటశాల ప్రారంభం

గుంటూరు జిల్లాలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ ద్వారా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (జగనన్నగోరుముద్ద) సరఫరా చేయడానికి మంగళగిరి మండలం ఆత్మకూరులో నిర్మించిన అత్యాధునిక కేంద్రీకృత వంటశాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. రెండు గంటల్లోనే 50వేల మంది విద్యార్థులకు ఆహారం తయారుచేసే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి.

ఉదయం 10.45కు కేంద్రీకృత వంటశాల ప్రాంగణానికి సీఎం చేరుకున్నారు. గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, వెలంపల్లి శ్రీనివాస్‌, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. కేంద్రీకృత వంటశాల శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించి, స్విచ్‌ నొక్కి వంటశాలను ప్రారంభించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారిని దీవించారు. విద్యార్థులకు అందించే వంటకాలలో చిక్కీని రుచి చూశారు. ఆహారాన్ని విద్యార్థినులకు స్వయంగా వడ్డించి వారిని పలకరించారు. అనంతరం పాఠశాలలకు ఆహారాన్ని రవాణా చేసే వాహనాలను నేతలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరు బృందావన చంద్రోదయ మందిర్‌ ఛైర్మన్‌ మధు పండిట్‌దాస్‌, హరేకృష్ణ ఉద్యమం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు పలు అంశాలపై వినతులు అందించారు

Memo No.SS-15021/6/2022-SAMO-SSA, dt.17/02/2022- SIEMAT - Celebration of Matribhasha Diwas on 21st February, 2022- certain instructions


మాతృభాషా దినోత్సవ వేడుకలు అన్ని పాఠశాలలో నిర్వహించుటకు సూచనలతో ఉత్తర్వులు, 21.02.2022 నిర్వహించవలసిన కార్యక్రమములు, పోటీలు విడుదల చేసిన ఏపీ సమగ్ర శిక్ష

National Achievement survey guidelines Rc.No. ESE02/290/2021-SCERT, Date: 14/02/2022.

 నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే 2020 ఉత్తర్వులు.

NAS 2020 ఫారం I (School Heads / Principals పూరించాలి) మరియు ఫారం II (ఉపాధ్యాయులు పూరించాలి) లో ప్రశ్నాపత్రం సర్వే (బోధన మరియు బోధనేతర కార్యకలాపాలతో సహా వివిధ కార్యకలాపాలపై ఉపాధ్యాయులు వెచ్చించే సమయం పై సర్వే.

Click Here To Download proceedings

Learn a word a dayఅన్ని యాజమాన్య పాఠ శాల ల్లో రేపటి నుండి అనగా 15-02-2022 నుండి 15-03-2022 వరకు "learn a word a day" programme నిర్వహించాలి.

📌విద్యార్థుల స్థాయిని( తరగతిని) బట్టి 4 లెవెల్స్ గా విభజించాలి.

లెవెల్ 1 :1 నుండి 2 తరగతులు

 లెవెల్ 2 :3 నుండి 5 తరగతులు

 లెవెల్ 3 :6 నుండి 8 తరగతులు

 లెవెల్ 4 : 9 మరియు 10     తరగతులు

నిర్వహణ విధానం:

📌ఈ కార్యక్రమం 30 రోజుల పాటు నిర్వహించాలి.

📌ప్రతి రోజు  మొదటి పీరియడ్ లోఒక కొత్త ఆంగ్ల పదం పరిచయం చెయ్యాలి.

📌రెండవ పీరియడ్ లో పిల్లలచేత డిక్షనరీలో ఆ పదం యొక్క అర్థాన్ని వెతికించాలి.

గమనిక : లెవెల్ 1 విద్యార్థులకు  ఆ రెండవ పీరియడ్ ఉపాధ్యాయుడే పదం యొక్క అర్థాన్ని వివిధ  ఉదాహరణలతో, వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో వివరించాలి.

📌ఆంగ్ల ఉపాధ్యాయుడు తన పీరియడ్ లో పదాన్ని వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో వివరించాలి.

📌4 వ పీరియడ్ లో level specific activities క్రింది విధంగా నిర్వహించాలి.

 📌లెవెల్1:ఓరల్ డ్రిల్లింగ్

 📌లెవెల్ 2 :స్పెల్లింగ్ గేమ్

 📌లెవెల్ 3 :  విద్యార్థులు డిక్షనరీ సహాయంతో పదం యొక్క parts of speech కనుక్కోవాలి.

 📌*లెవెల్ 4 :విద్యార్థులు డిక్షనరీ సహాయంతో వ్యతిరేఖ పదాలు,సమాన అర్థ పదాలు వెతకాలి.

📌అదే పదం మిగిలిన అన్ని పీరియడ్ లలో repeat చెయ్యాలి.

📌ప్రతి రోజు ఒక పదాన్ని బోర్డ్ పై ఒక మూలలో వ్రాయాలి.వరండా లో, అసెంబ్లీ లో ప్రదర్శించాలి.

📌 అందరు టీచర్లు పదాన్ని,దాని అర్థాన్ని పీరియడ్ లో 5 నిమిషాలు పిల్లలచే ప్రాక్టీస్ చేయించాలి.

అయితే పదం యొక్క ఉపయోగిత మాత్రం ఆంగ్ల ఉపాధ్యాయుడు బోధించవచ్చు.

📌ఈ కార్యక్రమం కోసం విద్యార్థులు ప్రత్యేకంగా ఒక 100 పేజీల నోటు పుస్తకం పెట్టాలి.ఆ పుస్తకాన్ని ఉపాధ్యాయుడు తరచూ తనిఖీ చెయ్యాలి.

📌ప్రతి పక్షానికి (15 రోజులు), అంతవరకు నేర్పించిన పదాల పై "స్పెల్ బీ" నిర్వహించాలి.

📌ఇంటివద్ద పదాలను ప్రాక్టీస్ చేయమని ప్రోత్సహించాలి.

📌లెవెల్ వారీ ఏ రోజు ఏ పదం నేర్పాలో ప్రొసీడింగ్స్ లోని annexures1-4 లో ఇవ్వబడినది.

పాఠశాలల విలీనం కాకుండానే రికార్డుల మార్పు.హైస్కూళ్లకు పిల్లల జాబితాపంపించాలని ఆదేశాలు

ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు విలీనం కాకుండానే రిజిస్టర్లను అప్పగించాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. కాగితాల్లోనే మ్యాపింగ్‌, పిల్లల తరలింపు, రికార్డుల స్వాధీనం పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది 250 మీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. చాలా హైస్కూళ్లలో గదుల కొరత కారణంగా ప్రాథమిక బడుల్లోనే 3, 4, 5 తరగతులను నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేసేందుకు మ్యాపింగ్‌ చేశారు. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలకు చెందిన పూర్తి రికార్డులను ఈనెల 20లోపు హైస్కూళ్లలో అప్పగించాలని విద్యాశాఖ ఆదేశించింది. టీసీలు, రికార్డు షీట్లు, ప్రవేశాల రిజిస్టర్‌, ఇతర డాక్యుమెంట్లను అప్పగించాలంది. ఉన్నత పాఠశాలల్లో పాత రిజిస్టర్లలోనే వివరాలు నమోదు చేయాలని, విద్యార్థుల పేర్లను చైల్డ్‌ ఇన్ఫోలోకి మార్చేయాలంది. అంటే... పిల్లలు ప్రాథమిక బడుల్లో చదువుకుంటున్నా వీరి పేర్లు మాత్రం సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి వెళ్లిపోనున్నాయి.

ఫర్నిచర్‌ సర్దుబాటు ఎలా?

‘నాడు-నేడు’ కింద మొదటి విడతలో ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు వాటి నుంచి 3, 4, 5 తరగతులను హైస్కూళ్లకు తరలించడంతో డ్యుయల్‌ డెస్క్‌లు, టీవీలు, గ్రీన్‌ఛాక్‌పీస్‌ బోర్డులు వృథాగా మారుతున్నాయి. వీటిని ఉన్నత పాఠశాలలకు తరలించాలని ఆదేశించినా గదుల కొరత కారణంగా వినియోగించలేని పరిస్థితి. ప్రాథమిక పాఠశాలల్లో మిగిలే 1, 2 తరగతులతో అంగన్‌వాడీలను కలపనున్నారు. చిన్నపిల్లలు డ్యుయల్‌ డెస్క్‌లను వినియోగించ లేదనందున తరగతి గది కోసం వాటిని మూలకుపడేయాల్సి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కడప జిల్లాలో ఓ ఉన్నత పాఠశాలకు 11 ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులు వస్తున్నారు. వీరందర్నీ మూడు, నాలుగు గదుల్లో సర్దుబాటు చేస్తున్నారు. సంబంధిత రికార్డులను విడివిడిగా నిర్వహించడం కష్టంగా ఉందని, ఫర్నిచర్‌ సర్దుబాటులోనూ ఇబ్బందులు పడుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

Teacher information system TIS WORKING NOW

 పనిచేస్తున్న టీచర్ ఇన్ఫర్మేషన్ లాగిన్ సర్వీస్

▪️OTP Login సాంకేతిక సమస్యలు సరి చేయడం జరిగింది

▪️ ఉపాధ్యాయులు Teasury ID తో లాగిన్ అయ్యి వివరాలు Update చేసుకోవచ్చు.

https://studentinfo.ap.gov.in/EMS/

🎥 టీచర్ కార్డు ను PDF లోడౌన్లోడ్ చేసుకోవడం, వెబ్సైట్ లో ప్రొఫైల్ అప్డేట్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపించడం జరిగింది👇

https://youtu.be/IHehPIFx19c

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి

RC.No.ESE02-13/90/2021-EST 3-CSE Date:12/02/2022– Implementation of New Education Policy, 2020 –Mapping of School – maintenance of records – instructions

మెర్జ్ అయిన పాఠశాలలో3,4,5 తరగతులకి సంబంధించి అన్ని రికార్డ్స్ High School HM కి సబ్మిట్ చేయమని తాజా ఆదేశాలు

Updation of details of SGTs/ School Assistants and equivalent cadres working in the state in Teacher Information System. Rc.No. ESE02-13028/9/2021-EST 3-CSE date:12/02/2022

SGTs /SAల యెక్క వివరాలను 25.02.2022లోపు New TIS వెబ్ సైట్ నందు అప్ డేట్ చేయాలని, DDOలు 28.02.2022 లోపు కన్ఫర్మ్ చేయాలని DSE వారు తాజాగా  ఉత్తర్వులు విడుదల చేశారు.

