మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

కరోనా ఫోర్త్ వేవ్ పై మరింత స్పష్టత ఇచ్చిన ఐసీఎంఆర్

దేశంలో మళ్లీ కరోన పెరుగుతున్న నేపథ్యలో, ఇది ఫోర్త్ వేవ్ కు సంకేతమంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) స్పందించింది. కరోనా ఫోర్త్ వేవ్ పై భయాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. కేవలం కొన్ని జిల్లాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న విషయాన్ని ఇటీవలి డేటా వెల్లడిస్తోందని ఐసీఎంఆర్ తెలిపింది. దీన్ని ఫోర్త్ వేవ్ గా భావించలేమని, కొన్నిచోట్ల స్థానికంగా కేసులు ఎక్కువ వస్తున్నాయని వివరణ ఇచ్చింది. 

ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా కరోనా టెస్టులు చేయడంలేదని అన్నారు. తక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేసినప్పుడు వచ్చే పాజటివ్ కేసుల సంఖ్య ఆధారంగా ఆ ప్రాంతంలో కరోనా అధికంగా ఉన్నదని చెప్పలేమని తెలిపారు. అధిక సంఖ్యలో టెస్టులు చేసినప్పుడు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తేనే అక్కడ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్టు భావించాలని వివరించారు

No comments:

Post a Comment

LATEST POST

Dr BR Ambedkar Social welfare school admission notification for 5th and inter

డా.BR.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5,  ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. 6 నుంచి 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రకటన వి...