మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ప్రపంచంలో తొలిసారి భారత్‌లో ఒకేరోజు 4 లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్‌ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్‌ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,08,323 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,63,488కు చేరింది. ఇందులో 1,56,71,536 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,11,778 మంది మరణించారు. కొత్తగా 2,97,488 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 3464 మంది మరణించారు.

కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 చొప్పున నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో కరోనాతో 828 మంది మరణించగా, ఢిల్లీలో 375 మంది, ఉత్తరప్రదేశ్‌లో 332 మంది మృతిచెందారు.

No comments:

Post a Comment

LATEST POST

APPSC Departmental Tests May 2026 session Results Released

Appsc డిపార్ట్మెంట్లు పరీక్షల మే 2026 సెషన్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది.  పేపర్ కోడ్ 88& 97 https://psc.ap.gov.in/Results/DEPARTMENTAL...