🎥 టీచర్ కార్డు ను PDF లోడౌన్లోడ్ చేసుకోవడం, వెబ్సైట్ లో ప్రొఫైల్ అప్డేట్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపించడం జరిగింది

https://youtu.be/IHehPIFx19c

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి

Departmental Tests May 2020 Sessions Result in Us Formats (Departmental Udyoga Samacharam) for SR Entry EOT 141 Results with Names

డిపార్టుమెంటల్ మే 2020 సెషన్ పరీక్షల ఉత్తీర్ణతను S.R లో నమోదు కొరకు పేర్లను US ఫార్మాట్లో విడుదల చేసిన APPSC.

Click Here To Download Result List

ఆరంచెల స్కూలింగ్ ఇలా .

అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే ఉండే చోట వాటిలో ప్రీ ప్రైఆరంచెల స్కూలింగ్ ఇలా .మరీ -1 , ప్రీ ప్రైమరీ -2 ( పీపీ -1 , పీపీ -2 ) లను ప్రవేశపెట్టి వాటిని శాటిలైట్ ఫౌండేషనల్ స్కూళ్లుగా చేస్తోంది .

ప్రైమరీ పాఠశాలలున్న చోటవాటికి పీ -1 , పీపీ -2 లను అనుసంధా నించి 1 , 2 తరగతులతో ఫౌండేష నల్ స్కూళ్లుగా మారుస్తోంది .

3,4,5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లకు అనుసంధానించే వీలులేని చోట పీపీ -1 , పీపీ -2 లను , 1-5 తరగతులతో ప్రైమరీ స్కూళ్లను ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్లుగా మార్పు చేస్తోంది .

3 వ తరగతి నుంచి 7 / 8 వ తరగతి వరకు ప్రీ హైస్కూళ్లుగా మారుస్తోంది .

3,4,5 తరగతుల పిల్లలను అనుసంధానం చేయడం ద్వారా 3-10 వరకు హైస్కూళ్లుగా పరిగణిస్తోంది .

3-10వ తరగతితోపాటు ఇంటర్మీడియెట్ ( 11 , 12 తర గతులను ) కలిపి హైస్కూల్ ప్లస్ గా మార్పు చేస్తోంది

కొత్త జిల్లాలపై మార్చి ౩ వరకు సూచనలు తీసుకుంటాం. మార్చి ౩ వరకు జిల్లా కలెక్టర్లకు ఇవ్వొచ్చు.అన్నింటినీ పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు

మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఇస్తాం

ఏప్రిల్ 2 ఉగాది నుండి కొత్త జిల్లాల పాలన

మార్చి నెలలో అన్ని జిల్లాల్లో ఉద్యోగుల విభజన చేపడతాం

ఉద్యోగుల ప్రమోషన్లు, సర్వీస్ కి ఇబ్బందులు ఉండవు

వర్క్ టు సెర్వ్ కింద ఉద్యోగులను కేటాయిస్తాం

రెండు చోట్ల మాత్రమే ఉద్యోగుల జోనల్ సమస్యలు

కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లు నిర్మిస్తాం

ఎస్పీ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు

4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్లు

జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తాం

కేంద్రం అనుమతి జిల్లాల ఏర్పాటుకు అవసరం లేదు

జిల్లాలను ఏర్పాటు చేసి కేంద్రానికి పంపిస్తే నోటిఫై చేస్తుంది

ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్

పీఆర్సీ డిమాండ్ల సాధనకు ఐక్యవేదిక.21-24 వరకు పీఆర్సీపై అభిప్రాయాల సేకరణ.మార్చి 2, 3 తేదీల్లో రిలే నిరాహారదీక్షలు.ఫ్యాప్టో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలు

 పీఆర్సీకి న్యాయం చేయాలనే డిమాండుతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదికను ఏర్పాటుచేశారు. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి 34 ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి. పీఆర్సీలోని అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి,  ఐక్యవేదికను ఏర్పాటుచేశారు. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి చేసుకున్న ఒప్పందాలను వ్యతిరేకించారు. ఫిట్‌మెంట్‌ 27% కంటే ఎక్కువ ఇవ్వాలని, గ్రాట్యుటీని 2020 ఏప్రిల్‌ నుంచి అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు, ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండు చేశారు. పీఆర్సీ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి మార్చి 8వ తేదీ వరకూ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. పీఆర్సీపై ఉద్యోగుల అసంతృప్తిని తెలుసుకునేందుకు బ్యాలెట్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. మార్చి 2, 3 తేదీల్లో జిల్లా స్థాయి, 7, 8 తేదీల్లో రాష్ట్రస్థాయిలో రిలే దీక్షలు చేపట్టనున్నారు.

పెద్దఎత్తున ఉద్యమం

‘పీఆర్సీకి న్యాయం చేయాలనే డిమాండుతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఐక్యవేదిక ఉద్యమానికి ఏడుగురు పీడీఎఫ్‌, స్వతంత్ర ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. సీఎం జగన్‌ చర్చలకు పిలిచి, డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం. రాష్ట్రస్థాయిలో పెద్దఎత్తున నెలరోజులు ఉద్యమాన్ని నిర్వహించనున్నాం. సీపీఎస్‌పై రోడ్‌మ్యాప్‌ కాదు.. రద్దుచేయాలి. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. పోలీసు ఆంక్షలు, నిర్బంధం ఉన్నా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం. పదవీవిరమణ వయసు పెంపును రద్దు చేస్తే స్వాగతిస్తాం.’

- ఫ్యాప్టో అధ్యక్షుడు సుధీర్‌బాబు

ఫిట్‌మెంట్‌పై చర్చించకుండా సఫలం ఎలా?

‘మంత్రుల కమిటీ ఫిట్‌మెంట్‌పై చర్చించకుండానే చర్చలు సఫలమైనట్లు ప్రకటించింది. పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయాలు ఆమోదయోగ్యంగా లేవు. ప్రభుత్వంపై పీఆర్సీపై పునఃసమీక్షించే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఎన్ని ఆంక్షలు విధించినా ముందుకే వెళ్తాం.’

- ఫ్యాప్టో ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర

నిర్బంధంతో ఏం సాధిస్తారు

‘ఉపాధ్యాయ సంఘాల కార్యాలయాల వద్ద పోలీసులను మోహరించారు. నాయకులు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వస్తున్నారు. మాపై నిర్బంధం పెట్టి ఏం సాధిస్తారు? ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని గ్రహించినప్పుడు దాన్ని పరిష్కరించాలి. ప్రభుత్వం మాకు రాజకీయాలను అంటగట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలి.’

- యూటీఎఫ్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

ఆ ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు

‘కొందరు నాయకులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్‌దారులు వ్యతిరేకిస్తున్నారు. అశుతోష్‌ మిశ్ర నివేదికను బయటపెట్టాలి. సినిమా టికెట్లపై వాళ్లతో చర్చించిన ముఖ్యమంత్రి జగన్‌ 13 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై నేరుగా చర్చించలేదు. పీఆర్సీ డిమాండ్లు సాధించేవరకు ఐక్యవేదిక కొనసాగుతుంది.’

- ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు

వెనక్కి తగ్గేది లేదు

‘ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల హక్కులు సాధించే వరకూ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. ఇందులో వెనక్కి తగ్గేది లేదు.  సాధనసమితి అంగీకరించిన వాటిని 13లక్షల మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.’

- ఎమ్మెల్సీ రఘువర్మ

ఉద్యమ కార్యాచరణ ఇలా.

ఈ నెల 14, 15 తేదీల్లో ఐక్యవేదిక సభ్యులను చర్చలకు పిలవాలని సీఎం జగన్‌కు వినతి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యాచరణ నోటీసు సమర్పణ

 15 నుంచి 20 వరకు పీఆర్సీపై పునఃసమీ క్షించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంతకాల సేకరణ

 21-24 వరకు పీఆర్సీపై అభిప్రాయాల సేకరణ. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు పీఆర్సీపై వినతుల సమర్పణ

 25న చర్చలకు పిలవాలని ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ 

పి.ఆర్.సి సాధన కోసం ఏర్పడిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక.

కార్యాచరణ ప్రకటన

★ ఉపాధ్యాయ సంఘాలను పిలిచి పి.ఆర్.సి.పై ఉన్న ఇబ్బందులను చర్చించాలని ఫిబ్రవరి 14,15వ తేదీలలో ముఖ్యమంత్రి గారికి లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేయాలని,

★ 14వతేదీ ఉద్యమ కార్యాచరణ పై సియస్ గారికి నోటీస్ ఇవ్వాలని,

★ 15-20వరకు పి.ఆర్.సి పై ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఉద్యోగుల నుండి సంతకాల సేకరణ,

★ 21-24వరకు పి.ఆర్.సి సమస్యలపై బ్యాలెట్ నిర్వహణ,మరియు మంత్రులకు,ఎం.పి.లకు,ఎం.ఎల్.ఎ లకు విజ్ఞాపన పత్రాలు సమర్పణ,

★ 25న పి.ఆర్.సి సమస్యలపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ,

★ మార్చి 2,3తేదీలలో కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహారదీక్షలు,

★ మార్చి7,8తేదీలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి రిలే నిరాహారదీక్షలు (ఎం.ఎల్.సి లతో కలిపి)

Old PRC Pay and New PRC PAY GROSS amount with New HRA 8%,16%,24% New DA 20.02%

మీ పాత బేసిక్ పే ద్వారా జనవరి కొత్త బేసిక్ పే తెలుసుకొని HRA 8%,16%, 24% వారీగా కొత్త PRC బేసిక్ పే మరియు కొత్త DA తో ఎంత గ్రాస్ అమౌంట్ వస్తుందో, CPS కి ఎంత టేబుల్ రూపంలో చూపించడం జరిగింది.

