మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

1,317 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాలు.డిసెంబరు 28లోగా భర్తీ

 రాష్ట్రవ్యాప్తంగా 1,317 పారామెడికల్‌, నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో 839 ఎఫ్‌ఎన్‌వో (ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ), 312 పారిశుద్ధ్య సహాయకులు, వాచ్‌మెన్‌, 17 గ్రేడ్‌-2 ఫార్మసిస్టు, 124 గ్రేడ్‌-2 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులున్నాయి. ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టు పోస్టుల్ని ఒప్పంద, ఎఫ్‌ఎన్‌వో, పారిశుద్ధ్య సహాయకుడు పోస్టుల్ని ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేస్తారు. ఈ పోస్టులన్నీ ప్రజారోగ్య శాఖ పరిధిలో పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాయి. నియామకాల ప్రక్రియను డిసెంబరు 28లోగా పూర్తిచేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో 264 వైద్యుల (సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌) పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయిలో మంగళవారం నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

LATEST POST

AP EAPCET - 2026 results released

AP EAPCET 2026 పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది AGRICULTURAL & PHARMACY RESULTS.. https://results.eenadupratibha.net/ap-eapcet-resul...