మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరు 80 శాతం ఉండాల్సిందే.అన్ని శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు

రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల్లోనూ కచ్చితంగా 80 శాతం హాజరు ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. సచివాలయంలోని అన్ని శాఖలు రాష్ట్రవ్యాప్తంగా వాటి పరిధిలోని విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ రంగ, స్వతంత్ర సంస్థల్లో బయోమెట్రిక్‌ పరికరాల ద్వారా హాజరు నమోదు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. సచివాలయంలోని ప్రతి శాఖ పరిధిలోని వివిధ విభాగాల ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరు వివరాలను సంబంధింత శాఖ కార్యదర్శికి రోజువారీగా పంపాలని సూచించింది. అన్ని శాఖల కార్యదర్శులు బయోమెట్రిక్‌ హాజరును వారానికోసారి సమీక్షించాలని కోరింది.

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...