Click Here To Download 8% HRA Table


Click Here To Download 16% HRA Table


Click Here To Download 24% HRA Table

TEACHERS PARTICULARS PROFORMA 2021-22 ( STATE GOVT,MPP/ZP,MUNICIPAL MGMTS)

 

Teachers particulars ప్రస్తుతం ప్రమోషన్ లో భాగంగా Google ఫామ్ లో ఉన్న విధంగా మన డిటైల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

https://forms.gle/XV5dYahBCrQ2jsZf8

Image size reducer website

ఎక్కువ సైజ్ ఉన్న IMGES ను మన మొబైల్ లోనే వాటి size తగ్గించడానికి క్రింది లింక్ ను ఓపెన్ చేసి ఫోటో సెలెక్ట్ చేసి ఇమేజ్ సైజ్ ను 1mb లోపు తగ్గించుకోవచ్చు.

https://www.reduceimages.com/

10th class and intermediate exam TIME TABLE April,May 2022

10వ తరగతి పరిక్షల షెడ్యూల్ ::

02.05.2022 :  ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – 1 మరియు కంపోజిట్ కోర్స్ 

04.05.2022 :  సెకండ్ లాంగ్వేజ్ 

05.05.2022 :  ఇంగ్లీష్

07.05.2022 :  మ్యాథమెటిక్స్ 

09.05.2022 :  ఫిజికల్ సైన్సు 

10.05.2022 :  బయోలాజికల్ సైన్సు 

11.05.2022 :  సోషల్ స్టడీస్ 

12.05.2022 :  ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – 2 మరియు కంపోజిట్ కోర్స్

13.05.2022 :  OSSC మెయిన్ లాంగ్వేజ్ ( సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్) #SSC

ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరిక్షల షెడ్యూల్::

08-04-2022  :  పార్ట్-II సెకండ్ లాంగ్వేజ్  పేపర్-1

09-04-2022  :  పార్ట్-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 

11-04-2022  :  పార్ట్-I ఇంగ్లీష్ పేపర్-1 

12-04-2022  :  పార్ట్ -I ఇంగ్లీష్ పేపర్-2

13-04-2022  :  పార్ట్-III మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-I 

16-04-2022  :  పార్ట్-III మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2

18-04-2022  :  మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జూవాలాజి పేపర్-1, హిస్టరీ పేపర్-1 

19-04-2022  :  మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జూవాలాజి పేపర్-2, హిస్టరీ పేపర్-2

20-04-2022  :  ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1,  

21-04-2022  :  ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2

22-04-2022  :  కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజి పేపర్-1,  ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1 

23-04-2022  :  కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజి పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2 

25-04-2022  :  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 ( బి.పి.సి విద్యార్థులకు)

26-04-2022  :  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-2 

( బి.పి.సి విద్యార్థులకు)

27-04-2022  :  మోడరన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1

28-04-2022  :  మోడరన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2

Sachivalayam employees has new dress code

సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్‌.

ప్రజల సౌకర్యార్థం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం డ్రెస్‌ కోడ్‌ అమలు చేయబోతుంది.  మొత్తం 19 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్‌లు మినహా మిగిలిన వారికి యూనిఫామ్‌ అందిస్తోంది. పురుష ఉద్యోగులు లైట్‌ బ్లూ కలర్‌ చొక్కా, క్రీమ్‌ కలర్‌ ప్యాంట్‌ ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మహిళా ఉద్యోగులకు లైట్‌ బ్లూ కలర్‌ టాప్, క్రీమ్‌ కలర్‌ పైజామా, క్రీమ్‌ కలర్‌ చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌ను యూనిఫామ్‌గా నిర్ణయించింది. ఒక్కొక్కరికి మూడు జతల కోసం 7.50 మీటర్ల చొక్కా క్లాత్, 4.05 మీటర్ల ప్యాంట్‌ క్లాత్‌ను.. మహిళ ఉద్యోగులకు టాప్‌ కోసం 7.50 మీటర్లు, పైజామాకు 7.25 మీటర్లు, చున్నీకి మరో 7.50 మీటర్ల క్లాత్‌ను పంపిణీ చేస్తున్నారు. మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్‌లు మినహా 1,00,104 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 95 వేల మందికి ఇప్పటికే యూనిఫామ్‌ వస్త్రాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ నెల 25వ తేదీకల్లా మిగిలిన వారికీ అందజేస్తామని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు తెలిపారు.

AP 10th class and intermediate exam shedule

Andhra Pradesh  టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలను మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు.

ఇంటర్మీడియట్ పరిక్షల షెడ్యూల్‌:

మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరిక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరిక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని తెలిపారు.

పదో తరగతి పరిక్షల షెడ్యూల్‌:

టెన్త్‌ పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరిక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని తెలిపారు.

DOWNLOAD IMMS APP LATEST VERSION 1.3.6 Dated 10 feb

IMMS App ఫిబ్రవరి 10 న 1.3.6 వెర్షన్ కి అప్డేట్ చేయడం జరిగింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేసుకోవల్సి ఉంటుంది. పాత యాప్ పనిచేయదు. కొత్త వెర్షన్ 1.3.6 ని క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

NEW VERSION FEATURES : 

PRC NEW BASIC PAY and OLD BASIC PAY DETAILS AND NEW HRA TABLE

మీ పాత బేసిక్ పే ద్వారా కొత్త బేసిక్ పే తెలుసుకొని HRA 10%,12%,16%, 24% వారీగా కొత్త PRC బేసిక్ పే మరియు కొత్త DA తో ఎంత గ్రాస్ అమౌంట్ వస్తుందో, CPS కి ఎంత టేబుల్ రూపంలో చూపించడం జరిగింది.

Click Here To Download 10% HRA Table


Click Here To Download 12% HRA Table


Click Here To Download 16% HRA Table


Click Here To Download 24% HRA Table

All the schools HMs who were submitted SWACHH VIDYALAYA PURASKAR application are need to fill this google form without fail.

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల వారు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు సంబంధించి వెబ్సైట్లో అప్లోడ్ చేసార లేదా అనే వివరాలను ఈ క్రింది గూగుల్ ఫారం లో సబ్మిట్ చేయాలి

https://forms.gle/8NCuEzTp7T7u4Rx19

విద్యా శాఖ లో త్వరలో భారీ మార్పులు

రాష్ట్రం లోని జిల్లా, డివిజన్, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు  ఉపాధ్యాయులకు

 3 వ తరగతి నుంచి ఉన్నత పాఠశాల లకు మ్యాపింగ్ చేయడం వలన రాబోయే అతి తక్కువ కాలం లో సుమారు ఈ సంవత్సరం జూన్ నెల లోపే దాదాపు 25 వేల కు పైగా SGT లకు స్కూల్ అసిస్టంట్లు గా పదోన్నతులు రాబోతున్నాయి .

2.     రాష్ట్రం లో కొత్తగా 840 కు పైగా కొత్త గా అ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యం లో జూనియర్ కళాశాల లు ఏర్పాటు అవుతాయి తద్వారా స్కూల్ అసి స్టంట్లు కు జూనియర్ లెక్చెరర్ స్థాయి ప్రమోషన్లు ,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ స్థాయి పదోన్నతులు లభిస్తాయి .(672 మండలాలు లో ప్రస్తుతం 4 1 మండలాల లో మహిళా కళాశాలలు మాత్రమె ఉన్నాయి ,202 మండలా ల లో అసలు కళాశాలలు లేవు అంటే కొత్తగా 202+202 = 404 , 672-41=631-202 =429 , మొత్తంగా సుమారు 833  కొత్త కళాశాల లు రానున్నాయి ).

3.     రాష్ట్రం లో మండల విద్యా శాఖ అధికారులకు కేవలం విద్యా శాఖ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా సెల్ఫ్ డ్రాయింగ్ అధికారాలు  ఏర్పాటు చేయనున్నాము . మండల వనరుల కేంద్రం పేరు ని మండల విద్యా శాఖ అధికారి కార్యాలయం గా మార్పు ( దశాబ్దాలుగా మండల విద్యా శాఖాధికారుల కోరిక )

4.     ఏ విధమైన విద్యేతర బాధ్యతలు అప్పగించకుండా కేవలం విద్యా సంబంధిత పనులు కేటాయించేలా  త్వరలో ఉత్తర్వులు రానున్నాయి

5.     మండల విద్యా శాఖ వ్యవస్థలో త్వరలో భారీ మార్పులు – ఇందులో భాగం గా మండల స్థాయి ఇద్దరు మండల విద్యా శాఖాధికారులు పోస్టులు, అదేవిధం గా డివిజన్ స్థాయి లో , జిల్లా స్థాయి లో పోస్టులు పెరగనున్నాయి.

BIOMETRIC DEVICES INFORMATION OF SCHOOLS.Enter THE STATUS OF BIOMETRIC DEVICE OF YOUR SCHOOL IN THE below LINK

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల వారు వారి యొక్క పాఠశాలలో ఉన్న బయోమెట్రిక్ డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ క్రింద ఇచ్చిన గూగుల్ ఫారం లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Please find the google link for updation of Biometric Devices status. The link shall be communicated to all field functionaries and get the list conformed at earliest.

 https://forms.gle/uJoRNGQ9UV6h7Hg88

Tracher information System (TIS) Updated Process and teacher card download

Teacher information system లో వివరాలు సరి చేసుకొనుటకు డిఫాల్ట్ పాస్వర్డ్ గా guest తో ఓపెన్ కానప్పుడు password మార్చుకొనుటకు ఓటీపీ లు వస్తున్నాయి.

https://studentinfo.ap.gov.in/EMS/ 

లింకు ద్వారా లాగిన్ అయి యూజర్ ఐడి గా మీ మీ tresury id ని నమోదు చేసి forgot పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కు ఓటిపి వస్తుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కొత్త పాస్వర్డ్ రీసెట్ చేసిన తరువాత మళ్ళీ లాగిన్ ఐతే మన TEACHER ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. వాటిని సరి చూసుకుని సబ్మిట్ చేయాలి.

