మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

కోవిడ్ బాధిత పిల్లలను అదే పాఠశాలల్లో కొనసాగించాలి. పాఠశాల విద్య డైరెక్టర్ చిన వీరభద్రుడు ఆదేశం

రాష్ట్రం లో కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పో యిన పిల్లలను ఆయా పాఠశాలల్లోనే తప్పనిసరిగా చదివించేందుకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య డైరెక్టర్ వీ. చిన వీరభద్రుడు ప్రధానోపాధ్యాయు లు, ప్రిన్సిపాల్స్న ఆదేశించారు. ఈ నెల 16 నుంచి విద్యా సంస్థలు ప్రారంభమవు తున్న దృష్ట్యా సుప్రీం ఆదేశాలను విధిగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఫీజు చెల్లించలేదని ఏ ప్రైవేటు సంస్థ అయినా సంబంధిత విద్యార్థులను పాఠశాల నుంచి తొలగించిన పక్షంలో తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటా మని ఆయన హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే వారిని ఆయా తరగతుల్లో కొనసాగించడంతో పాటు జగనన్న విద్యా కానుక మొదటి ప్రాధాన్యతలో ఈ నెల 31లోగా అందించేందుకు చర్యలు తీసుకోవాల న్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే వారికి అయ్యే ఖర్చును పాఠశాల విద్యాశాఖ దృష్టికి తీసుకొస్తే భరించనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాల యాజమాన్యం దీనిని నోటీసు బోర్డులో ప్రముఖంగా ప్రచురించడంతో పాటు తల్లిదండ్రుల సమావేశా లు ఏర్పాటు చేసి వివరించాలన్నారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పిల్లల సమస్యలను, నెలవారీ ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు డివిజినల్ విద్యాశాఖాధికారికి తెలియజేయాలన్నారు. సందేహా లు, సమస్యలున్న పక్షంలో మెయిల్ ద్వారా తెలిపినట్లయితే విద్యాశాఖ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని చిన వీరభద్రుడు పేర్కొన్నారు.

No comments:

Post a Comment