మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Covid +ve రిపోర్ట్‌ లేకున్నా ఆసుపత్రిలో అడ్మిషన్‌ పలు సవరణలు చేసిన కేంద్రం.నూతన మార్గదర్శకాలు ఇవే.

కొవిడ్‌ ఆరోగ్య కేంద్రం(ఆసుపత్రులు)లో చేర్చుకునేందుకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్దారణ పత్రం తప్పనిసరి కాదు. వైరస్‌ అనుమానిత బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకుని చికిత్స అందించాల్సిందే.

కారణమేదైనా సరే.. ఏ రోగికి కూడా వైద్య సేవలు నిరాకరించొద్దు. వేరే ప్రాంతానికి చెందిన రోగులకు కూడా ఆక్సిజన్‌ లేదా అత్యవసర ఔషధాలు ఇవ్వాలి.

వేరే నగరం నుంచి వచ్చిన బాధితులు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించలేదని ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా ఉండొద్దు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని చేర్చుకోవాలి.

అన్ని ఆసుపత్రులు డిశ్చార్జ్‌ పాలసీని కచ్చితంగా పాటించాలి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆధారంగానే చేసుకునే ఆసుపత్రిలో చేర్చుకోవాలి. అంతగా హాస్పిటల్‌ అవసరం లేనివారిని డిశ్చార్జ్‌ చేయాలి.

ఈ నూతన మార్గదర్శకాలపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు మూడు రోజుల్లోగా ఉత్తర్వులు, సర్క్యులర్లు జారీ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

No comments:

Post a Comment

LATEST POST

Imms app updated latest version 2.2.2

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.2.2 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...