Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

కరోనా వచ్చిన విద్యా సంస్థలు వెంటనే మూసివేయాలి : మంత్రి సురేశ్‌

కరోనా కేసులు నమోదైన విద్యాసంస్థలు వెంటనే మూసివేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆదేశించారు.

 రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో అకడమిక్‌ క్యాలెండర్‌ గాడిలో పెట్టామని చెప్పారు. పెద్ద ఎత్తున కరోనా సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుందని, దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే చేశామని పేర్కొన్నారు. కరోనా మళ్లీ పుంజుకుంటోందని, రెండు నెలలు జాగ్రత్త అవసరమని తెలిపారు.

రాజమహేంద్రవరంలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకిందని, కరోనా సోకినవారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతామని, ఆదివారాలు కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

No comments:

Post a Comment

LATEST POST

NMMS 2026 notification released Rc.No.208/NMMS/2026 dt: 10-09-2026

రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) పరీక్షను 15-11-2026 (ఆదివారం) ఉదయం 10.00 గంట...