మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

కరోనాకు కళ్లెం.. కేంద్రం కొత్త నిబంధనలు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వైరస్‌ వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా డిసెంబర్‌ 1నుంచి 31 వరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాల్సిన కొవిడ్‌ నిబంధనలను బుధవారం ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు పెరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో దృష్టి కేంద్రీకరించి వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల లాక్‌డౌన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి అని కేంద్రం స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఈ బాధ్యత పోలీసులు, జిల్లా యాంత్రాంగానిదేనని తెలిపింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా రాత్రిపూట కర్ఫ్యూ వంటి నిబంధనలు రాష్ట్రాలు విధించుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది.

మాస్క్‌లు ధరించకపోతే జరిమానా.

వైద్య అత్యవసర పరిస్థితులలో తప్ప, మరియు అవసరమైన వస్తువులు మరియు సేవల సరఫరాను నిర్వహించడం మినహా, ఈ మండలాల్లో లేదా వెలుపల ప్రజల కదలిక లేదని నిర్ధారించడానికి కఠినమైన  నియంత్రణ ఉండాలి. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి అంశాలపై చైతన్యం కలిగించాలి. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి తగిన జరిమానా విధించాలి.

స్విమ్మింగ్‌ పూల్స్‌లో వాళ్లకే అనుమతి!

కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చింది. అంతర్జాతీయ ప్రయాణికులను కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం అనుమతించాలని తెలిపింది. 50శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చు. క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే స్విమ్మింగ్‌ పూల్స్‌కు అనుమతి. సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా/ వినోద/ విద్య/సాంస్కృతి/ మతపరమైన కార్యక్రమాలకు 50శాతం సామర్థ్యంతో హాలులోకి అనుమతించాలి. ఇతర కార్యక్రమాలకు 200 మందికి మించరాదు. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఆరోగ్య సేతు యాప్‌ వాడకాన్ని ప్రోత్సహించాలి.

No comments:

Post a Comment

LATEST POST

NMMS 2026 notification released Rc.No.208/NMMS/2026 dt: 10-09-2026

రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) పరీక్షను 15-11-2026 (ఆదివారం) ఉదయం 10.00 గంట...