టీచర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి మీ పాఠశాల యొక్క dise code మరియు సి ఎస్ సి పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వగలరు.

https://cse.ap.gov.in/DSE/officialLogin.do

Memo.No.ESE02-30/14/2021-EST3-CSE Date: 06/02/2022Academic and Administrative reforms – Utilization of premises of Primary Schools by Anganwadis where 3rd, 4th, 5th classes were mapped with the nearest High Schools


అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలు - 3వ, 4వ, 5వ తరగతులను సమీప ఉన్నత పాఠశాలలతో మ్యాప్ చేసిన ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాన్ని అంగన్‌వాడీలు వినియోగించుకోవాలని, duel desk లను ఉన్నత పాఠశాలలకు తరలించాలని ఉత్తర్వులు.

In continuation to the orders issued in the reference 1st read above, the

Director W&CWD has informed that in some of the schools where the

Anganwadis are proposed to be shifted, the dual desks are not moved and hence

they are not able to use them. All the Regional Joint Director of School

Education and the District Educational Officers in the state are requested to

move the dual desks of classes 3rd, 4th, 5th to those high schools where they are

being mapped and shifted as part of the school reforms. Wherever these dual

desks are surplus, the same may be moved to other schools of phase-I (where

they are in shortage) or to Phase-II schools to be taken up soon.

Memo No. 1632817/Prog.II/A2/2022 Dated.04.02.2022 ,Mana Badi Nadu Nedu – School Infrastructure Maintenance Funds- allocation and operational guidelines – orders

పాఠశాల నిర్వహణ నిధులు (స్కూల్ మెయంటనెన్స్ ఫండ్) వర్తింపు విధివిధానాలు వేటి కి ఖర్చు చేయాలి,స్కూల్ కు ఎంత మంజూరు కొత్త విధివిధానాలు, మార్గదర్శకాలు విడుదల

School Infrastructure Maintenance Fund SMF

నాడు-నేడు Phase 1 పాఠశాలల్లో రిపేర్లకు నిధులు విడుదల:

పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య ను బట్టి నిధులు

High Schools:

>1500: Rs. 75000

>1001<1500: Rs. 60000

>501<1000: Rs.40000

>201<500: Rs.20000

< 200: Rs.15000

Primary / UP Schools:

More than 200: Rs.15000

Less Than 200: Rs.10000

 ఇదే విధంగా అన్ని  పాఠశాలలకు సమగ్ర శిక్ష నిధులు విడుదల. ఒకే రిపేరు రెండు  సార్లు రాకూడదు

 Parents commitee లు ఖర్చు చేయాలి.



Swachh Vidyalaya Puraskar 2021-2022 (English) Swachh Bharat Swachh Vidyalaya (SBSV) Guideline (English),Annexure 1, Section A- Primary Information SVP 2021-22

స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ కి సంబంధించి పాఠశాలలు లాగిన్ అవ్వడానికి అవసరమైన వెబ్ సైట్ లింక్ను ఇవ్వడం జరిగింది.
అలాగే స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ మొబైల్ యాప్ కు సంబంధించిన లింకులు కింద ఇవ్వడం జరిగింది.

స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2021-2022 (ఇంగ్లీష్) స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విద్యాలయ (SBSV) మార్గదర్శకం (ఇంగ్లీష్), అనుబంధం 1, విభాగం A- ప్రాథమిక సమాచారం.

EHS New login Details For employees

EHS కు .ది1.8.2021 తర్వాత మెడికల్ రీ ఇంబర్స్ మెంట్ పై వైద్యము చేయించుకొని ప్రతి పాదనలు ఇంకా పంపుకోని వారు (రు50000 లోపు వారు ఆఫ్ లైన్లో జిల్లా ఆఫీసుకు, ఖర్చు రు 50000 పైన ఉన్నవారు Online లో EHS వెబ్సైట్ ద్వారా) పంపుకొనుటకు ప్రతిపాదనలు సిధ్ధం చేసికొనగలరు.

https://www.ehs.ap.gov.in/EHSAP/loginAction.do?actionFlag=checkLogin#

పీఆర్సీ జీవో అంశాలు.. తాజా మార్పులు ఇలా.

గత నెలలో పీఆర్సీ జీఓ ప్రకారం..

► 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు.. 

► 50 లక్షల జనాభా దాటితే : 24 శాతం

► 5 నుంచి 50 లక్షల జనాభా ఉంటే : 16 శాతం (సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో పనిచేసే వారికి ఇది వర్తింపు)

► 5 లక్షల జనాభా వరకు : 8 శాతం పెన్షనర్ల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ (కేంద్ర వేతన సవరణ ఆధారంగా..)

► 80 ఏళ్లు దాటిన వారికి : 20 శాతం

► 85 ఏళ్లు దాటితే : 30 శాతం

► 90 ఏళ్లు దాటితే : 40 శాతం

► 95 ఏళ్లు దాటితే : 50 శాతం

► 100 ఏళ్లు దాటితే : 100 శాతం

► సవరించిన పే స్కేల్స్‌ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి గ్రాట్యుటీ చెల్లింపు

► 2019 జూలై నుంచి 2021 డిసెంబర్‌ వరకు చెల్లించిన మధ్యంతర భృతిని డీఏ బకాయిల నుంచి సర్దుబాటు

► వేతన సవరణ కాల పరిమితి కేంద్ర వేతన సవరణ కమిషన్‌ ప్రకారం వర్తింపు 

► కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు.. ఉద్యోగాల క్రమబద్ధీకరణకు చర్యలు 

► ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు

► కార్యదర్శుల కమిటీ సిఫారసుల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీసీఏ అవసరంలేదని భావించి ఉపసంహరణ

► సీసీఏ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని నిర్ణయం

► మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌పై త్వరితగన నిర్ణయం

► ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణకు చర్యలు 

► గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను 2022 జూన్‌ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్‌ వర్తింపు 


తాజా చర్చల్లో ప్రభుత్వం ఆమోదించిన అంశాలు.. 

► గతంలో ప్రకటించిన విధంగా ఫిట్‌మెంట్‌ 23 శాతం కొనసాగింపు

మారిన హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు

► 50 వేలలోపు జనాభా ఉంటే : 10 శాతం, రూ.11 వేలు సీలింగ్‌

► 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే : 12 శాతం, రూ.13 వేలు సీలింగ్‌ 

► 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా : 16 శాతం, రూ.17 వేలు సీలింగ్‌ (13 జిల్లా కేంద్రాలకు ఇదే శ్లాబు వర్తింపు)

► 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే 24 శాతం, రూ.25 వేల సీలింగ్‌

► సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ (2022 జూలై నుంచి 2024 జూన్‌ వరకు)

రిటైర్డ్‌ ఉద్యోగుల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌..

► 70–74 ఏళ్ల వయసు వారికి : 7 శాతం

► 75–79 ఏళ్ల వయసు వారికి : 12 శాతం

► గ్రాట్యుటీ గతంలోలా కాకుండా 2022 జనవరి నుంచి అమలు

► 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు (9 నెలలు) ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని సర్దుబాటు చేయరు.

► వేతన సవరణ పరిమితి ఐదేళ్లు. కేంద్ర వేతన సవరణ కమిషన్‌ను రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేయరు. 

► ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు

► పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు 

► మారిన హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఈ ఏడాది జనవరి నుంచి అమలు. 

► ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల.

► సీపీఎస్‌ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీ ఏర్పాటు. 2022 మార్చికల్లా దీనిపై రోడ్‌ మ్యాప్‌ రూపకల్పన

► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు. ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగుల అంశం దీనిలోనే పరిశీలన

► మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల

► ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణకు చర్యలు 

► గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ 2022 జూన్‌ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్‌ వర్తింపు 

► పీఆర్సీ నివేదిక విడుదల అంశం పరిశీలిస్తాం

Gross Salary with HRA 10%,12%,16%,24% with New PAY and DA

HRA 10%,12%,16%, 24% వారీగా కొత్త PRC బేసిక్ పే మరియు కొత్త DA తో ఎంత గ్రాస్ అమౌంట్ వస్తుందో, CPS కి ఎంత టేబుల్ రూపంలో చూపించడం జరిగింది.

Click Here To Download 10% HRA Table

Click Here To Download 12% HRA Table

Click Here To Download 16% HRA Table

Click Here To Download 24% HRA Table

ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్‌

ఉద్యోగ సంఘాలతో సీఎం

►ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను

►ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు

►కాని ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశాం

►రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుంది

►రాజకీయాలకు తావు ఉండకూడదు

►ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్‌ కమిటీకూడా ఉంది

►ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు

►ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుంది

►ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చు

►ప్రభుత్వం అంటే ఉద్యోగులది

►అంత దూరం పోవాల్సిన అసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చు

►ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి

►నిన్న మంత్రుల కమిటీ నాతో టచ్‌లోనే ఉంది

►నా ఆమోదంతోనే వీటన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది

►ఐ.ఆర్‌. ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐ.ఆర్‌ను. సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400కోట్లు భారం పడుతోంది

►హెచ్‌.ఆర్‌.ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది

►అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్‌ వ్యయం రూపేణా హెచ్‌.ఆర్‌.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోంది.

►మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోంది. ఆర్థికంగా పడే భారం ఇది

►మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ వివరాలు చెప్తున్నాను

►రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా... మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం

►ఈ పరిస్థితులు ఈ మాదిరిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని

►దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి

►మినిమం టైం స్కేలు వర్తింపు చేశాం, అన్నిరకాలుగా ఆయా జీతాలు పెంచాం

►ఇలాంటి పరిస్థితుల్లో ఈ చర్చలు జరిగాయి

►మీరు లేకపోతే నేను లేను. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నాను. ఇది మీ వల్లే సాధ్యపడుతోంది

►భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే.. మీరు చెప్పుకోండి

►రాబోయే రోజుల్లో సీపీఎస్‌మీద గట్టిగా పనిచేస్తున్నాం

►అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పనిచేస్తున్నాం

►వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటాను

►ఇవాళ మీరు కొత్తపద్దతిలోతీసుకుంటున్న పెన్షన్‌ మంచిగా పెరిగేలా చూస్తాను

►ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్‌ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్‌ అయిన తర్వాత మీకు మంచి జరిగేలా ఆ దిశగా అడుగులు వేస్తున్నాం

►భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నాం

►అందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాను

►కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాను

►30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం

►సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం

►అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం

►ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం

►దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం

►24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోమీరు అడగకపోయినా మేం చేశాం

►అలాగే ఇళ్లస్థలాల విషయంలోకూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం

►ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం

►మీరు చెప్పేవి వినడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది

Opposed by Pandu sir aggreement on PRC

 చర్చలు.. ఒప్పందాలపై పాండురంగవరప్రసాద్ గారి (ప్రదానకార్యదర్శి. APTF) ఖండన



ఉమ్మడి మీడియా సమావేశాన్ని బాయ్‍కాట్ చేసిన ఉపాధ్యాయ సంఘం నేతలు

సమావేశంలో కనిపించని టీచర్ల సంఘం నేతలు సుధీర్‍బాబు, హృదయరాజ్ , కె ఎస్ ఏస్ ప్రసాద్ 

 కనీసం 27 శాతం ఫిట్‍మెంట్ కావాలని అడిగిన టీచర్ల సంఘం నేతలు - అంగీకరించని మంత్రుల కమిటీ - కనీసం సీఎంతో వర్చువల్ మీట్‍లో అయినా తమ అభ్యంతరాలు చెబుతామన్న టీచర్ల సంఘం నేతలు 

 సీఎంతో వర్చువల్ మీట్‍కు మంత్రుల కమిటీ ఒప్పుకోలేదు మేము కలిసి పనిచేస్తున్న జేఏసీలతో ఈ విషయంపై విడిపోయాం - అందుకే మీడియా సమావేశానికి హాజరుకాలేదు : టీచర్ల సంఘం

సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం: ఉద్యోగ సంఘాలు, ఒప్పందం యొక్క మినిట్స్

మంత్రుల కమిటీతో రెండ్రోజులపాటు సుదీర్ఘంగా చర్చించాం: ఉద్యోగ సంఘాలు


మాకు జరిగిన అన్యాయం గ్రహించి సానుకూలంగా చర్చించారు: ఉద్యోగ సంఘాలు

మంత్రుల కమిటీ ఎదుట అనేక డిమాండ్లు ఉంచి వివరంగా చర్చించాం: ఉద్యోగ సంఘాలు

సీఎం జగన్‌పై ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారు: ఉద్యోగ సంఘాలు

ఉద్యోగులు అడగకుండానే సీఎం అనేక ప్రయోజనాలు కల్పించారు: ఉద్యోగ సంఘాలు

మా చిన్న చిన్న మాటలను పట్టించుకోవద్దని సీఎంను కోరుతున్నాం: ఉద్యోగ సంఘాలు

ఐదు డీఏలు ఒకేసారి ఇచ్చి మాకు మేలు చేశారు: ఉద్యోగ సంఘాలు

మా డిమాండ్లు నెరవేర్చింనందుకు సీఎంకు కృతజ్ఞతలు: ఉద్యోగ సంఘాలు

సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం: ఉద్యోగ సంఘాలు

Ministers comitte and struggle comitte discussion on PRC

సానుకూలంగా లేని చర్చలు                    

ఈరోజు ప్రతిపాదనలు.  

1)ఫిట్ మెంట్: 

మార్పులేదు. 

వాదన:30% ఇవ్వాలి    

2)HRA 50వేల వరకు 8%

50వేలు- 2లక్షలు 9.5%

2-5లక్షలు 13.5%

5-10 లక్షలు 16%

10-25లక్షలు 16%

వాదన:అశుతోశ్ మిశ్రా ప్రతిపాదనలు మేరకు, లేదా కనీసం తెలంగాణ రాష్ట్ర హెచ్.ఆర్.ఏ రేట్లు ఇవ్వాలి

3)సిసిఏ: రద్దు

వాదన: కొనసాగించాలి

4)5 సం౹౹ల పీఆర్సీ: Ok

5)ఐ.ఆర్ రికవరీ: ఉండదు

6)అదనపు క్వాంటం పెన్షన్: 70-5%, 75-10%

వాదన:70-10%,75-15% కొనసాగించాలి.

7)గ్రాట్యుటీ: 1.4.2021 నుండి అమలు

వాదన: 1.4.2020 నుండి అమలు చేయాలి.

8)మెడికల్ రీయింబర్స్మెంట్: 31.7.2022 వరకు పొడిగించాలి.

9)అంత్యక్రియల ఖర్చు: 20,000/- 25,000/-లకు పెంపు

10)పీఆర్సీ నివేదిక: అందించడానికి అంగీకారం

11)అరియర్ బిల్లుల చెల్లింపు: మార్చి ఆఖరికి పూర్తి చేయాలి.

12)గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్: శాఖాపరమైన పరీక్షలు పాసైన వారందరికీ 2.10.21 నుండి వర్తింపచేసి 2022 పీఆర్సీ అమలు చేయాలి.      

 ప్రభుత్వ ప్రతిపాదనలు వ్యతిరేకించడం జరిగింది. 

 సమ్మె వాయిదా వేయాలని మరోసారి చర్చించుకుందామని ప్రతిపాదించగా సమ్మె వాయిదా ప్రతిపాదన వ్యతిరేకించడం జరిగింది

Minister comitte recomendations for HRA

హెచ్‌ఆర్‌ఏ పై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు.

50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్‌తో 8 శాతం2 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్‌తో 9.5 శాతం5 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.12 వేల సీలింగ్‌తో 13.5 శాతం10 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.15 వేల సీలింగ్‌తో 16 శాతం25 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.20 వేల సీలింగ్‌తో 16 శాతంసచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్‌తో 24 శాతం

మరోవైపు ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో ఫిట్​మెంట్​పై మంత్రుల కమిటీ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. ఫిట్‌మెంట్‌ 23 శాతమే ఇస్తామని తేల్చి చెప్పింది. ఐఆర్ రికవరీ చేయబోమని మరోమారు స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు మంత్రుల కమిటీ సుముఖతను వ్యక్తం చేసింది.

ఐఆర్‌ రికవరీ ఉండదు.ఐదేళ్లకు ఒకసారి పీఆర్‌సీ.ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల కమిటీ హామీ.అర్ధరాత్రి ఒంటి గంట వరకు చర్చలు

హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ తదితర అంశాలపై రాని స్పష్టత.మంత్రుల కమిటీ నుంచి కొన్ని ప్రతిపాదనలు.డిమాండ్లను పునరుద్ఘాటించిన ఉద్యోగ సంఘాలు.నేడు మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయం.అనంతరం అవసరమైతే సీఎంతోనూ సమావేశం

పీఆర్‌సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు చర్చలు కొనసాగాయి. ఐఆర్‌ రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ లభించింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దు వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగినా... మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ ఏదీ లభించలేదు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లపై ఉద్యోగుల డిమాండ్‌లు, వాటిని నెరవేరిస్తే ప్రభుత్వంపై పడే భారం వంటి అంశాలపై శనివారం 10 గంటలకు మంత్రుల కమిటీ, ఆర్థికశాఖ అధికారులు భేటీ కానున్నారు. అనంతరం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ మరోసారి సమావేశమవనుంది. అవసరమైతే ఆ సమావేశం అనంతరం.... ముఖ్యమంత్రి జగన్‌తోనూ ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) శ్లాబ్‌లలో మార్పులు, పింఛనుదారులకు అదనపు క్వాంటం పింఛను వంటి అంశాలపై కొన్ని ప్రతిపాదనల్ని ఉద్యోగ సంఘాల నేతల ముందు ఉంచినట్టు తెలిసింది. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తమ డిమాండ్లను పునరుద్ఘాటించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, శనివారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు తెలిపారు. చాలా అంశాలపై ఇంకా స్పష్టత రానందున, చర్చలు ఇంకా కొనసాగుతున్నందున... శనివారం తాము ముందే ప్రకటించినట్టుగా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.

సీఎం ఆదేశాలతో హుటాహుటిన కదిలిన మంత్రులు

చలో విజయవాడకు వేల సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలిరావడం, నిరసన విజయవంతం కావడంతో తదుపరి కార్యాచరణకు ఉద్యోగసంఘాలు నడుంకట్టాయి. పీఆర్సీ సాధన సమితి నాయకులు శుక్రవారం సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ముందే నిర్ణయించుకున్నట్టుగా పోరాటం ఉద్ధృతం చేయాలని, శనివారం నుంచి పెన్‌డౌన్‌, యాప్‌డౌన్‌ చేయాలని, ఆరోతేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. శనివారం సెలవు కావడంతో... రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు శుక్రవారమే పెన్‌డౌన్‌ చేసి, కంప్యూటర్లు కట్టేశారు. దీంతో.. వారితో మరోసారి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్‌ శుక్రవారం మధ్యాహ్నం డీజీపీతో సమావేశమయ్యారు. చలో విజయవాడపై ఆయన ఆరా తీసినట్టు సమాచారం. అనంతరం.. ఉద్యోగులతో మొదటి నుంచీ చర్చిస్తున్న మంత్రుల కమిటీతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) శ్లాబుల వంటి అంశాల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించడం ద్వారా ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా నివారించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఉద్యోగసంఘాల నాయకుల్ని చర్చలకు పిలవాలని, ప్రభుత్వ ప్రతిపాదనల్ని వారికి తెలియజేసి, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని మంత్రుల కమిటీని సీఎం ఆదేశించారు. దాంతో సాయంత్రం 6.30 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌లో చర్చలకు రావాలని పీఆర్సీ సాధన సమితి నాయకులకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సందేశాలు పంపించారు. మంత్రులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులంతా చేరుకున్నారు. మొదట వారితో సీఎస్‌ సమీర్‌శర్మ కాసేపు చర్చించారు. తమ డిమాండ్లేంటో ఇప్పటికే స్పష్టం చేశామని, వాటిపై నిర్దిష్టమైన హామీ లభిస్తేనే చర్చలకు వస్తామని నాయకులు పేర్కొన్నారు. మంత్రుల కమిటీ కొన్ని ప్రతిపాదనలతో వచ్చిందని చెప్పి, వారిని చర్చలకు ఒప్పించారు. సమావేశంలో పీఆర్సీ సాధన సమితి నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మట్టి ఖర్చులకు రూ. 25వేలు

కీలకమైన హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల అంశంలో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకుల ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్టు తెలిసింది. తెలంగాణ తరహాలో హెచ్‌ఆర్‌ఏ విధానం చర్చలకు వచ్చినట్టు సమాచారం. చనిపోయిన ఉద్యోగులకు మట్టి ఖర్చులు కింద రూ.25 వేలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది.

మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘాల డిమాండ్లు

 పీఆర్సీ నివేదిక బయటపెట్టాలి.

30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి.

 కనీసం 27%కు తగ్గకుండా ఇవ్వాలి.

హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లు పాతవే కొనసాగించాలి.

 సీసీఏ కొనసాగించాలి.

 పింఛనర్లకు 70 ఏళ్లు దాటాక 10%, 75 ఏళ్లు దాటాక 15% అదనపు క్వాంటం వర్తింపజేయాలి.

 కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్‌సీ ప్రకారం పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.

 పొరుగు సేవల ఉద్యోగులకు మినిమమ్‌ టైం స్కేల్‌ ఇవ్వాలి.

 గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు నుంచి రెగ్యులర్‌ స్కేల్‌ ఇవ్వాలి. 2022 పీఆర్సీ స్కేలు అమలుచేయాలి.

మార్చి 31 లోగా సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోవాలి.

కేంద్ర పీఆర్సీ మాకు సమ్మతం కాదు. రాష్ట్ర పీఆర్సీనే కొనసాగించాలి.

ఉద్యోగుల అసంతృప్తి చాలా వరకు తొలగిపోయింది: సజ్జల

‘‘సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. చర్చల ద్వారా వారి అసంతృప్తి చాలా వరకు తొలగిపోయింది. శనివారం మళ్లీ సమావేశమవుతాం. ఐఆర్‌ సర్దుబాటు చేయబోమని చెప్పాం. ఐదేళ్లకు ఒకసారి పీఆర్‌సీ వేస్తాం.

చాలా వరకు సానుకూలత తీసుకొచ్చాం: బొత్స

‘‘ప్రస్తుత చర్చల్లో చాలా వరకు సానుకూలత తీసుకువచ్చాం. శనివారం పరిష్కారం అవుతుందని మేం ఆశాజనకంగా ఉన్నాం. సహాయ నిరాకరణ విరమించుకోమని కోరాం’’

చర్చలు కొలిక్కి వచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది: బండి శ్రీనివాసరావు

‘‘చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సామాన్య ఉద్యోగికి అన్యాయం జరగకుండా చర్చలు జరిపాం. నష్ట నివారణను నియంత్రించేందుకు ప్రయత్నిస్తామని మంత్రుల కమిటీ చెప్పింది. చర్చలు జరుగుతున్నందున ఉద్యమకార్యాచరణ కొనసాగుతుంది’’

కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు.సచివాలయానికి బయలుదేరిన మంత్రులు బొత్స, బుగ్గన, సజ్జల గారు

కాసేపట్లో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం

సచివాలయంలో మంత్రులతో భేటీకానున్న ఉద్యోగ సంఘాలు

రేపట్నుంచి ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో చర్చలు

చలో విజయవాడ సక్సెస్‌ కావడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా

సీఎంను కలిసి పరిస్థితిని వివరించిన మంత్రులు

సమ్మె జరిగితే ప్రభావం తీవ్రంగా ఉంటుందని వివరించిన మంత్రులు

సీఎంను కలిశాక పీఆర్సీ సాధన సమితికి చర్చలకు రావాలని ఆహ్వానం

ఉద్యోగులతో మాట్లాడి సమ్మె విరమింపజేయాలని తెలిపిన సీఎం

PRC steering committee press meet

పిఆర్సి సాధన సమితి ప్రెస్ మీట్ లైవ్ ప్రోగ్రాం




Know your CFMS ID using treasury ID for all employees and pensioners

 ఉద్యోగులు ఉపాధ్యాయులు వారి యొక్క ట్రెజరీ ఐడి నెంబర్ తో  direct గా CFMS ID  నెంబర్ ను తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
 మీరు ఈ లింకును క్లిక్ చేయగానే బాక్స్ లో మీ యొక్క ట్రెజరీ ఐడి నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ట్రెజర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క CFMS ID NUMBER  డిస్ప్లే అవుతుంది.
Click here to know your CFMS I'D NO

Swatcha vidyalaya puraskar for 2021-22 live orientation programme on diksha

స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2021-22  పై ఓరియం టేషన్ గైడ్లైన్స్ మరియు  జాతీయ అవార్డ్ కొరకుపాఠ శాలల రిజిస్ట్రేషన్  మొదలైన వివరాలకై క్రింది లింక్ పై క్లిక్ చేసి  లైవ్ ఓరియంటేషన్  దీక్షా యాప్ లో హాజరు కాగలరు.

 తేదీ మరియు సమయం:

 04-02-22 at 02.00 PM to 03-00 PM.

 https://diksha.gov.in/play/content/do_3134667313593876481703  

 


జూన్‌ నుంచి నూతన విద్యావిధానం.తరగతుల విలీనమే.. బడుల మూత ఉండదు 22వేలమంది ఎస్జీటీలకు పదోన్నతులు. విద్యాశాఖఫై సీఎం సమీక్ష

ఇక ఎంఈవోలకే డ్రాయింగ్‌ అధికారాలు8,9,10 తరగతులకు డిజిటల్‌ పాఠాలుఈనెల 15నుంచి  నాడు-నేడు రెండో విడతటీచర్లకు తప్పిన యాప్‌ల బెడద!.. 

అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): జూన్‌ నుంచి నూతన విద్యావిధానం అమల్లోకి తేవాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం తాడేపల్లి కాంపు కార్యాలయంలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా నూతన విద్యావిధానం అమలుపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. నూతన విద్యావిధానంలో తరగతుల విలీనమే కానీ, బడుల మూత ఉండదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న పాఠశాలల వల్ల 22వేలమంది ఎస్‌జీటీలకు పదోన్నతులు వస్తాయని.. వీరందరికీ స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులివ్వాలని ఆదేశించారు.

సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండాలన్నారు. విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో హాజరు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలోని రెండు హైస్కూళ్లలో రెండు జూనియర్‌ కళాశాలలుగా ఏర్పాటు చేయాలని.. ఒకటి కో ఎడ్యుకేషన్‌కు, ఒకటి బాలికలకు ఉండాలని సూచించారు. మరోవైపు ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫారసులన్నీ అమల్లోకి రావాలన్నారు. మండల రిసోర్స్‌ సెంటర్‌ను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చాలని నిర్ణయించారు. ఎండీవో పరిధిలో కాకుండా ఇక నేరుగా ఎంఈవోకే డ్రాయింగ్‌ అధికారాలు, విద్యాశాఖ కార్యకలాపాలు అప్పగించాలన్నారు. ఈ నెల 15నుంచి నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభించాలన్నారు. నాడు-నేడు రెండో విడత పనులను సెప్టెంబరు నాటికల్లా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులకు పలు రకాల యాప్స్‌ కంటే.. రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫారసులు అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచించారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించొద్దని, ప్రధానోపాధ్యాయులతో అనేక సమావేశాలు కాకుండా సమన్వయం కోసం నెలకు ఒకే ఒక సమావేశం ఏర్పాటుచేయాలన్న సిఫారసులకు సీఎం ఆమోదం తెలిపారు. నూతన విద్యావిధానంలో మూడు కిలోమీటర్ల లోపే హైస్కూల్‌ ఉండేలా మ్యాపింగ్‌ చేస్తున్నామని అధికారులు వివరించారు.  మరుగుదొడ్లు, గోరుముద్దపై టోల్‌ఫ్రీ నంబర్‌నాడు-నేడులో.. ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. జగనన్న విద్యాకానుక, మరుగుదొడ్ల నిర్వహణ, జగనన్న గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే తెలిపేందుకు టోల్‌ఫ్రీ నంబరు 14417ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు డిక్షనరీ ఇవ్వాలని, రోజుకో కొత్త పదం నేర్పించాలన్నారు. 8,9,10తరగతుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌  ప్రవేశపెట్టాలని, దీన్ని ఒక సబ్జెక్టుగా పెట్టే ఆలోచన చేయాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, సీఎస్‌ సమీర్‌శర్మ, పాఠశాల విద్య స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్‌.అనూరాధ పాల్గొన్నారు.

