మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP EAPCET-2022 లో ఇంటర్ వెయిటేజీ రద్దు...ర్యాంకుల కేటాయింపు ఇలా

No Weightage for AP EAPCET 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్‌ 2022కు సంబంధించి మంగళవారం (మే 17) కీలక ప్రకటన విడుదల చేసింది.

ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్‌ ద్వారా నిర్వహించే ప్రవేశాల్లో ఇంటర్ వెయిటేజీ మార్కులు తొలగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి (APSCHE) ప్రకటించింది.

దీంతో ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా మాత్రమే విద్యార్ధులకు ర్యాంకులను కేటాయించడం జరుగుతుంది.

ఈ మేరకు విద్యార్ధులకు తెలియజేస్తూ ప్రటకన జారీ చేసింది.

ఈ ఏడాది నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌ 2022)లో ఇంటర్‌ వెయిటేజీ తొలగించనున్నట్లు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందినప్పటికీ, ఉన్నత విద్యా మండలి అధికారికంగా ఈ రోజు తెలియజేసింది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్

 https://sche.ap.gov.in/APSCHEHome.aspx 

ను చెక్‌ చేసుకోవచ్చు.

కాగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడానికి ఏపీ ఈఏపీసెట్‌ 2022 నిర్వహించబడుతుంది.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది.

దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 11 నుంచి మే 10 వరకు కొనసాగింది.

ఇక ఏపీ ఈఏపీసెట్‌ రాత పరీక్ష జూలై 4 నుంచి 8 వరకు మొత్తం 5 రోజుల పాటు, మొత్తం 10 సెషన్లలో ఇంజినీరింగ్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి.

అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు జులై 11, 12 తేదీల్లో 4 సెషన్లలో జరగనున్నాయి.

ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఎగ్జాం ప్యాట్రన్‌, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్‌ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్‌ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్‌, బీటెక్‌ (బయోటెక్‌), బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, Pharm-D కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

No comments:

Post a Comment

LATEST POST

Gnana Prakash Programme 60-Day Certificate Course (Year-2) Development and Roll-out of Online Modules through DIKSHA Platform - Certain Instructions

జ్ఞాన ప్రకాశ్ మొదటి సంవత్సరం  సర్టిఫికేట్ కోర్సును  పూర్తి చేసిన  సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు దీక్ష ప్లాట్‌ఫామ్ ద్వారా రెండవ సంవత్సరం ఆన్‌లైన...