Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

సీఎం ఇల్లు ముట్టడిస్తామంటే ఊరుకోవాలా? మిలిటెంట్‌ ఉద్యమ చరిత్ర ఉంటేనే బైండోవర్‌. ఉద్యోగుల నిర్బంధంపై మంత్రి బొత్స వ్యాఖ్యలు. సీపీఎస్‌కు ప్రత్యామ్నాయం ఉందని వెల్లడి

ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘా ల నేతలపై పోలీసులు సాగిస్తున్న అణచివేతను మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించారు. ‘మిలిటెంట్‌ ఉద్యమకారులుగా గుర్తించిన వారినే ముందస్తు బైండోవర్‌ చేస్తున్నారు. దూకుడుగా ఉద్యమాల్లో పాల్గొనే వారిపైనే పోలీసులు నిఘాపెట్టారు. సీఎం ఇంటిని ముట్టడి చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా’ అని ప్రశ్నించారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడారు. మిలియన్‌ మార్చ్‌ గురించి తనకు తెలియదన్నారు. ‘‘సీపీఎస్‌ రద్దు చేస్తామని మేము హామీ ఇచ్చాం.. కాదనడం లేదు. కానీ, సీపీఎస్‌ రద్దుచేస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. దీన్నిదృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ స్కీమ్‌ను తీసుకుని వస్తున్నాం’’ అని అన్నారు. ‘ముఖ హాజరు’ విధానాన్ని తొలుత ఉపాధ్యాయులకు వర్తింపజేశామని, దశల వారీగా అన్ని శాఖలకు విస్తరిస్తామని మంత్రి తెలిపారు.

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...