వేలగొంతులు ఒక్కటై. పిక్కటిల్లిన ఉద్యోగ గర్జన. పోలీసు నిర్బంధాల్ని ఛేదించిఅడ్డంకుల్ని అధిగమించి.ఒక్కొక్కరిగా మొదలై.. ఉప్పెనలా తరలివచ్చిన ఉద్యోగులు

జనసంద్రమైన విజయవాడ

నాలుగు కి.మీ. మేర ఎటు చూసినా వారే .నిర్బంధాల్ని ఛేదించి.. నిలువరింతల్ని దాటి.. అడ్డంకుల్ని అధిగమించి.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉప్పెనలా తరలివచ్చారు. చినుకు చినుకు కలిసి కుంభవృష్టిగా మారినట్లు.. ఒక్కొక్కరిగా మొదలై వందలు, వేల సంఖ్యలో పోటెత్తారు. ప్రభుత్వం హెచ్చరించేకొద్దీ.. పోలీసులు నిలువరించేకొద్దీ.. రెట్టించిన పోరాట స్ఫూర్తితో దూసుకొచ్చారు. తమ ఉద్యమ ఆకాంక్షను అణగదొక్కలేరని నిరూపిస్తూ జనసంద్రమై ఎగిశారు. సమూహశక్తిని, పోరాట స్ఫూర్తిని ప్రభుత్వానికి చాటిచెబుతూ ఉద్యమాల పురిటిగడ్డ బెజవాడకు వెల్లువెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాలు గురువారం నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న బీఆర్టీఎస్‌ రహదారి మొత్తం వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులతో కిక్కిరిసిపోయింది. లక్ష మందికి పైగా ఉద్యోగులు తరలివచ్చారని నాయకులు ప్రకటించారు. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకూ విజయవాడలోని బీఆర్టీఎస్‌ ఉద్యమ నినాదాలతో హోరెత్తింది. ‘మాయదారి పీఆర్సీ మాకొద్దు.. రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు. చీకటి పీఆర్సీ జీవోలు రద్దు చేయాలి’ అంటూ ఉద్యోగుల గర్జనతో అట్టుడికింది.

పీఆర్సీ సాధన సమితి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జెండాలు చేతబూనిన ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం కదం తొక్కింది. వేతనాలు తగ్గించి ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతోందంటూ మండిపడింది. ఉద్యమ గేయాలు, గీతాలు ఆలపిస్తూ ప్రభుత్వ తీరుపై గళమెత్తింది. వినూత్న రీతిలో ప్రదర్శనలతో నిరసన తెలిపింది. ప్రసంగాలతో ఉద్యమ స్ఫూర్తి నింపింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే.. సమ్మెతో సత్తా చాటుతామని పునరుద్ఘాటించింది.  

అడ్డంకుల్ని అధిగమించి చేరుకున్నారిలా.

జిల్లాలు, మండలాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులను పోలీసులు గృహనిర్బంధం చేసినా కొంతమంది ఎలాగోలా తప్పించుకుని విజయవాడకు చేరుకున్నారు. ఇంకొందరైతే రెండు, మూడు రోజుల ముందే ఇక్కడికి వచ్చేశారు. రైళ్లు, బస్సుల్లో అణువణువూ పోలీసులు తనిఖీలు చేస్తుంటే వారికి చిక్కకుండా ఉండేందుకు రోగులు, కూలీలు, భక్తుల మాదిరి మారువేషాలు వేసుకుని మరీ పలువురు చేరుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బెజవాడ వైపు వచ్చే అన్ని మార్గాల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అడుగడుగునా అడ్డగిస్తే వాటిని దాటుకుంటూ వేల మంది గమ్యస్థానం వైపు కదిలారు. ఇక్కడికి చేరిన తర్వాత నగరంలోని హోటళ్లలో తలదాచుకుంటే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో పరిచయస్తులు, బంధుమిత్రుల ఇళ్లలో కొంతమంది బస చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం ఉదయం విజయవాడకు చేరుకున్నవారు, నగరంలో బృందాలుగా తిరుగుతున్న ఉద్యోగుల్ని ఉదయం 9.30 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప స్టేషన్లకు తరలించారు. అయినా మిగతావారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగారు. ఇలా ప్రతి ఒక్కరూ ఎలాగైనా సరే ‘చలో విజయవాడ’లో పాల్గొనటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు.

పుట్ట పగిలి బయటకొచ్చిన చీమలదండులా.

చలో విజయవాడను అడ్డుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని గుర్తించిన ఉద్యోగులు.. తాము బృందాలుగా ఉంటే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ఎవరికివారు విడిపోయి, ప్రజల్లో కలిసిపోయారు. గురువారం ఉదయం 8.30- 9 గంటల వరకూ ప్రధాన కూడళ్లలో ఒంటరిగా తిరిగారు. చలో విజయవాడ కార్యక్రమానికి సమయం ఆసన్నమయ్యేసరికి ఉదయం 9.30 గంటలకంతా ఎక్కడెక్కడో ఉన్నవారంతా పుట్టల్లో నుంచి చీమల దండు వచ్చినట్లు ఒక్కసారిగా వీధులు, సందులు, కూడళ్లు, వివిధ భవనాల్లో నుంచి బయటకొచ్చారు. క్షణాల్లో వేల మంది సంఘటితమయ్యారు. అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌ నుంచి కొన్ని బృందాలు, ఇతర ప్రాంతాల నుంచి మరికొన్ని బృందాలు బీఆర్టీఎస్‌ రోడ్డు వైపు ప్రదర్శనగా బయల్దేరాయి. బీఆర్టీఎస్‌ రోడ్డులోని మీసాల రాజేశ్వరరావు వంతెన వద్దకు చేరుకునేసరికి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వేల మంది ఉద్యోగులు జనసంద్రాన్ని తలపించారు. ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని చూసిన పోలీసులు.. వారిని అడ్డుకుంటే మరింత ఇబ్బంది అవుతుందేమోనన్న ఉద్దేశంతో వదిలేశారు. దీంతో బీఆర్టీఎస్‌ రోడ్డులోని పడవలరేవు కూడలి వరకూ దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు కాలినడకన ప్రదర్శనగా తరలివెళ్లారు. పీఆర్సీ సాధన సమితి జెండాలు చేతబట్టి ఉద్యమ నినాదాలతో హోరెత్తించారు. పడవలరేవు కూడలి సమీపానికి చేరుకున్న తర్వాత అంతా బీఆర్టీఎస్‌ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఆ సమయంలో మొత్తం బీఆర్టీఎస్‌ రహదారి నాలుగు కిలోమీటర్లు ఉద్యోగ, ఉపాధ్యాయులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 10 గంటలకంతా బీఆర్టీఎస్‌ రోడ్డుతోపాటు దాన్ని ఆనుకుని ఉన్న సందులు, వీధుల్లో ఎటు చూసినా ఉద్యోగులు, ఉపాధ్యాయులే కనిపించారు. కొందరైతే సమీపంలోని భవనాలపైకి ఎక్కి వాటిని సెల్‌ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు.

వాహనమే వేదికగా ప్రసంగాలు

దాదాపు లక్ష మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు బీఆర్టీఎస్‌ రోడ్డుపైకి చేరుకుని అక్కడ బైఠాయించిన తర్వాత 11.30 గంటల సమయంలో పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.వెంకట్రామిరెడ్డి, కె.సూర్యనారాయణ, సుధీర్‌బాబు, హృదయరాజు తదితరులు ర్యాలీగా అక్కడికి వచ్చారు. పడవలరేవు కూడలి వద్ద వేదిక ఏర్పాటు చేయాలని ఉద్యమ నాయకులు ముందుగానే భావించినా పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో అప్పటికప్పుడు ఓ వాహనానికి మైకులు అమర్చి దానిపై నుంచే ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. వారి ప్రసంగాలు సాగుతున్నంతసేపు ఉద్యోగులు వారికి మద్దతుగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంట వరకూ ఈ సభ కొనసాగింది. తర్వాత ఉద్యోగులంతా అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు.

తొలుత నిర్బంధాలు. ఆ తర్వాత

చలో విజయవాడ కార్యక్రమాన్ని జరగనీయకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎవర్నీ రానీయకుండా అడ్డుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నించారు. గురువారం ఉదయం 9.30 గంటల వరకూ కూడా వారి నిర్బంధాలు, అడ్డగింతలు కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్న ఉద్యోగుల్ని గవర్నర్‌పేట, కృష్ణలంక తదితర పోలీసుస్టేషన్లకు తరలించారు. మరికొందరు ఉద్యోగుల్ని ఆటోనగర్‌లోని ఆటోమొబైల్‌ టెక్నికల్‌ అసోసియేషన్‌ హాల్‌లో నిర్బంధించారు. అయితే వాటన్నింటినీ అధిగమించి ఒక్కసారిగా వేల మంది ఉద్యోగులు బీఆర్టీఎస్‌ రోడ్డులోకి తరలిరావటంతో వారిని అదుపు చేయటం కష్టమని భావించిన పోలీసులు ఒక వ్యూహం ప్రకారం.. ఎవర్నీ అడ్డుకోకుండా వదిలేశారు. పోలీసుల చేతుల్లో లాఠీలు కనిపించలేదు. కానీ వందల మంది మోహరించారు. అంతకు ముందు నిర్బంధించిన ఉద్యోగుల్ని మధ్యాహ్నం తర్వాత పోలీసులు విడిచిపెట్టారు.

అంధులు సైతం కదిలొచ్చారు.

ప్రభుత్వ తీరును ఎండగడుతూ చేపట్టిన ఉద్యమంలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి దివ్యాంగులు, అంధులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా తరలివచ్చారు. వారు ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వ్యంగ్యంగా గేయాలు ఆలపించి నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో సీపీఎస్‌ ఉద్యోగులు, కొంతమంది పింఛనుదారులు కూడా వచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. తమకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. మహిళా ఉద్యోగులూ వేల సంఖ్యలో వచ్చారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధిక శాతం మంది ఉపాధ్యాయులే ఉన్నారు. యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ తదితర సంఘాల నుంచి వేల మంది తరలివచ్చి జెండాలు ప్రదర్శించారు. పోలీసులూ ఉద్యోగులేనని వారూ ఉద్యమానికి సహకరించాలంటూ ఆందోళనల్లో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. కొంతమంది ఉద్యోగులు శీర్షాసనం వేసి ‘రివర్స్‌ పీఆర్సీ’ అంటూ ఎద్దేవా చేశారు. మరికొందరు యాచన చేసి, ఇంకొందరు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

 మంచినీళ్లు, మజ్జిగ ఇచ్చి. మద్దతు పలికిన జనం

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన కనిపించింది. బీఆర్టీఎస్‌ రహదారి పొడవున నివాసితులు వారి ఇళ్ల ముందు మంచినీళ్లు, మజ్జిగ బిందెల్లో ఉంచి అందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. కూర్చోవటానికి కుర్చీలు ఇచ్చి సహకరచారు.

