మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Omicron: భారత్‌లో థర్డ్‌ వేవ్‌ రాబోతోందా?డబ్ల్యూహెచ్‌ఓ అధికారి ఏమన్నారంటే.

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పటికే 59 దేశాలకు వ్యాపించింది. భారత్‌లో ఇప్పటి వరకు 34 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మూడో వేవ్‌ రాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త వేరియంట్‌ వచ్చినంత మాత్రాన దయనీయమైన పరిస్థితులు తలెత్తుతాయని భావించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, కొంత అనిశ్చితి మాత్రం ఉంటుందని తెలిపారు.

మహమ్మారి ఇంకా అంతం కాలేదని పూనమ్‌ తెలిపారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్ని మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు.

ఇప్పటికే ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం, అలాగే అనేక పరివర్తనాలు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఈ కొత్త వేరియంట్‌ ప్రభావం తీవ్రంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయని పూనమ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, అది ఎలాంటి ప్రభావం అనేది మాత్రం ఇప్పుడే నిర్ధారించలేమన్నారు. మరింత స్పష్టత కోసం ప్రతి దేశం సమగ్రమైన సమాచారం పంపాలని కోరారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రత, ఇన్ఫెక్షన్‌ రేటు, లక్షణాలను నిర్ధారించడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.

దక్షిణాఫ్రికా నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒమిక్రాన్‌ వల్ల రీఇన్ఫెక్షన్లు అధికంగా నమోదవుతున్నాయని పూనమ్‌ తెలిపారు. అలాగే డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కానీ, ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదన్నారు.

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...