మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Half Pay Leaves Explanation as per AP Leave Rules

ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన అర్ధవేతన సెలవుల పూర్తి వివరాలు. సగం జీతంతో సెలవులు – ఎవరికీ, ఎప్పుడు, ఎలా లభిస్తాయో తెలుసుకోండి!

AP Leave Rules ప్రకారం Half Pay Leave పూర్తి వివరణ!

ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు13,18,23 నందు పొందుపరచారు. సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.
సం॥ నకు ఒక్క రోజు తక్కువైనను ఈ సెలవు రాదు.(G.O.Ms.No.165 Dt:17-08-1967)

ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు. అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.

అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.

1.వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)

2. స్వంత వ్యవహారాలపై (Private Affairs)

సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును. ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు. వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవుఅందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.

{APLR 15(B) & 18(B}

కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకుపెంచడమైనది.

(G.O.Ms.No.186 Dt:23-07-1975)


సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}. ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి. వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.

వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)

(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)

అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.

క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు,మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును. (G.O.Ms.No.386 Dt:06-09-1996) (G.O.Ms.No.449 Dt:19-10-1976)

వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు. (G.O.Ms.No.29 Dt:09-03-2011)

ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు. (G.O.Ms.No.143 Dt:01-06-1968)


ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.(G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)
Educational Quiz: Test your general knowledge, teaching skills, and learning abilities with our latest online quiz, competitive test, and aptitude practice questions. Improve your results and explore similar AP TET, DSC, and GK quizzes for better preparation.

🔥 More Educational & GK Quizzes

No comments:

Post a Comment

LATEST POST

100 days action plan for 10th class Day 24

10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డే 24 నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. 📥 DOWNLOAD SSC DAY ...