మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ap Teacher Eligibility Test (TET) Guidelines Released

టెట్ మార్గదర్శకాలు విడుదల .

రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ టెట్) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవు తోంది. అందుకోసం టెట్ మార్గదర్శకాలతో కూడి న ఉత్తర్వులను బుధవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ విడుదల చేశారు ఈ పరీక్ష పూర్తి కంప్యూటర్ బేస్ గా ఉండనుందని జీవోలో స్పష్టం చేశారు.

1 నుంచి 5వ తరగతులకు (పేపర్- 1), 6 నుంచి 8 తరగతులకు(పేపర్- 2) విడివిడిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెట్ కు సంబంధించిన అర్హత మార్గదర్శకాలను పేపర్ల వారీగా విడివిడిగా వివరించారు. పేపర్-1ఎ, 1బి పేపర్- 2ఏ, 2బి 150 మార్కుల చొప్పున ఉంటా యని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ పరీక్షలు ఇంగ్లి ష్, అభ్యర్థులు ఎంచుకున్న లాంగ్వేజ్-1 భాషల్లో ఉండనున్నాయి. జనరల్ అభ్యర్థులు కనీసం 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ విభిన్నప్రతిభావంతులు, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు

టెట్ కమిటీ ఏర్పాటు

టెట్ నిర్వహణ కోసం ఐదుగురితో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్ గా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, మెంబర్ కన్వీనర్ గా టెట్ జాయింట్ డైరెక్టర్, మెంబర్లుగా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, ప్రభుత్వ పరీక్షల సంచాల కులు, జాయింట్ డైరెక్టర్(సర్వీసెస్) వ్యవహరించ నున్నారు. అలాగే టెట్ సెల్ లో టెట్ కన్వీనర్, డిప్యూ టీ కమిషనర్‌ స్థాయి అధికారి, అసిస్టెంట్ కమిషనర్ లేదా డైరెక్టర్ స్థాయి అధికారి, సూపరింటెండెంట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉంటారని, కమిటీ సూచనల మేరకు ఈ సెల్ పని చేయాలని సూచిం చారు. ఆరు నెలలలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

LATEST POST

Ap Edcet entrance exam results released

AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx