Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

మరుగుదొడ్లు శుభ్రతపై అసత్య ప్రచారం.ప్రతి పాఠశాలలో ఆయాలను నియమించాం

రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కర ణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. కొందరు పనిగ ట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేపడు తున్నారని విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల తో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారంటూ ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్య మాల్లో ఫొటోలు షేర్ చేస్తున్నారని తెలి పారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని, ప్రజలకు వాస్తవాలు తెలుసు నని సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు 'అమ్మ ఒడి' కింద ఇచ్చే నగదు నుంచి రూ. వెయ్యిచొప్పున ఇచ్చిన దాదాపు 444. 89 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తం 45,716 పాఠశాలల్లో ఇప్పటికే ఆయాలను నియమించామని వివరించారు. 300 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఒకరు, 600 మంది ఉన్న పాఠశాలల్లో ఇద్దరు, 900 మంది ఉన్న పాఠశాలల్లో ముగ్గురు, 900 పైబడి విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో నలుగురిని చొప్పున ఆయాలను నియమించడం జరిగిందని తెలిపారు. ఆయాలకు నెలకు రూ. ఆరు వేల జీతం చెల్లిస్తున్నా మన్నారు. మరుగుదొడ్ల పరిశుభ్రతకు ప్రత్యేకంగా కెమికల్ కిట్లను కూడా సరఫరా చేశామని వివరించారు. మరుగుదొడ్ల పరిశుభ్రతపై గ్రామ సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ జరుగుతోందని, అయితే వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు చర్యలకు దిగుతున్నారని మంత్రి డా. సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

LATEST POST

AP EAPCET - 2026 results released

AP EAPCET 2026 పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది AGRICULTURAL & PHARMACY RESULTS.. https://results.eenadupratibha.net/ap-eapcet-resul...