Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

టెన్త్, ఇంటర్ ఫలితాలకు హైపవర్ కమిటీలు

రాష్ట్రంలో కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ఎం.ఛాయారతన్ చైర్పర్సన్ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులను నియమించారు. ఈ మేరకు విద్యా శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులిచ్చా రు. ఈ కమిటీ పది పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏయే మార్కులను పరిగణనలోకి తీసుకోవాలో ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. కాగా.. ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలకు అనుసరించాల్సిన విధివిధానాలు నిర్ణయించడానికి ఛాయారతన్ నేతృత్వంలోనే మరో హైపవర్ కమిటీని కూడా విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...