Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Housing Loans and IT sections

హౌజింగ్ లోన్స్-ఐటీ సెక్షన్స్

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీసుకునే  Housing Loans పై చెల్లించే వడ్డీ పై ఆదాయపు పన్ను మినహాయింపు. 

IT section 24 ప్రకారం Housing Loans పై చెల్లించే వడ్డీ పై రెండు లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది.

దీంతో పాటు మరో రెండు సెక్షన్స్ ప్రకారం కూడా Housing Loansపై చెల్లించే వడ్డీపై IT మినహాయింపు పొందవచ్చు. అయితే, వాటికి షరతులు వర్తిస్తాయి.

IT సెక్షన్ 88EE.

ఈ సెక్షన్ ప్రకారం Housing Loan Interest మరో యాభై వేల రూపాయల వరకు IT మినహాయింపు పొందవచ్చు. ఇది రూ. రెండు లక్షల వడ్డీ మినహాయింపునకు అదనం. కండిషన్స్.

Housing Loan తేదీ 1.4.2016 నుంచి 31.3.2017 మధ్య కాలంలో మాత్రమే పొంది ఉండాలి.

ఇంటి విలువ రూ. 50 లక్షలకు మించకూడదు.

భూమి విలువ రూ. 35 లక్షలకు మించకూడదు.

IT సెక్షన్ 80EEA

ఈ సెక్షన్ ప్రకారం... Housing Loan Interest మరో రూ. 1.50 లక్షల వరకు IT మినహాయింపు పొందవచ్చు. ఇది కూడా రూ. రెండు లక్షల వడ్డీ మినహాయింపునకు అదనం. కండిషన్స్.

Housing Loan తేదీ 1.4.2019 నుంచి 31.3.2020 మధ్య కాలంలో మాత్రమే పొంది ఉండాలి.

స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షలు వరకు మాత్రమే ఉండాలి. స్టాంప్ డ్యూటీ పరిమితిని కొంతమంది డీడీవోలు Loan గరిష్ట పరిమితి అనే తప్పుడు భావనతో ఉండి, లోన్ 45 లక్షల రూపాయలు మించితే IT సెక్షన్ 80EEA వర్తించదని చెప్తున్నట్టు తెలిసింది. కానీ, అలా చేయడం కరెక్ట్ కాదు. అది స్టాంప్ డ్యూటీ విలువ మాత్రమే. మామూలు భాషలో చెప్పాలంటే... రిజిస్ట్రేషన్ చార్జీలన్నమాట.

లోన్ ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ (Banks) నుంచి మాత్రమే పొంది ఉండాలి.

అస్సెస్సీ IT సెక్షన్ 80EE క్లెయిమ్ చేయకూడదు. అంటే, IT సెక్షన్ 80EE, 80EEAలో ఏదో ఒకటి మాత్రమే వర్తింపజేయాలి.

లోన్ శాంక్షన్ అయ్యే తేదీ నాటికి అస్సెస్సీ Residential House Property కలిగి ఉండకూడదు.

No comments:

Post a Comment

LATEST POST

School complex agenda

ఈ రోజు నిర్వహించే క్లస్టర్ కాంప్లెక్ సమావేశం యొక్క సెషన్స్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు, చివరలో సబ్మిట్ చేయవలసిన ఫీడ్ బ్యాక్ ఫామ్ Clus...