JAGANANNA SMART TOWNSHIP - MIG LAYOUTS

In Jagananna Smart Townships 10% plots will be reserved for Govt. employees with 20% rebate on sale price. you are requested to furnish details through the link:
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పధకం లో భాగంగా ఫ్లాట్స్ కోసం అప్లై చేసుకోవాలనే వారు క్రింది లింకును క్లిక్ చేసి మీ వివరాలను సబ్మిట్ చేయాలి.



సమ్మెకు వెళ్తే అనేక ఇబ్బందులు వస్తాయి.. చర్చలకు రండి: సీఎస్​ సమీర్​శర్మ.కొత్త పీఆర్‌సీ వల్ల ఎవరి జీతం కూడా తగ్గలేదు..

PRC ISSUE IN AP: ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలు, సమ్మెల వల్ల ఏమీ రాదని.. చర్చిస్తేనే సమస్యలు పరిష్కారమయ్యేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మ స్పష్టం చేశారు. ఉద్యోగులకు సమస్యలున్న మాట నిజమేనని.. అయితే చర్చించి వాటిని పరిష్కరించుకోవాలని సీఎస్​ సూచించారు. పాత పీఆర్‌సీతో కొత్త పీఆర్‌సీని పోల్చి చూడాలని.. పే స్లిప్‌లో అన్ని విషయాలు చూస్తే జీతం పెరిగిందన్నారు. సమ్మెకు వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్న సీఎస్​.. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధమేనని​ స్పష్టం చేశారు.

కొత్త పీఆర్‌సీ వల్ల ఎవరి జీతం కూడా తగ్గలేదు. పాత పీఆర్‌సీతో కొత్త పీఆర్‌సీని పోల్చి చూడాలి. పే స్లిప్‌లో 10 రకాల అంశాలు ఉంటాయి.. అన్నీ సరిచూడాలి. 11వ పీఆర్‌సీలో 27 శాతం ఐఆర్‌ను 30 నెలలపాటు ఇచ్చారు. ఉద్యోగులకు ఐఆర్ రూపంలో రూ.18 వేల కోట్లు ఇచ్చాం. సమ్మెకు వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నాం. కరోనా వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రెండున్నర ఏళ్లుగా మధ్యంతర భృతి ఇస్తున్నాం. మధ్యంతర భృతి అనేదాన్ని ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేయాలి. అయినా.. తెలంగాణలా మేం డీఏ ఇవ్వలేదు.. ఐఆర్ ఇచ్చాం. తెలంగాణలా మేం కూడా డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగిలేది. - సమీర్​ శర్మ, సీఎస్

Chief Secretary Press Conference at 6 P. M

సాయంత్రం 6 గంటలకు సీఎస్ సమీర్ శర్మ ప్రెస్ మీట్ పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళన .చలో విజయవాడ ’ విజయవంతమైన నేపథ్యంలో ఏపీ సీఎస్ సమీర్ శర్మ మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అభిప్రాయాన్ని చెప్పే అవకాశముంది.

https://youtu.be/vR7x0jq3Y0c



ప్రభుత్వానికి అన్నీ దొంగ లెక్కలే: బొప్పరాజు వెంకటేశ్వర్లు

నాలుగు స్తంభాలాటకు అడ్డుకట్టవేయాలని ప్రభుత్వానికి ముందే చెప్పామని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. ప్రభుత్వం అన్నీ దొంగ లెక్కలు చెబుతోందని ఆరోపించారు.

"ప్రభుత్వం ఇలాంటి పీఆర్సీ ప్రకటించడం ఒక చరిత్ర.. ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే. ఈనెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపడతాం. ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు అసౌకర్యం బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగుల ఉద్యమమంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలి. మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి" అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

అప్పటి వరకు సజ్జల మొహం చూడొద్దన్నారు: సూర్యనారాయణ

ఉద్యోగులకు రక్షణ కవచంగా తమ నాలుగు సంఘాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ అన్నారు. విజయవాడ బీఆర్డీఎస్ రోడ్డులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తమ మధ్య గాలి కూడా చొరబడడానికి అవకాశం లేని విధంగా ఐక్యంగా ఉంటామని.. ఆత్మసాక్షిగా ఉద్యోగుల ముందు నిలబడతామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వితండ వాదాన్ని వీడి మాయా లెక్కల నుంచి బయటకు రావాలని.. వాస్తవాలను అంగీకరించాలన్నారు. పీఆర్సీ జీవోల వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మొహం చూడొద్దని ఉద్యోగులు చెప్పారన్నారు. హెచ్ఎస్ఏ పాత శ్లాబులు యథాతథంగా కొనసాగించాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు.

అంచనాలకు మించి ఉద్యోగులు.. చేతులెత్తేసిన పోలీసులు

'చలో విజయవాడ'కు ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. జిల్లాలతో పాటు విజయవాడ వెళ్లే మార్గాల్లో పోలీసుల నిర్బంధాలు కొనసాగినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఊహించని రీతిలో పెద్ద ఎత్తున విజయవాడ చేరుకున్నారు. అంచనాలకు మించి ఉద్యోగులు రావడంతో చేసేదేమీ లేక పోలీసులు చేతులెత్తేశారు.

విజయవాడలో ఉద్యోగుల ఉద్యమ హోరు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా తరలి రావడంతో విజయవాడ జన సంద్రమైంది. ఎన్జీవో హోం నుంచి అలంకార్ థియేటర్ మీదుగా బీఆర్డీఎస్ కూడలి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. దీంతో ఆయా మార్గాలు ఇసుకేస్తే రాలనంతగా మారిపోయాయి.

పాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.నూతన విద్యావిధానం అమలుపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు

కొత్తగా వర్గీకరించిన ఆరు రకాల స్కూళ్లు, అందులో ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు

3 కి.మీ.లోపలే హైస్కూల్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు

ఈ మార్గదర్శకాలను అనుసరించే మ్యాపింగ్‌ చేస్తున్నామన్న అధికారులు

రాష్ట్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అధికారులకు అవగాహనకోసం వర్క్‌షాపు నిర్వహించాం:

జిల్లాలస్థాయిలో కూడా నిర్వహించమని కోరారు, ఇవికూడా ఏర్పాటు చేస్తాం:

వర్క్‌షాపుల్లో వచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటాం:

నూతన విద్యావిధానం వల్ల స్కూళ్లు మూతబడుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు:

ఇది పూర్తిగా అవాస్తవం:

చేస్తున్నది తరగతుల విలీనం తప్ప, స్కూళ్ల విలీనం కాదు:

కొత్తగా ఏర్పాటు అవుతున్న స్కూళ్ల వల్ల ఇప్పుడున్న స్కూల్స్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మూతబడవు:

దీనిపై కొందరు అనవసరంగా అపోహపడుతున్నారు:

పాఠశాలల మూసివేత అనేది ఉండదు:

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే.

వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం

విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్న సీఎం

సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలన్న సీఎం

నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్‌ కారణంగా సుమారు 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్న సీఎం

వీరందరికీ ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలన్న సీఎం

వీరి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

స్కూళ్లలో సరిపడా సిబ్బంది ఉన్నప్పుడే పురోగతి కనిపిస్తుందన్న సీఎం

ప్రమోషన్లు, బదిలీలు ఇవన్నీకూడా పూర్తిచేసి జూన్‌నాటికి నూతన విద్యావిధానం సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం

ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా తీర్చిదిద్దుదామని అనుకున్నాం: సీఎం

ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను 2 జూనియర్‌ కాలేజీలుగా మార్చండి: సీఎం

ఒకటి కో – ఎడ్యుకేషన్‌ కోసం అయితే, ఒకటి బాలికలకోసం జూనియర్‌ కళాశాలగా మార్చాలి:సీఎం

ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలన్న సీఎం

మండల రీసోర్స్‌ సెంటర్‌ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్‌ అధికారాలు

ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సుకు సీఎం ఆమోదం

ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ 

పలురకాల ఆప్స్‌ కన్నా... రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలన్న సీఎం

అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ అమలు చేయాలన్న సీఎం

విద్యార్ధుల మార్కులనూ ఆన్‌లైన్‌లో ఎంట్రీచేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ

పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్‌ అకడమిక్‌ పనులకు వినియోగించవద్దన్న ఎస్‌ఈఆర్‌టీ 

హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయంకోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ

వీటికి ఆమోదం తెలిసిన సీఎం

స్కూళ్ల నుంచి ఫిర్యాదుల పరిష్కారంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం

సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం

నాడు నేడులో ఏర్పాటుచేసిన ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్యవచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం

స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం కీలక ఆదేశాలు

త్వరగా పనులు మొదలుపెట్టాలని సీఎం ఆదేశం

ఫిబ్రవరి 15 నుంచి పనులు మొదలుపెడుతున్నామన్న అధికారులు

సెప్టెంబరుకల్లా పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామన్న అధికారులు

జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు

ఇది సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం

స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్ధులకు డిక్షనరీ ఇవ్వాలన్న సీఎం

ప్రతిరోజూ ఒక పదాన్ని పిల్లలకు నేర్పాలన్న సీఎం

ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలన్నదానిపై పిల్లలకు నేర్పాలని సీఎం ఆదేశం

పాఠ్యప్రణాళికలో ఇదొక భాగం చేయాలన్న సీఎం

డిజిటల్‌ లెర్నింగ్‌పైనా కూడా దృష్టిపెట్టాలన్న సీఎం

8,9,10  తరగతుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ ఉండేలా చూడాలన్న సీఎం

దీన్నొక సబ్జెక్టుగా కూడా పెట్టే ఆలోచన చేయాలన్న సీఎం.

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go