మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

45 మంది విద్యార్థులకు ఒక టీచర్‌.పాఠశాల విద్యాశాఖ నిర్ణయం .ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల మ్యాపింగ్‌కు ఆదేశాలు జారీ

రాష్ట్రంలో 3, 4, 5 తరగతులుండే ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలల్లో 45 మంది విద్యార్థులకు ఒక టీచర్‌నే ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 45 నుంచి 74 మంది విద్యార్థులు ఉంటే తప్ప మరో టీచర్‌ను ఇవ్వరు. ప్రాథమిక విద్య ఆయువు తీసేలా ఈ నిర్ణయం ఉందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక విద్యను ప్రభుత్వం విద్యార్థులకు దూరం చేస్తోందని,  ఇంతమంది విద్యార్థులకు ఒక్కరే టీచర్‌ పాఠాలను ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 52 మంది, ఉన్నత పాఠశాలల్లో 60 మంది వరకు విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉంటారు. నిర్ణీతం కంటే ఫౌండేషన్‌ ప్లస్‌లో 30, ప్రాథమికోన్నతలో 35, ఉన్నత పాఠశాలల్లో 39 మంది విద్యార్థులు అదనంగా ఉంటే ఆ తర్వాత రెండో టీచర్‌ను ఇస్తారు. ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రాథమికోన్నత బడులకు మంగళం

ఉన్నత పాఠశాలల్లో సరైన వసతి సౌకర్యం ఉంటే మూడు కిలోమీటర్ల లోపున్న ప్రాథమికోన్నత బడుల నుంచి 6, 7, 8 తరగతులను తరలిస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో భవిష్యత్తులో ఫౌండేషన్‌ బడులు, ఉన్నత పాఠశాలలే మిగలనున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ఆరు రకాల బడులు అని చెబుతున్నా ఈ నిర్ణయాలతో 3-10 వరకు తరగతులు కలిగిన ఉన్నత పాఠశాలలు... పూర్వ ప్రాథమిక విద్య-1, 2, ఒకటి, రెండు తరగతులు ఉండే ఫౌండేషన్‌ బడులు... ఇలా 2 రకాలే ఉంటాయి.

అన్ని సబ్జెక్టులను ఉర్దూ మాధ్యమంలో బోధిస్తూ, సమ్మెటివ్‌-2 పరీక్షలను ఉర్దూ మాధ్యమంలో నిర్వహించే బడులను కొనసాగిస్తారు. మిగతా వాటిని సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేస్తారు. ఇక్కడ మొదటి భాషగా ఉర్దూను బోధిస్తారు. ఈ నిర్ణయంతో ఉర్దూ, ఇతర మైనర్‌ మాధ్యమాలు కనుమరుగు కానున్నాయి. రాష్ట్రంలో దాదాపు ఎక్కడా ఉర్దూ అంగన్‌వాడీలు లేవు. అన్నీ ఆంగ్ల మాధ్యమంగా మారితే ఉర్దూ అభ్యసించే వారుండరు.

3 నుంచి 8 వరకు ఒక్కటే మాధ్యమం

మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒకే మాధ్యమంగా పరిగణిస్తారు. ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగిస్తారు. ఒకే మాధ్యమంగా పరిగణించి, ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 3-8 తరగతుల్లో తెలుగు మాధ్యమం ఉండదు.

No comments:

Post a Comment

LATEST POST

MDM & SS – Placing of indents for Rice, Ragi Jaggery, Egg and Chikki – Rationalization of timelines – Certain instructions

common timeline for placing indents of all commodities relating to Mid Day Meal Scheme as detailed below to reduce the workload and operatio...