మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఫీజుల ఖరారు.అందరి మేలు కోసమే

తల్లిదండ్రులు సహా 90 శాతం స్కూళ్ల యాజమాన్యాల్లో ఆనందం.కమిషన్‌ నిర్ణయించిన ఫీజులే కడతామని తల్లిదండ్రులు చెప్పాలి.ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే 9150381111కు ఫిర్యాదు చేయాలి

ఫీజు చాలదనుకునే యాజమాన్యాలు కమిషన్‌ను సంప్రదించొచ్చు.ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో సర్వీస్‌ నిబంధనలు.స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ర్యాంకింగులతో పాటు అక్రేడిటేషన్‌.పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు

 తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలందరి మేలును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ఫీజులు ఖరారుచేశామని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు తెలిపారు. తల్లిదండ్రులు, 90 శాతానికి పైగా ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారన్నారు. కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎ. విజయశారదారెడ్డి, సభ్యుడు అజయ్‌కుమార్, కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డితో కలిసి గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

రాష్ట్రంలో దశాబ్దాల నుంచి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. గత ఏడాదిలోనే ఫీజులను నిర్ణయించాలనుకున్నాం. కానీ, జీఓ–57 విడుదలైనా న్యాయవివాదంతో సస్పెండ్‌ కావడం, కరోనా పరిస్థితులవల్ల ముందుకెళ్లలేకపోయాం. ఇప్పుడు వివిధ వర్గాల వారందరితో చర్చించి ప్రాంతాల వారీగా ఆయా విద్యాసంస్థల నిర్వహణకయ్యే వాస్తవిక వ్యయాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ, పట్టణ, నగర ప్రాంతాల వారీగా కొన్ని ప్రమాణాలను అనుసరించి ఫీజులు నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా స్కూళ్లు, 2,500కు పైగా కాలేజీలున్నాయి. సంస్థల వారీగా ఫీజులు నిర్ణయించడం సాధ్యంకాదు కనుక ఏ విద్యా సంస్థకైనా తమకు ఆ ఫీజు చాలదని భావిస్తే 15 రోజుల్లో జమా ఖర్చులకు సంబంధించిన అన్ని రికార్డులతో కమిషన్‌కు దరఖాస్తు చేయవచ్చు. దాన్ని పరిశీలించి కమిషన్‌ సానుకూల పరిష్కారం చూపిస్తుంది. 

No comments:

Post a Comment

LATEST POST

Contributory Pension Scheme (CPS) – One-time option for coverage under Old Pension Scheme (OPS) to eligible employees whose recruitment notification/advertisement was issued prior to 01.09.2004 but who joined Government service on or after 01.09.2004 - Orders

2003 కు ముందు నోటిఫికేషన్ వచ్చి 2004 తరువాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ వర్తింప జేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు.  Click Here To Do...