మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

పాఠశాల ల ప్రారంభం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారి వివరణ

23 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు.

క్రమేణా ఉన్నత పాఠశాలల్లో అన్ని  తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు. 

ఈనెల 23 సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే ఈనెల 2 నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న సంగతి విదితమే. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉండటం తో పాటు హాజరు శాతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 8వ తరగతి విద్యార్థులకు కూడా పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది. 8, 9 తరగతుల విద్యార్థులు రోజుమార్చి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10 వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మూడు తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి  6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 14వ తేదీ తరువాత అప్పటి పరిస్థితి సమీక్షించుకుని 1-5 తరగతులపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.  ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు జరుగుతున్న పాఠశాలలు చలికాలం కారణంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని మంత్రి సురేష్ తెలిపారు. 

No comments:

Post a Comment

LATEST POST

Imms app updated latest version 2.2.2

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.2.2 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...