మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

కరోనా పరిస్థితిపై సీఎం జగన్‌ సమీక్ష:

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించకుండానే కరోనాకట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. అందరికీ కొవిడ్‌ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు ఉన్న అందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో అర్బన్‌ ప్రాంతాల్లో 62శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కొవిడ్‌ కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా మరణాలు నమోదవుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆలస్యంగా ఆసుత్రులను ఆశ్రయించడమే మరణాలకు కారణంగా గుర్తించారు.

వాలంటీర్‌, ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలతో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలన్నారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రుల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాణ్యమైన భోజనం, శానిటైజేషన్‌పై దృష్టి సారించాలన్నారు

No comments:

Post a Comment

LATEST POST

AP SET Notification related

 APSET–2025 నోటిఫికేషన్ విడుదల.  యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ...