మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Covid నుంచి కోలుకున్న 3 నెలల తర్వాతే టీకా .కేంద్రం మార్గదర్శకాలు

వ్యాక్సినేషన్‌ విధానంలో పలు కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కరోనా బారినపడిన వారు వైరస్‌ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని తెలిపింది. కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

టీకా విధానంలో తాజా మార్పులివే.

కొవిడ్‌ సోకినవారు కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలి. అంతకుముందు ఇది 4-8 వారాలుగా ఉండేది. ఇప్పుడు దీన్ని 3 నెలలకు పెంచారు. 

తొలి డోసు వేసుకున్నాక కొవిడ్‌ సోకితే.. కోలుకున్న 3 నెలలకు రెండో డోసు తీసుకోవాలి. 

ప్లాస్మా చికిత్స తీసుకున్నవారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మూడు నెలల తర్వాత టీకా వేయించుకోవాలి.

ఇతర తీవ్ర వ్యాధులతో ఆసుపత్రి లేదా ఐసీయూలో చికిత్స అవసరమైన వారు కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత వ్యాక్సిన్‌ వేసుకోవాలి.  

బాలింతలు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు.

కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు, టీకా తీసుకున్నవారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు.

వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు అవసరం లేదు. 

అయితే గర్భిణీలకు కొవిడ్‌ టీకా అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్‌ విధానంలో తాజా మార్పులను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

No comments:

Post a Comment

LATEST POST

Ap Edcet entrance exam results released

AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx