Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దుపై స్టే.47 కాలేజీల విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రాష్ట్రంలోని 47 డీఈడీ కాలేజీల గుర్తింపును రద్దు చేస్తూ గతేడాది అక్టోబరులో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. ఆ ఉత్తర్వుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని పలు డీఈడీ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించారని, పాఠశాల విద్య కమిషనర్‌ దిల్లీలోని ఎన్‌సీటీఈకి లేఖ రాశారు. దాని ఆధారంగా రాష్ట్రంలోని పలు కాలేజీల గుర్తింపుని ఎన్‌సీటీఈని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీటీఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ డీఈడీ కాలేజీలు యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ, న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపించారు. ‘నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలకు ముందుగా నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలి. ఆతర్వాతే గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. అందుకు విరుద్ధంగా వెబ్‌సైట్‌లో నోటీసులు ఉంచి సమాధానం ఇవ్వని కాలేజీల అనుమతిని రద్దు చేశారు. ఎన్‌సీటీఈ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించింది’ అని వివరించారు. ఆ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఎన్‌సీటీఈ ఉత్తర్వుల ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go