Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

సీఎం ప్రకటన విషయం ఉద్యోగ సంఘాలకు తెలియదు: బొప్పరాజు

 పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల డిమాండ్‌ కాదని, ఇతర అంశాలు కూడా ఉన్నాయని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ సంబంధిత అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చలకు మాత్రమే ప్రభుత్వం పిలిచిందని వెల్లడించారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేస్తేనే దానిపై చర్చించేందుకు వీలు కలుగుతుందని బొప్పరాజు స్పష్టం చేశారు. పీఆర్సీకి సంబంధించి సీఎం చేసిన ప్రకటనపై ఉద్యోగులెవరికీ సమాచారం లేదని పేర్కొన్నారు.

తిరుపతిలో తమ సంఘాలకు చెందిన ఉద్యోగులెవరూ సీఎంను కలవలేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపితేనే ఉద్యమాన్ని విరమించుకుంటామని వెల్లడించారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుందని బొప్పరాజు తేల్చి చెప్పారు.

ఉద్యోగుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో పీఆర్సీ విషయంలో సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని స్పష్టంచేశారు. తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో ఉండగా.. కొందరు ఉద్యోగులు పీఆర్సీ గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. వాటిని గమనించిన సీఎం ఉద్యోగులను పిలిచి మాట్లాడారు. పీఆర్సీతో పాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉద్యోగులు లేవనెత్తారు. దీనిపై స్పందించిన జగన్‌.. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. పది రోజుల్లో ప్రకటన ఉంటుందని వారికి తెలిపారు.

No comments:

Post a Comment

LATEST POST

Dr. B. R. Ambedkar open university B. Ed admission notification 2026

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) B.Ed అడ్మిషన్ నోటిఫికేషన్ - 2026 ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులక...