Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగించే ప్రసక్తే లేదు: మంత్రి సురేష్.

ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడగింపుపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత ఇచ్చారు. పాఠశాలలకు సెలవులు పొడగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. సంక్రాంతి సెలవుల పోడిగింపుపై విద్యాశాఖలో విస్తృత చర్చ జరిగింది. అయితే స్కూళ్లకు సెలవుల పెంపు సోమవారం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఇంతలోనే పాఠశాలలకు సెలవులు పొడగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు ఇప్పటికే 13.87శాతానికి చేరడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తికానందున పాఠశాలలు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. స్కూళ్లను కొనసాగిస్తే కరోనా కేసులు వెలుగు చూస్తే ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగం పెంచింది. కేసులు భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో యాక్టివ్‌ కేసులు కూడా రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో స్కూళ్లకు తెరిస్తే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించినట్లు వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 8 నుంచి నేటి వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాసంస్థలకు విద్యాశాఖ సూచించింది

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go