మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

గాలి ద్వారానూ కరోనా వ్యాప్తి.తాజా అధ్యయనంలో వెల్లడి

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే పలు ప్రాథమిక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి బలమైన ఆధారాలున్నాయని తాజా నివేదిక ఒక పేర్కొంది. దీనికి సంబంధించిన వ్యాసం ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ 'ది లాన్సెట్'లో ప్రచురితమయింది. గాలి ద్వారా కరోనా వ్యాప్తిని నిర్ధారించేందుకు బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన నిపుణుల బందం పరిశోధనలు చేసింది.

వైరస్ వ్యాప్తికి ముఖ్యంగా సూపర్ స్పైడర్ ఈవెంట్లు కారణమవుతున్నాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి 53 మందికి సోకిన ఒక ఘటనను నివేదికలో ఉదహరించారు. బాహ్యప్రదేశాల్లో కంటే ఇండోర్ ప్రదేశాల్లోనే వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందు తుందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సిసిఎంబి)తో సహా అనేక సంస్థలు స్పష్టం చేశాయి. గత ఏడాది జుల్లో 32 దేశాలకు చెందిన 200 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ కూడా రాశారు.

No comments:

Post a Comment