Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

కొత్త ఫీచర్లను జోడించిన వాట్సాప్.. యూజర్లకు సౌలభ్యం

ఎన్నాళ్ల నుంచో యూజర్లు వేచి చూస్తున్న సదుపాయాలను వాట్సాప్ తన ప్లాట్ ఫామ్ పై అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తాజా వెర్షన్ పై ఎమోజీ రియాక్షన్స్ అందుబాటులోకి తీసుకురావడం పట్ల సంతోషంగా ఉందని వాట్సాప్ ప్రకటించింది. 

వాట్సాప్ లో ఇంత వరకు యూజర్లు ఒక్క విడత 100 ఎంబీ వరకే ఫైల్స్ (ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు) పంపించుకునేందుకు అవకాశం ఉండేది. దీనివల్ల పంపించాల్సిన ఫైల్స్ ఎన్నో ఉన్నప్పుడు చాలా సమయం వృధా అయ్యేది. ఇప్పుడు ఈ పరిమితి 2 జీబీకి పెరిగింది. అంటే ఒకే విడత 2 జీబీ డేటాను మరొకరితో షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఫైల్ అప్ లోడ్ లేదా డౌన్ లోడ్ కు ఎంత సమయం పడుతుందన్నది కూడా ఆ సమయంలో చూపిస్తుంది.

ఇక వాట్సాప్ గ్రూపుల్లో మరింత మంది సభ్యులను చేర్చుకునేందుకు వీలు కల్పించింది. ఒక గ్రూపులో గరిష్ఠంగా 256 మంది సభ్యులకే ఇప్పటి వరకు అనుమతి ఉండేది. ఇంతకుమించి సభ్యులు ఉన్నప్పుడు వేరే గ్రూపు తెరవాల్సి వచ్చేది. ఇకమీదట 512 మంది సభ్యులు ఒకే గ్రూపులో చేరొచ్చు. పరిమితి రెట్టింపైంది

No comments:

Post a Comment

LATEST POST

Mental Ability Quiz 11 for Secondary School

UP & HS స్థాయి విధ్యార్థులకు MENTAL ABILITY కి సంబంధించి 20 QUESTIONS తో Quiz ప్రోగ్రామ్. Quiz పూర్తయిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అన్నీ చూపి...